వైఎస్ వివేకానంద రెడ్డి పోస్ట్ మార్టం రిపోర్ట్ లో బయటపడ్డ సంచలన నిజాలు

324

మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి శుక్రవారం తెల్లవారుజామున పులివెందులలో గుండెపోటుతో కన్నుమూసిన విషయం తెలిసిందే. గుండెపోటుతో బాత్‌రూమ్‌లో మృతిచెంది ఉండగా ఆయనను కుటుంబసభ్యులు గుర్తించినట్టు తెలుస్తోంది. అర్ధరాత్రి బాత్‌రూమ్‌కు వెళ్లిన ఆయన అక్కడే గుండెపోటుకు గురయ్యారు. వైఎస్ వివేకానందరెడ్డి భార్య సౌభాగ్య, ఒక కుమార్తె ఉన్నారు. నిన్నంత ఎంతో ఉత్సాహంగా ప్రజలతో మమేకమైన ఆయన అంతలోనే గుండెపోటుతో ప్రాణాలు కోల్పోవడం వైసీపీ నేతలు దిగ్భ్రాంతికి గురవుతున్నారు. మరోవైపు, వైఎస్ వివేకా మరణంపై పోలీసుల విచారణ ప్రారంభమైంది. ఆయన విగతజీవిగా ఉన్న ప్రదేశంలో రక్తపు మరకలు కనిపించడంతో, ఉన్నతాధికారులు డాగ్ స్క్వాడ్ ను రప్పించారు.

Image result for ys vivekananda reddy

అయితే బాత్‌రూమ్‌లో వైఎస్ వివేకానందరెడ్డి విగతజీవిగా పడి ఉండటం, ఆయన తల, చేతులకు బలమైన గాయాలు ఉండటంతో మృతి వెనుక అనుమానాలు వ్యక్తం చేస్తూ పీఏ కృష్ణారెడ్డి పోలీసులను ఆశ్రయించారు. దీంతో పోలీసులు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. బాత్‌రూమ్‌లో ఆయన జారిపడి ఉండవచ్చని, ఆ సమయంలో తలకు గాయమైనట్టు పోలీసులు భావిస్తున్నా, ఐపీసీ సెక్షన్ 175 కింద మాత్రం కేసు నమోదు చేశారు. పోలీసులు వచ్చేసరికే ఆయన నివాసం బంధువులు, కార్యకర్తలతో నిండిపోయింది. కాబట్టి డాగ్ స్క్వార్డ్ తో అంత ఇంపార్టెంట్ న్యూస్ ఏమి తెలియలేదు. ఆయన మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ హాస్పిటల్‌కు తరలించారు. పోస్ట్ మార్టం కంప్లీట్ అయ్యింది. అయితే పోస్ట్ మార్టం లో కొన్ని సంచలన నిజాలు బయటపడ్డాయి.

ఈ క్రింది వీడియో చూడండి 

చాలా మంది అనుమానిస్తున్నట్టు వైఎస్ వివేకానందరెడ్డిది హత్యనే.. పోస్ట్ మార్టం రిపోర్ట్ లో ఈ విషయం తెలిసింది. వివేకానంద రెడ్డి డెడ్ బాడీ మీద మొత్తం ఏడూ కత్తిపోట్లు ఉన్నాయి.పదునైన ఆయుధంతో తల శరీరం మీద ఏడుసార్లు గాయం చేసినట్టు సమాచారం. తొడభాగంలో ఒక గాయం చేతిపైన మరొక గాయం తలా వెనుక భాగంలో మరొక గాయం ఉంది. నుదుటి మీద రెండు గాయాలు.. ఇలా మొత్తం ఎదుగాయాలు అయినట్టు ప్రాథమిక నిర్దారణలో తేలింది.దీంతో పోలీస్ యంత్రాంగం అప్రమత్తమైంది. వెంటనే కేసు నమోదు చేసుకుని విచారణ చెయ్యడానికి పోలీస్ యంత్రాంగం సిద్దమయ్యింది. వివేకాది హత్య అని తెలియగానే వైఎస్ కుటుంబం ఒక్కసారిగా షాక్ అయ్యింది. ఎవరు హత్య చేశారు ఎందుకు హత్య చేశారు అనే విషయాలు విచారణలో తేలనున్నాయి.మరి మీరేమంటారు. వివేకానందరెడ్డిని ఎవరు హత్య చేసి ఉంటారు. పోస్ట్ మార్టం రిపోర్ట్ లో బయటపడ్డ విషయాల గురించి మీ అభిప్రాయాలను మాకు కామెంట్ రూపంలో చెప్పండి.