జ‌గ‌న్ కు వీరు స‌పోర్ట‌ర్సా కాదా ?

411

వైసీపీ అధినేత‌కు బంధువులు సాయం చేస్తున్నారా వెనుక ఉండి పార్టీలో కొంద‌రు బ‌య‌ట‌కు వెళ్లేలా చేస్తున్నారా ఇప్పుడు ఇదే పెద్ద చ‌ర్చ‌నీయాంశ‌మైంది…తెలుగుదేశం పార్టీకి ఇటువంటి ప‌రిస్దితి లేదు కాని వైసీపీకి ఎక్కువ‌గా క‌నిపిస్తోంది…ముఖ్యంగా సీనియ‌ర్లు పార్టీలో ఉండ‌కుండా, వెనుక ఉండి ఏ నాటి నుంచో ఇలా సాయం చేస్తున్నారు.. కాని ఇప్పుడు వైసీపీలో దీనికంటే భిన్న ప‌రిస్దితులు క‌నిపిస్తున్నాయి.

Image result for jagan padayatra

జ‌గ‌న్ బంధుగ‌ణం ప్ర‌కాశం కృష్ణా గుంటూరు క‌డ‌ప‌లో ఇటువంటి రాజ‌కీయాలు చేస్తున్నారు అనేలా విమ‌ర్శ‌లు వ‌స్తున్నాయి.. ఇప్పుడు ప్ర‌కాశంలో కూడా వ‌ర్గ‌పోరుతో ఎంపీ సెగ్మెంట్ నుంచి ఎమ్మెల్యే సెగ్మెంట్ లోకి మారాలి అని చూస్తున్నారు ఇద్ద‌రు నేత‌లు. ఇలా పార్టీలో ఎందుకు జ‌రుగుతోంది అనేది వైసీపీ కూడా ముందే ఆలోచించుకోవాలి.. ఓ వైపు పాద‌యాత్రలో ఉన్న జ‌గ‌న్ కు ఈ విష‌యం తెలియ‌క‌పోవ‌చ్చు కాని ఇప్పుడు ఈ విష‌యం ఇలా వ‌దిలేస్తే పార్టీకి ఇది పెద్ద మైన‌స్ అవుతుంది.

Image result for jagan padayatraఇలా బంధుగ‌ణం అంతా జ‌గ‌న్ కు పార్టీ త‌ర‌పున ప్ల‌స్ అవ్వ‌కుండా మైన‌స్ అవుతున్నారు అని పార్టీలో కొంద‌రు చ‌ర్చించుకుంటున్నారు… ముఖ్యంగా జ‌గ‌న్ తాము ఏమి చెబితే అది వింటారు అనే ఆలోచ‌న వీరిలో ఉండ‌టం, వీరికి జ‌గ‌న్ కూడా అంతే ప్ర‌యారిటీ ఇవ్వ‌డం ముఖ్య‌మైన కార‌ణాలుగా తెలుస్తున్నాయి. మ‌రిజ‌గ‌న్ ఎటువంటి నిర్ణ‌యాలు ఈ విష‌యంలో తీసుకుంటారో చూడాలి.