ఏపీలో ముఖ్యమంత్రి యువనేస్తం పథకం ప్రారంభం

249

గ‌త ఎన్నిక‌ల స‌మ‌యంలో తెలుగుదేశం పార్టీ ఇచ్చిన హామీల్లో నిరుద్యోగ భృతి కూడా ఒక‌టి.. ఇక ఎన్నిక‌ల‌కు స‌మీపీస్తున్న స‌మ‌యంలో ఈ కార్య‌క్ర‌మాన్ని కూడా తెలుగుదేశం ఎంతో ప్ర‌తిష్టాత్మకంగా ప్ర‌వేశ‌పెట్టింది.. ఇక ఈ పార్టీ త‌ర‌పున ఇచ్చిన హామీని ఈసారి తెలుగుదేశం పార్టీ ఎన్నిక‌ల‌కు ముందే నిల‌బెట్టుకున్నాము అని చెబుతున్నారు, ఇక నేడు గాంధీ జ‌యంతి సంద‌ర్బంగా ఈ కార్య‌క్ర‌మానిక ఆయ‌న అంకురార్ప‌ణ చేశారు.

వ్యవసాయంనిరుద్యోగ యువతకు వరప్రదాయిని ‘ముఖ్యమంత్రి యువనేస్తం’ పథకం అమలులోకి వచ్చింది. మంగళవారం ఉదయం ముఖ్యమంత్రి చంద్రబాబు ఈ పథకాన్ని ప్రారంభించారు. ఉండవల్లి వేదికగా జరుగుతున్న ఈ కార్యక్రమానికి పెద్దఎత్తు యువత తరలివచ్చింది. ఈ సందర్భంగా యువతతో సీఎం చంద్రబాబు ముఖాముఖి నిర్వహించారు.

ఇక ఏపీలో పెట్టుబ‌డులు పెట్ట‌డానికి కంపెనీలు పెద్ద సంఖ్య‌లో వ‌స్తున్నాయి.. ఐటీ అలాగే ఫార్మా కంపెనీలు పెద్ద ఎత్తున వ‌స్తాయి అని చెబుతున్నారు.. వీటిలో ఉద్యోగాలు కూడా అలాగే ఉంటాయి అని చెప్పారు సీఎం చంద్ర‌బాబు. మొత్తానికి తెలుగుదేశం పార్టీ గ‌త ఎన్నిక‌ల్లో ఇచ్చిన హామీల్లో ఇది కూడా ఓ మెజార్టీ అని చెప్పాలి.. ఇప్పుడు తాజాగా ఈ నిర్ణ‌యం కూడా తీసుకోవ‌డంతో ఇప్పుడు యువ‌త అలాగే పార్టీ నాయ‌కులు కూడా దీనిపై ఆనందంలో ఉన్నారు..