జగన్ చేతిలో PK సర్వే…పార్టీ నేతల్లో వణుకు…

447

వచ్చే సార్వత్రిక ఎన్నికలు దగ్గరపడుతున్న కొద్దీ పార్టీలు తాము గెలిచే అభ్యర్దుల వేటలో పడ్డాయి..ప్రతిపక్ష నాయకుడు వై ఎస్ ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జగన్  ప్రజా సంకల్ప యాత్ర పేరుతో పాదయాత్ర చేస్తూ జనాలతో మామేకం అవుతున్నారు..మరో పక్క జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ప్రజా పోరాట యాత్ర పేరుతొ జిల్లాలు చుట్టు ముడుతున్నారు..2019 ఎన్నిక‌ల్లో అధికార‌మే ప‌ర‌మావ‌ధిగా అన్ని పార్టీలు పావులు క‌దుపుతున్నాయి.

ఇక అన్ని పార్టీలు తమ అభ్యర్దుల వేటలో ఉన్నాయి..ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తమ పార్టీ ఎమ్మెల్యేలు నాయకుల పని తీరుపై సర్వే నివేదికలు తెప్పించుకొని అభ్యర్దుల ఎంపిక పై దృష్టి సారించారు..ఇక జ‌న‌సే కూడా ఒంట‌రిగా అన్ని సీట్ల‌ల్లో పోటీచేస్తామ‌ని ప్ర‌క‌టించింది. ఇక వైసీపీ ఒక‌డుగు ముందుకేసి నియోజకవర్గాల్లో వివిధ పార్టీల బలాలు, గెలుపు గుర్రాలు ఎవరు? ఏ నాయకుడికి, ఏ సామాజికవర్గానికి టికెట్ ఇస్తే గెలుపు అవకాశాలు ఎక్కువగా ఉంటాయి తదితర వివరాలలో కూడిన సర్వేను వైసీపీ పూర్తి చేసింది.

వైసీపీ ఎన్నిక‌ల వ్యూహ‌క‌ర్త పీకే టీమ్ ఈ స‌ర్వేను పూర్తి చేసి జ‌గ‌న్‌కు అందించిన‌ట్లు తెలుస్తోంది.పార్టీ నేతలకు కూడా ఏ మాత్రం సమాచారం లేకుండానే ఈ సర్వేను పీకే టీమ్ పూర్తి చేసింది. వివిధ వర్గాల ప్రజలతో వారు మమేకమై అభిప్రాయాలను సేకరించారు. ఈ సర్వే నివేదిక ఆధారంగానే పలువురు నేతలకు జగన్ ఇప్పటికే పరోక్ష సంకేతాలను పంపినట్టు సమాచారం. ప్రస్తుతం వైసీపీ నేతల్లో ఈ సర్వే గుబులు రేపుతోంది. రానున్న ఎన్నికల్లో తమకు టికెట్ దక్కుతుందో, దక్కదో అని పలువురు నేతలు టెన్షన్ కు గురవుతున్నారట.