కోడెల అంతిమ యాత్రకు వైసీపీ కండీషన్స్.. మరీ ఇంత దారుణమా..!

216

టీడీపీ సీనియర్ నేత, ఏపీ మాజీ స్పీకర్ కోడెల శివప్రసాద్ నేడు ఆత్మహత్య చేసుకుని చనిపోవడం ఏపీ రాజకీయాలలో తీవ్ర కలకలం రేపింది. అయితే కోడెల ఆత్మహత్యే చేసుకున్నాడని ఇందులో ఎవరి మీద తమకు అనుమానాలు లేవని కోడెల కుటుంబ సభ్యులు చెబుతున్నా కూడా కోడెల మృతిపై రకరకాల వాదనలు వినిపించాయి. అయితే కోడెల దేహానికి పోస్ట్‌మార్టం నిర్వహించిన వైద్యులు కోడెల ఉరివేసుకునే చనిపోయాడని, హతయ్ కాదు ఆత్మహత్యే అని తేల్చేసారు. అయితే కోడెలపై ప్రభుత్వం వైసీపీ ప్రభుత్వం పెడుతున్న చిత్రహింసను తట్టుకోలేకనే ఆయన ఈ అఘాయిత్యానికి పాల్పడ్డారని, ఈ ఘటన ముమ్మాటికే వైసీపీ రాజకీయ హత్యే అని టీడీపీ శ్రేణులు ఆరోపిస్తున్నారు. అయితే బ్రతికనన్ని రోజులు ఆయనపై పూర్తి ఒత్తిడి పెట్టి ఆత్మహత్య చేసుకునేలా ప్రేరేపించారు.

ఇక కోడెల శివప్రసాద్ పార్థీవ దేహం న‌ర‌స‌రావు పేట త‌ర‌లి వ‌చ్చే అవ‌కాశాలున్నందున ముంద‌స్తు జాగ్ర‌త్త‌గా నరసరావుపేట డివిజన్‌లో 144సెక్షన్ విధించినట్టు పోలీసులు తెలిపారు. కోడెల మృతితో.. శాంతిభద్రతల దృష్ట్యా ఎలాంటి అల్లర్లు జరగకుండా ఆంక్షలు విధించినట్టు నరసరావుపేట డీఎస్పీ వీరారెడ్డి సోమ‌వారం విడుద‌ల చేసిన ఓ ప్ర‌క‌ట‌న‌లో తెలిపారు. పట్టణంలోని అతిధి గృహాల వైపు రహదారులు, రైతు బజారు వెళ్లే దారులు, పట్టణంలో ఎక్కడ కూడా ఐదుగురు కంటే ఎక్కువ జనం కనిపించకూడదని ఉత్తర్వులు జారీచేశారు పోలీసులు. ఆర్ డీఓ విడుదల చేసిన ఉత్తర్వులు ప్రకారం ఎక్కువ మంది చేరి అనవసరంగా సమస్యలు సృష్టించవద్దని వారు విజ్ఞప్తి చేశారు. కోడెల మృతితో నియోజకవర్గంలో అల్లర్లు జరిగే అవకాశాలు ఉండడంతో పోలీసులు హై అలర్డ్ ప్రకటించారు. ఇప్ప‌టికే కోడెల మృతి పట్ల టీడీపీ నేతలు, కార్యకర్తలు దిగ్ర్భాంతి వ్యక్తం చేస్తున్నారు. ఆయనకు నరసరావుపేట, చుట్టు పక్కల గ్రామాల్లో భారీ అనుచర గణం ఉంది. వారంతా తమ ప్రియతమ నేత మృతిని జీర్ణించులేకపోతున్నారు. నరసరావుపేటలో టీడీపీ శ్రేణులు విషాదంలో మునిగిపోయారు. అయితే ఇప్పటికే కోట సెంటర్‌లోని ఆయన ఇంటికి అనుచరులు, అభిమానులు భారీగా తరలివస్తుండ‌టం. ఈ నేపథ్యంలో ఉద్రిక్త పరిస్థితులు, అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా ప్రభుత్వం నిషేధాజ్ఞ‌లు అమలు చేస్తున్న‌ట్టు పోలీసు వ‌ర్గాలు చెపుతున్నాయి.

Image result for kodela siva prasad

అయితే త‌న ఆత్మీయ నాయ‌కుని అంతిమ‌యాత్ర‌లో టిడిపి శ్రేణులు పాల్గొనకుండా చేసేందుకు ప్ర‌భుత్వం 144 సెక్ష‌న్ విధించింద‌ని టిడిపి వ‌ర్గాలు ఆరోపిస్తున్నాయి. దీంతో కోడెల అంతిమ‌యాత్ర వ్య‌వ‌హారం ఆస‌క్తి కరంగా మారింది. అయితే ఇప్పుడు ఆయన అంతిమ యాత్రపై కూడా వైసీపీ ప్రభుత్వం కండీషన్లు పెడుతుండడం నిజంగా బాధాకరమైన విషయమే. అయితే దీనిపై నారా లోకేశ్ స్పందిస్తూ ఆఖరికి కోడెల శివప్రసాద్ గారి అంతిమయాత్రని అడ్డుకునేందుకు దిగజారుడు రాజకీయాలు చేస్తున్నారా జగన్ గారు అంటూ, అక్రమ కేసులతో మానసికంగా వేధించి వారి మృతికి కారణమయ్యారు. ఇప్పుడు ఆయన అంతిమయాత్రను ఆపేందుకు శాంతిభద్రతల పేరుతో నర్సరావుపేట డివిజన్ మొత్తం 15 రోజులపాటు 144 సెక్షన్ అమలుచేస్తారా ఇది నిజంగా మీ దిగజారుడు తనానికి నిదర్శనం అని అంతిమ యాత్రకు 144 సెక్షన్ అమలు చేయడం సరికాదని మండిపడ్డారు. కోడెల శివప్రసాద్ కొడుకు కోడెల శివరాం కెన్యా నుంచి బయల్దేరారు. ఈరోజు మధ్యాహ్నానానికి ఆయన గుంటూరు జిల్లాకు చేరుకునే అవకాశం ఉంది. అయితే 144సెక్షన్ ప్రకటించిన క్రమంలో అంతిమ యాత్ర జరగనుందా? అనే విషయంపై అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. మరి కోడెల అంతిమయాత్ర విషయంలో ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం మీద మీ అభిప్రాయాలను మాకు కామెంట్ రూపంలో చెప్పండి.