గూడచారి మూవీ రివ్యూ

455

హాలీవుడ్ స్థాయిలో తమ “గూఢచారి” సినిమాను రూపొందించామని ధియేటిరికల్ ట్రైలర్ ద్వారా అడవి శేష్ చెప్పకనే చెప్పగా, అందుకు ఏ మాత్రం తక్కువ కాదన్న విషయం ప్రస్తుతం సిల్వర్ స్క్రీన్ పై సందడి చేస్తోన్న సినిమా చెప్తోంది. ప్రీ రిలీజ్ పాజిటివ్ టాక్ తో విడుదలైన ఈ సినిమాకు ఫస్ట్ ఆట పడిన తర్వాత టాక్ అంతకు రెట్టింపుగా ఉండడం చిత్ర యూనిట్ కు ఉత్సాహాన్నిచ్చే అంశం.

Related image
చూసిన ప్రేక్షకులను సంతృప్తి పరచడంలో సక్సెస్ అయిన చిత్ర యూనిట్, విలన్ విషయంలో మాత్రం మాంచి ట్విస్ట్ ఇచ్చి ప్రేక్షకులను ఆశ్చర్యపరిచింది. ఆ ఆసక్తి అలాగే ఉండాలన్న కోణంలో విలన్ గా పోషించిన పేరును బయట పెట్టడం లేదు గానీ, ముఖ్యంగా ఇంటర్వెల్ బ్యాంగ్ ఎపిసోడ్ కు ప్రేక్షకులు ఫిదా అవుతున్నారు. ఒక నటుడిగానే కాకుండా రచయితగా కూడా తన సత్తా ఏమిటో అడవి శేష్ ఈ సినిమాతో నిరూపించుకున్నారు.

Image result for goodachari
ఉన్నతమైన సాంకేతిక విలువలతో అగ్ర హీరోల మూవీల మాదిరి రూపొందించిన ఈ సినిమాకు ఎంపిక చేసుకున్న కాస్టింగ్ ప్రధాన ప్లస్ పాయింట్. అరుదుగా కనిపించే నటీనటులను ఎంపిక చేసుకోవడమే కాకుండా, రొటీన్ గా కనిపించే వారిని కొత్తగా చూపించి ప్రేక్షకులకు ఫ్రెష్ నెస్ ను కలిగించింది. బాక్సాఫీస్ వద్ద ఖచ్చితంగా సందడి చేసే చిత్రంగా ఈ “గూఢచారి” నిలుస్తుందన్న ‘ఫస్ట్ టాక్’ ముక్తకంఠంతో వెలువడుతోంది.