గుంటూరులో వైసీపీ హూదా కై పోరు

358

ఏపీకి ప్ర‌త్యేక హూదా విష‌యంలో తెలుగుదేశం బీజేపీ ఏపీకి అన్యాయం చేశాయ‌ని ఈ విష‌యంలో ప్ర‌ధాని న‌రేంద్ర‌మోడీ అలాగే సీఎం చంద్ర‌బాబు ప్రజాద్రోహులుగా నిలిచిపోతారు అని విమ‌ర్శ‌లు చేశారు వైసీపీ నాయ‌కులు.. నేడు గుంటూరులో తలపెట్టిన వంచనపై గర్జన దీక్షలో వైసీపీ నాయ‌కులు అంద‌రూ పాల్గొన్నారు.. గ‌త ఎన్నిక‌ల్లో ఏపీ ప్ర‌జ‌ల‌కు చంద్రబాబు 600 హామీలు ఇచ్చార‌ని అవి ఒక్క‌టి కూడా నెర‌వేర్చ‌లేదు అని వైసీపీ నాయ‌కులు ప్ర‌శ్నించారు..

Image result for botsa satyanarayana

చంద్ర‌బాబును ప్ర‌జ‌లు ఎవ‌రూ న‌మ్మ‌రు అని విమ‌ర్శంచారు వైయ‌స్సార్ సీపీ అగ్ర‌నేత తిరుప‌తి నాయ‌కుడు భూమన కరుణాకర్‌ రెడ్డి.. చంద్రబాబు రాజకీయ జీవితం వంచనతోనే ప్రారంభమైందని ఆయన ఎద్దేవా చేశారు… నాలుగేళ్లుగా చంద్రబాబు చేస్తున్న వంచన, మోసం, దగాకు వ్యతిరేకంగానే వంచనపై గర్జన దీక్ష చేస్తున్నట్లు తెలిపారు. చంద్రబాబు చేస్తున్న వంచనను ప్రజలకు చెప్పడమే తమ లక్ష్యమని స్పష్టం చేశారు. ఏపీకి హోదా అవసరం లేదన్నట్లుగా చంద్రబాబు, మోదీలు వ్యవహరిస్తున్నారని ఆయ‌న అన్నారు… ఇప్ప‌టికే తెలుగుదేశానికి ప్యాకేజీ అంటేనే ఇష్టం అని విమ‌ర్శించారు ఆయ‌న‌.

Image result for alla ramakrishna reddy

ఇక తెలుగుదేశం సర్కారు తీసుకునే నిర్ణ‌యాలు కూడా ప్ర‌జ‌ల‌కు న‌చ్చ‌డం లేద‌ని అంటున్నారు… వంచ‌న గ‌ర్జ‌న‌లో పాల్గొన్నబొత్సా స‌త్య‌నారాయణ ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నాలుగేళ్లుగా ప్రజలను మోసం చేశారని అన్నారు. . బాబు మోసాలపై ప్రజలను చైతన్యం చేసేందుకే వంచనపై గర్జన దీక్ష చేపట్టామన్నారు.గుంటూరులోని ఇన్న‌ర్ రింగ్ రో్డ్ వీఆర్ గార్డెన్స్ లో దీక్ష జ‌రుగుతోంది.