రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ ఎన్నికల్లో బిజెపి కి వ్యతిరేకంగా ఓటు వేస్తాం..జగన్ సంచలన ప్రకటన…

391

రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ ఎన్నిక ఈ నెల 9 న జరగనుంది…ఇప్పటివరకు డిప్యూటీ చైర్మన్ గా ఉన్న కాంగ్రెస్ అభ్యర్ది పిజే కురియన్ జూన్ లో రిటైర్ కావడంతో ఈ ఎన్నిక అనివార్యమయింది..అయితే ఈ ఎన్నిక ఇప్పుడు ఆసక్తికరంగా మారింది…ఈ ఎన్నికల పోరు నువ్వా నేనా అన్నట్టుగా ఉంది..అధికార బిజెపి పార్టీకి ఎగువ సభలో సరైన సంఖ్యా బలం లేకపోవడమే దీనికి కారణం..బిజెపి ఈ ఎన్నికలో గెలవడానికి అన్ని రకాల మార్గాలను వెతుకుతోంది…ఈ క్రమంలో ఇతర పార్టీల మద్దతును కూడగడుతోంది..బిజెపి తమ మిత్రపక్షం జేడియూ అభ్యర్దిని తమ అభ్యర్దిగా ప్రకటించింది…

రాజ్య‌స‌భ డిప్యూటీ ఛైర్మెన్ ఎన్నిక‌లో ఏపీలోని పార్టీలు కూడా కీల‌కం కానున్నాయి. గ‌తంలో రాష్ట్ర‌ప‌తి, ఉప‌రాష్ట్ర‌ప‌తి ఎన్నిక‌కు మ‌ద్ద‌తు తెలిపిన వైసీపీ డిప్యూటీ ఛైర్మెన్ ఎన్నిక‌లో మాత్రం ఎన్డీఏకు గ‌ట్టి షాక్ ఇచ్చింది. ఈనెల 9 న‌జ‌రిగే ఓటింగ్‌లో ఎన్డీఏ అభ్యర్ధికి వ్యతిరేకంగా ఉండాలని వైసీపీ నిర్ణయం తీసుకొంది. రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ ఎన్నికపై వైసీపీ తన వైఖరిని స్పష్టం చేసింది. ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదాతో పాటు, విభజన హామీల అమలులో కేంద్ర ప్రభుత్వ వంచనకు నిరసనగా ఎన్ డీఏ లేదా బీజేపీ అభ్యర్థికి వ్యతిరేకంగా ఓటు వేయాలని వైసీపీ నిర్ణయించింది. ఏపీకి ఇచ్చిన హమీలను అమలు చేయనందుకే తమ పార్టీ ఎన్డీఏ అభ్యర్ధికి వ్యతిరేకంగా ఓటు చేయాలని నిర్ణయం తీసుకొన్నట్టు వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి ప్రకటించారు.