నాగార్జున & నాని నటించిన దేవదాస్ సినిమా రివ్యూ

477

తెలుగు ఇండ‌స్ట్రీలో నానికి ఇప్ప‌డు ఉన్నా క్రేజ్ మాములుగా లేదు.. ఇక ముందు నుంచి తాను కూడా మ‌ల్టీస్టార‌ర్ సినిమాలు అద్బుతంగా చేస్తాను అనే నాని, తాజాగా నాగార్జున‌తో ఓ క్రేజీ మూవీ చేశారు.. అదే దేవ‌దాస్.. ఇక తెలుగు సినిమాలో మల్టీస్టారర్లు కొత్తేమీ కాదు అనేవారికి ఇది స‌రికొత్త సినిమాగా వ‌చ్చింది. ఇక ప్రిన్స్ మ‌హేష్ బాబు వెంక‌టేష్ న‌టించిన సీత‌మ్మ‌వాకిట్లో సిరిమ‌ల్లెచెట్టు నుంచి ఈ స్టార్ సినిమాల క్రేజ్ మ‌రింత పెరిగింది అనే చెప్పాలి.

Image result for devadas

కింగ్ నాగార్జున, నేచురల్ స్టార్ నాని హీరోలుగా వైజయంతీ మూవీస్ నిర్మించిన మల్టీస్టారర్ చిత్రం దేవదాస్.. మాఫియా డాన్ దేవ పాత్రలో నాగార్జున, డాక్టర్ దాస్ పాత్రలో నాని నటించారు. నాని సరసన రష్మిక, నాగార్జునకు జంటగా ఆకాంక్ష సింగ్ ఆడిపాడారు. ‘భలే మంచి రోజు’, ‘శమంతకమణి’ వంటి వైవిద్యభరిత చిత్రాలను తెరకెక్కించిన శ్రీరామ్ ఆదిత్య ఈ సినిమాకు దర్శకత్వం వహించారు. ఔట్ అండ్ ఔట్ కామెడీ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కిన ఈ చిత్రం వెండితెరపై నేడు విడుద‌ల అయింది.

Image result for devadas

సినిమా చూసిన వాళ్లు ట్విట్టర్ ద్వారా స్పందిస్తున్నారు.ఈ సినిమాలో నాని కామెడితో నూటికి నూరు శాతం న్యాయం చేశాడు అని అంటున్నారు..ఇక నాగార్జున‌ ప‌క్క‌న నాని కామెడీ అదిరిపోయింది..ఆయ‌న డాన్ పాత్ర‌ల‌లో అద్బుతంగా న‌టించారు.. ఇక హీరోయిన్లు సినిమాకు మ‌రింత ఆర్ష‌ణ‌గా నిలిచారు.. అలాగే ఇరువురికి డాన్ డాక్ట‌ర్ పాత్ర‌లు అద్బుతంగా సెట్ అయ్యాయి.. ఇక కెమెరా ప‌నిత‌నం అద్బుతం అని చెప్పాలి, నిర్మాణ విలువ‌లు బాగున్నాయి పాట‌లు కూడా సినిమాకు హైలెట్ గా నిలిచాయి. ఇక ద‌ర్శ‌కుడు ఆదిత్య శ్రీరామ్ కూడా తాను అనుకున్న క‌ధ‌ను అద్బుతంగా తెర‌కెక్కించారు.. శ్రీరామ్ ఆదిత్య స్టోరీపై బాగా కాన్స‌న్ట్రేష‌న్ పెట్టారు అని అంటారు.. ఇక కామెడీ అంటేనే నాని ఇందులో కూడా త‌న కామెడీతో నాని అల‌రించారు.

మొత్తానికి ల‌వ్ మాస్ యాక్ష‌న్ స‌స్పెన్స్ అన్నింటిలో నాగార్జున విభిన్న రోల్స్ చేయ‌గ‌ల‌రు…ఇప్పుడు కూడా అలాగే న‌టించారు ఇక నాగ్ -నాని న‌ట‌న‌తో మ‌రింత ఈ సినిమాకు ప్రధాన అసెట్ అయింది… ఇక నాగ్ 60 లో కూడా 16 కుర్రాడిలా క‌నిపించాడు.. నాగార్జున లుక్స్ తో మ‌రింత అందంగా ఉన్నాడు.. అయితే సెకండాఫ్ కాస్త నెమ్మ‌దించినా కామెడీ ట్రాక్ తో సినిమా ఫుల్ లెంగ్త్ హిట్ ట్రాక్ లో వెళ్లింది.

నటీనట : వర్గంనాగార్జున,నాని,రష్మిక మందన,ఆకాంక్ష సింగ్,వెన్నెల కిషోర్,రావు రమేష్,నవీన్ చంద్ర,నరేష్ వీకే,కునాల్ కపూర్
దర్శకత్వం :శ్రీరామ్ ఆదిత్య
శైలి           :Drama,Action,Comedy
విమర్శకుల రేటింగ్ : 3 / 5