రివ్యూ : హ్యాపీ వెడ్డింగ్

416

చాలా రోజుల నుంచి మీడియాలో హల్చల్ చేస్తున్న సినిమా హ్యాపీ వెడ్డింగ్.  మెగా డాటర్ నిహారిక ఈ సినిమాలో నటిస్తుండటం, సాహో సినిమాను నిర్మిస్తున్న యూవీ క్రియేషన్స్ సంస్థ ఈ సినిమాను నిర్మిస్తుండటంతో.. సినిమాపై అంచనాలు పెరిగాయి.  సుమంత్ అశ్విన్, నిహారిక జంటగా నటించిన ఈ సినిమా ఈరోజు విడుదలైంది.  మరి అంచనాలకు తగ్గట్టుగా సినిమా ప్రేక్షకులను ఆకట్టుకుండా లేదా ఇప్పుడు చూద్దాం.

Image result for happy wedding movie telugu

సుమంత్ అశ్విన్, నిహారికలు ప్రేమించుకుంటారు.  వీరి ప్రేమ గురించి వారి కుటుంబంలో తెలుస్తుంది.  రెండు కుటుంబాల సభ్యులు వారి ప్రేమను యాక్సెప్ట్ చేయడమే కాకుండా పెళ్లి చేయాలని నిశ్చయించుకుంటారు.  ఇద్దరికి ఎంగేజ్మెంట్ కూడా జరుగుతుంది.  అంతా హ్యాపీగా ఉంది అనుకుంటున్నా సమయంలో నిహారిక ఎక్స్ బాయ్ ఫ్రెండ్ రాజా ఎంటర్ అవుతాడు.  ఆ తరువాత, సుమంత్ అశ్విన్, నిహారికల మధ్య చిన్న గొడవ జరుగుతుంది.  దీంతో నిహారిక.. సుమంత్ అశ్విన్ ను పెళ్లి చేసుకోవాలా వద్దా అనే సందేహంలో పడుతుంది.  పెళ్లి సమయం దగ్గర పడుతున్న కొద్దీ నిహారిక కన్ఫ్యూషన్ లో పడిపోతుంది.  నిహారిక ఈ కన్ఫ్యూషన్ నుంచి ఎలా బయటపడింది.. సుమంత్ అశ్విన్, నిహారిక వివాహం ఎలా జరిగింది అన్నది మిగతా కథ.

Image result for happy wedding movie telugu

విశ్లేషణ :

సున్నితమైన కథకు బలమైన భావోద్వేగాలతో కూడిన సన్నివేశాలను రాసుకొని దానిని సినిమాగా చూపిస్తే ఎలా ఉంటుందో అలా ఉన్నది సినిమా.  ఒక సగటు అమ్మాయికి పెళ్లిపైన ఉండే కన్ఫ్యూషన్ ను చక్కగా చూపించాడు దర్శకుడు.  నిహారికకు అందంగా.. ఇన్నోసెంట్ గర్ల్ గా చూపించిన విధానం ఆకట్టుకుంటుంది.    పెళ్లికి ఓకే చెప్పి.. పెళ్లి చేసుకోబోయే ముందు వరకు అమ్మాయిల్లో ఒకరకమైన కన్ఫ్యూషన్ ఉంటుంది. దానిని తెరపై చూపించడంలో దర్శకుడు లక్ష్మణ్ కార్య సఫలం అయ్యాడు.

నటీనటుల పనితీరు : వివాహంపై కన్ఫ్యూషన్ ఉన్న అమ్మాయిగా నిహారిక నటన ఆకట్టుకుంటుంది.  నిహారికను అందంగా చూపించే ప్రయత్నం చేశాడు దర్శకుడు. భావోద్వేగాలను పలికించడంలో నిహారిక పాస్ మార్కులు తెచ్చుకుంది.  హీరోగా చేసిన సుమంత్ అశ్విన్ గతంలో కంటే మంచి పెర్ఫార్మన్స్ ఇచ్చాడు.  డైలాగ్స్ విషయంలో కొంచెం ఇంప్రూవ్ చేసుకుంటే బాగుంటుంది.  నిహారిక తండ్రి పాత్రలో మురళీ శర్మ మరోసారి మెప్పించాడు.  సుమంత్ అశ్విన్ తండ్రి పాత్రలో నరేష్ నవ్వులు పూయించాడు.  నిహారికకు గైడ్ చేసే పాత్రలో ఇంద్రజ తనదైన శైలిలో నటించి మెప్పించింది.  సీనియర్ నటులు ఎంత అవసరమో ఈ సినిమా చాటి చెప్పింది.

సాంకేతికం :

దర్శకుడు లక్ష్మణ్ కార్య బలమైన, భావోద్వేగాలతో కూడిన కథనాలను తెరపై చూపించడంలో సఫలం అయ్యాడు.  నిహారిక క్యారెక్టర్ ను డిజైన్ చేసిన తీరు బాగుంది.  శక్తికాంత్ కార్తీక్ సంగీతం బాగుంది.  పాటలు వినసొంపుగా ఉన్నాయి. తమన్ అందించిన బ్యాగ్ గ్రౌండ్ మ్యూజిక్ సినిమాకు హైలైట్.  బాలరెడ్డి ఫోటోగ్రఫి బాగుంది.  యూవీ క్రియేషన్స్ నిర్మాణ విలువలు బాగున్నాయి.  ప్రతి ఫ్రేమ్ చాలా రిచ్ గా కనిపించింది.

పాజిటివ్ పాయింట్స్ :

కథనాలు

డైలాగ్స్

బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్

నిహారిక

మైనస్ పాయింట్స్ :

స్లో నరేషన్

చివరిగా : అమ్మాయిలకు బాగా కనెక్ట్ అయ్యే సినిమా – హ్యాపీ వెడ్డింగ్