తండ్రి చనిపోయాక మొదటిసారి మీడియా ముందుకు వచ్చి చంద్రబాబు కి దిమ్మతిరిగే షాకిచ్చిన YS వివేకా కూతురు

358

వైయ‌స్ వివేకానంద‌రెడ్డి హ‌త్య కేసులో రోజుకో కొత్త విష‌యం బ‌య‌ట‌కు వ‌స్తోంది, ఓ ప‌క్క సిట్ విచార‌ణ‌లో అనేక విష‌యాలు వెలుగులోకి వ‌స్తున్నాయి, అలాగే ప‌లువురు కీల‌కమైన స‌న్నిహితుల‌ను సిట్ ఇప్ప‌టికే విచారిస్తోంది, ముఖ్యంగా గంగిరెడ్డి, ప‌ర‌మేశ్వ‌ర‌రెడ్డి చుట్టు ఈ హ‌త్య కేసు ఉచ్చు బిగుస్తోంది.. తాజాగా వైయ‌స్ వివేకా కుమార్తె మీడియాముందు కొన్ని కీల‌క విష‌యాలు తెలియ‌చేశారు.. మీ తండ్రి మరణంపై మీకేమైనా అనుమానాలున్నాయా’ అని వైఎస్ వివేకా కుమార్తె సునీతారెడ్డిని మీడియా అడగ్గా.. దర్యాప్తు ప్రక్రియ కొనసాగుతోందని, తానేమనుకుంటున్నానో చెబితే ఇక దర్యాప్తు చేయడం ఎందుకని ఆమె ప్రశ్నించారు. సిట్ విచారణ నిష్పాక్షికంగా జరుగుతున్నప్పుడు దర్యాప్తును ప్రభావితం చేసేలా మాట్లాడటం సరికాదని ఆమె వ్యాఖ్యానించారు. లేఖలోని చేతిరాత వివేకాదేనని మీరు ఒప్పుకున్నారని కడప ఎస్పీ చెప్పారని.. నిజమేనా అని ఆమెను ప్రశ్నించగా.. ఆ చేతిరాత తన తండ్రిదో, కాదో ఫోరెన్సిక్ నివేదికలో తెలిసిపోతుందని, ఇందులో తాను చెప్పడం, ఇంకొకరు చెప్పడం కాదని.. ఫోరెన్సిక్ స్పష్టం చేస్తుందని ఆమె చెప్పారు. విచారణ నిష్పాక్షికంగా జరగాలని, దోషులకు శిక్ష పడాలని ఆమె చెప్పారు. ఇంతకు మించి తానున్న పరిస్థితుల్లో ఏం చెప్పినా బాగుండదని, దయచేసి అర్థం చేసుకోవాలని వైఎస్ వివేకానందరెడ్డి కుమార్తె సునీతారెడ్డి అభ్యర్థించారు.

ఈ క్రింది వీడియో చూడండి

జగన్‌ సీఎం కావాలని తన తండ్రి కోరుకున్నారని, ఆయన కల అదేనని సునీత చెప్పారు. తమ కుటుంబంలో ఎలాంటి విభేదాలు లేవని, 700 మంది సభ్యులు ఉన్న పెద్ద కుటుంబం తమదని ఆమె తెలిపారు. ఇంత పెద్ద కుటుంబంలో చిన్న చిన్న విభేదాలు సహజమని, దర్యాప్తు సాగుతుండగా తమ అభిప్రాయాలు ఎలా చెబుతామని సునీత ప్రశ్నించారు. మ‌రో ప‌క్క తెలుగుదేశం నేత‌లు సీఎం చంద్ర‌బాబు కూడా వివేకా హ‌త్య కేసు విష‌యం ద‌ర్యాప్తు జ‌రుగుతున్నా దీనిని రాజ‌కీయం చేసి ప్ర‌చార స‌భ‌ల్లో మాట్లాడ‌టం పై ఆమె విచారం వ్య‌క్తం చేశారు, ఇలాంటి వ్యాఖ్య‌లు స‌రికావు అని చెప్పారు, త‌న తండ్రి మ‌ర‌ణిస్తే దీనిని రాజ‌కీయం చేస్తున్నార‌ని సిట్ స‌రైన ఆధారాల‌తో సాక్ష్యాల‌తో దోషుల‌ని శిక్షించాల‌ని ఆమె కోరారు.

Image result for ys vivekananda reddy daughter

హంతకులను గుర్తించడం ముఖ్యమని ఆమె చెప్పారు. తన తండ్రి చనిపోయారని తామంతా బాధపడుతుంటే నెగిటివ్ వార్తలు ప్రచారం చేయడం తగదని వివేకా కుమార్తె హితవు పలికారు. అలా అవాస్తవాలు ప్రచారం చేయడం ఎంతవరకూ సమంజసమని ఆమె ప్రశ్నించారు. రాజకీయ నాయకులకు, మీడియాకు తనది ఒకటే విన్నపమని, తన తండ్రి ఇప్పటికీ బ్రతికి ఉంటే ఎలాంటి గౌరవం చూపుతారో… ఇప్పుడు కూడా అదే తరహాలో వ్యవహరించాలని ఆమె అభ్యర్థించారు. అయితే తెలుగుదేశం నేత‌లు రెండు రోజులుగా వివేకా హ‌త్య‌కు వైయ‌స్ కుటుంబానికి సంబంధం ఉంది అని చేస్తున్న, విమ‌ర్శ‌ల‌తో ఆమె మీడియా ముందు ఈ విష‌యాలు తెలియ‌చేశారు. మొత్తానికి కుటుంబం క‌ల‌హాలు లేవ‌ని కేవ‌లం కొంద‌రు దుష్ప్ర‌చారం చేస్తున్నారు అని ఆమె మీడియాకు వెల్ల‌డించారు.