వైఎస్ వివేకానందరెడ్డి చనిపోబోయే ముందు రోజు ఏం జరిగిందో తెలిస్తే షాక్ అవుతారు

435

వైఎస్ రాజశేఖర్ రెడ్డి సోదరుడు, జగన్ బాబాయి మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి శుక్రవారం తెల్లవారుజామున హఠాన్మరణం చెందారు. వివేకానంద రెడ్డి గుండెపోటుతో మృతిచెందినట్టు కుటుంబసభ్యులు వెల్లడించారు. గుండెపోటుతో బాత్‌రూమ్‌లో మృతిచెంది ఉండగా ఆయనను కుటుంబసభ్యులు గుర్తించినట్టు తెలుస్తోంది. అర్ధరాత్రి బాత్‌రూమ్‌కు వెళ్లిన ఆయన అక్కడే గుండెపోటుకు గురయ్యారు. పులివెందులలోని తన స్వగృహంలోనే కన్నుమూశారు. వైఎస్ వివేకానందరెడ్డి భార్య సౌభాగ్య, ఒక కుమార్తె ఉన్నారు.వైఎస్ వివేకానందరెడ్డి రాజకీయాల్లో కీలక పాత్ర పోషించారు. కడప, పులివెందులపై తనదైన ముద్ర వేశారు.1950, ఆగస్టు 8న జన్మించిన వైఎస్ వివేకానందరెడ్డి.. వైఎస్ కుటుంబంలో వైఎస్ రాజశేఖర్ రెడ్డి తరువాత రాజకీయాల్లో రాణించిన నేతగా గుర్తింపు తెచ్చుకున్నారు. పులివెందుల నుంచి 1989, 1994లో ఎమ్మెల్యేగా వ్యవహరించిన వైఎస్ వివేకా… 1999, 2004లో కడప ఎంపీగా గెలుపొందారు.

Image result for ys vivekananda reddy

చనిపోయే ముందు రోజు అంటే గురువారం కూడా చాలా ఎక్కువగా ప్రచారం చేసినట్టు సమాచారం. ప్రతి ఇంటికి వెళ్లి గడపగడప తొక్కి ఒక్కొక్కరిని పేరు పేరున పిలిచి వాళ్ళ క్షేమ సమాచారం తెలుసుకుని తమకు ఓటు వెయ్యమని కోరడంట. అలాగే గత కొన్ని రోజులుగా పార్టీ పనుల్లో చాలా బిజీగా గడుపుతున్నాడని అస్సలు బాడీకి కొంచెం కూడా రెస్ట్ లేకుండా పనిచేస్తున్నాడంట. గత ఐదారు రోజులుగా వైసీపీ అభ్యర్థుల ఎంపికలో జగన్‌కు తోడుగా ఉన్న వివేకా, గురువారం రాత్రే పులివెందులకు వచ్చారు. వచ్చేసరికి అర్ధరాత్రి కావడం, బాగా అలసిపోవడంతో వెంటనే నిద్రకు ఉపక్రమించారు. తెల్లవారుజామున వాంతులు మొదలుకావవడంతో బాత్‌రూమ్‌లోకి వెళ్లి అక్కడే కుప్పకూలారు. ఆ సమయంలో ఇంట్లో వివేకానందరెడ్డి ఒక్కరే ఉన్నారు. ఇంట్లో ఎవరూ లేకపోవడంతో స్నానాల గదిలోనే ఆయన ప్రాణాలు కోల్పోయారు.

ఈ క్రింది వీడియో చూడండి

వైఎస్ వివేకా హఠాన్మరణంతో వైసీపీ నేతలు, శ్రేణులు తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యారు. వచ్చే ఎన్నికల్లో కడప ఎంపీ సీటుకు వైఎస్ వివేకా పేరు పరిశీలనలో ఉండగా అంతలోనే ఆయన కన్నుమూశారు. చాలా సౌమ్యుడిగా పేరుపొందిన వైఎస్‌ వివేకానందరెడ్డి హఠాన్మరణం కడప జిల్లాతో పాటు, వైఎస్సార్‌ అభిమానుల్లో విషాదఛాయలు నింపింది.లయిన్స్ క్లబ్‌ తరఫున అనేక సామాజిక సేవా కార్యక్రమాల్లోనూ వివేకా చురుకుగా పాల్గొన్నారు. లింగాల కాల్వకు డిజైన్ రూపకల్పన చేసింది కూడా ఆయనే. వైఎస్ వివేకానందరెడ్డి మరణం వైసీపీకే కాదు, కడప జిల్లాకు కూడా తీరనిలోటని అన్ని రాజకీయ పార్టీలూ పేర్కొన్నాయి. సోదరుడు ముఖ్యమంత్రిగా ఉన్నా సాధారణ వ్యక్తిలా చిన్న చిన్న పనుల కోసం కూడా ఆయనే స్వయంగా ఆఫీసులకు వెళ్లేవారని ఆయన సన్నిహితులు పేర్కొంటున్నారు. ఆయన మృతితో అటు పులివెందులతో పాటు కడప జిల్లా మొత్తంలో విషాదఛాయలు అలుముకున్నాయి. పలువురు రాజకీయ నాయకులూ ఆయన మృతికి నివాళి అర్పిస్తున్నారు. మనం కూడా కామెంట్ రూపంలో ఆయనకు నివాళి అర్పిద్దాం.