వైఎస్ భారతి పై తప్పుడు కధనాలు…జగన్ ఆవేదన..

114

ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్ష నాయకుడు వై ఎస్ ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వై ఎస్ జగన్మోహన్ రెడ్డి అక్రమాస్తుల కేసులో తొలిసారి ఆయన సతీమణి భారతి పై అభియోగాలు నమోదయ్యాయి..భారతి సిమెంట్స్ లో పెట్టుబడుల వ్యవహారంలో జగన్‌తోపాటు భారతిని కూడా నిందితురాలిగా చేరుస్తూ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఈడీ) సీబీఐ ప్రత్యేక కోర్టులో ఇటీవల చార్జిషీటు దాఖలు చేసినట్లు తెలుగుదేశం పార్టీ అనుకూల మీడియాలో వార్తలు వ‌చ్చిన సంగ‌తి తెలిసిందే…

అసలు విషయానికి వస్తే జగన్ భార్య భారతి పేరును చార్జ్ షీట్లో దాఖలు చేయడానికి ఈడి కోర్టు అనుమతి అడిగింది…అందుకు అనుమతి లభిస్తుందో లేదో కాని పచ్చ మీడియా మాత్రం తన పైత్యాన్ని చాటుకుంది..వైఎస్ భారతి పేరును సీబీఐ అయితే వదిలింది కానీ, ఈడీ మాత్రం వదల్లేదని, రేపటి నుంచి జగన్ సతీసమేతంగా కోర్టుకు హాజరు కావాలని తెలుగుదేశం అనుకూల పత్రికలో వార్త‌ను ప్ర‌చురించింది. ఈ తప్పుడు వార్త‌ల‌పై జ‌గ‌న్ తీవ్రంగా స్పందించారు. తన ఆస్తుల కేసులో తన సతీమణి వైఎస్ భారతిని ముద్దాయిగా చేర్చారంటూ వచ్చిన వార్తలపై వైఎస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ స్పందించారు. ట్విట్టర్ వేదికగా ఆయన తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. ఈడీ తన భార్యను ముద్దాయిగా చేర్చిందంటూ ఒక వర్గం మీడియాలో వార్తాకథనాలు వచ్చాయి, అది చూసి తాను షాక్ కు గురయ్యానని ఆయన అన్నారు.తన కుటుంబాన్ని కూడా వదిలిపెట్టడం లేదని, రాజకీయాలు అంతగా దిగజారడం చూసి విచారం వేసిందని ఆయన అన్నారు.