YS వివేకానందరెడ్డి ని చంపింది వీళ్ళే.. సంచలనం రేపుతున్న CCTV వీడియో పుటేజ్

456

క‌డ‌ప జిల్లాలో విషాదం నెల‌కొంది, ఎన్నిక‌లవేళ వైసీపీకి పెద్ద షాక్ అనే చెప్పాలి. వైయ‌స్ రాజ‌శేఖ‌ర్ రెడ్డి సోద‌రుడు వైయ‌స్ వివేకానంద‌రెడ్డి మ‌ర‌ణం ఆ పార్టీని తీర‌ని విషాదంలో నెట్టివేసింది. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డికి వివేకానందరెడ్డి సొంత తమ్ముడు. ఆయన అకాల మరణం వైసీపీ శ్రేణులను దిగ్ర్భాంతికి గురిచేసింది. వివేకానందరెడ్డి మృతిపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. వివేకాది హత్యేనని పోలీసులు అంటున్నారు. పోస్టుమార్టం రిపోర్టులో మర్డర్‌గా తేలిందని పోలీసులు చెబుతున్నారు. పోర్టుమార్టం అనంతరం వివేకా పార్థివదేహాన్ని కుటుంబసభ్యులకు పోలీసులు అప్పగించారు. రిమ్స్‌ వైద్యుల పర్యవేక్షణలో పోస్టుమార్టం నిర్వహించారు. ఆయన శరీరంపై ఏడు కత్తి గాయాలున్నట్లు వైద్యులు ప్రాథమిక నివేదికలో పేర్కొన్నారు. పదునైన ఆయుధంతో వివేకా తల, శరీరంపై ఏడుసార్లు దాడి చేసినట్లు వైద్యులు గుర్తించారు. నుదిటిపై లోతైన రెండు గాయాలు, తలవెనుక భాగంలో.. తొడ భాగం, చేతిపైనా గాయాలున్నట్లు వైద్యులు తెలిపారు.

ఈ క్రింది వీడియో చూడండి 

పులివెందులలోని స్వగృహంలోనే ఆయన గుండెపోటుతో మృతి చెందినట్లు తొలుత వార్తలొచ్చాయి. అయితే వివేకా శరీరంపై బలమైన గాయాలుండటంతో పలు అనుమానాలు వ్యక్తమయ్యాయి. దీంతో వివేకా పీఏ కృష్ణారెడ్డి పోలీసులకు ఫిర్యాదు చేశారు. వివేకా తల, చెయ్యికి గాయాలు కావడంపై అనుమానం మరింత పెరిగింది. పోస్టుమార్టం అనంతరం వివేకా భౌతికకాయాన్ని పులివెందులలోని నివాసానికి తరలించారు. వివేకా తలపై, చేతిపై గాయాలున్నాయని ఎస్పీ రాహుల్‌దేవ్‌శర్మ వెల్లడించారు. హత్య ప్రదేశంలో ఫింగర్ ప్రింట్స్ దొరికాయని ఆయన చెబుతున్నారు. గురువారం రాత్రి 11:30 గంటల నుంచి ఉదయం 5 గంటలలోపు ఏం జరిగిందో తెలుసుకున్నామని ఎస్పీ చెప్పారు. ఇక ముందుగా.

Image result for ys vivekananda reddy dead body

వైఎస్‌ వివేకానంద మృతిపై విచారణకు రాష్ట్ర ప్రభుత్వం సిట్‌ ఏర్పాటు చేసింది. అడిషనల్‌ ఎస్పీ బి.లక్ష్మీనారాయణ ఆధ్వర్యంలో సిట్ ఏర్పాటైంది. వివేకా మృతిపై సమగ్ర దర్యాప్తు చేయాలని సీఎం చంద్రబాబు ఆదేశించారు. అనుమానాస్పద మృతి వార్తలపై చంద్రబాబు తక్షణమే స్పందించారు. దోషులను వెంటనే అరెస్ట్ చేయాలని చంద్రబాబు ఆదేశించారు. నిందితులు ఏ స్థాయి వారైనా కఠినంగా శిక్షించాలని ఆయన స్పష్టం చేశారు. ఇక రాత్రి 11 గంట‌ల నుంచి ఉద‌యం ఐదు గంట‌ల వ‌ర‌కూ ఏమి జ‌రిగింది అనేది పులివెంద‌ల‌లో ఆయ‌న ఇంటి చుట్టు ప‌క్క‌న ఉండే సీసీ కెమెరాల పుటేజీని ప‌రిశీలిస్తున్నారు, ముఖ్యంగా వైయ‌స్ వివేకా ఇంటికి సీసీ కెమెరాలు లేవు దీంతో చుట్టు ప‌క్క‌ల షాపులు అలాగే ఇంటి కెమెరాల పుటేజీని సేక‌రించారు. ఇక్క‌డ ఎవ‌రైనా అనుమానాస్ప‌దంగా తిరిగారా , ఏమైనా వాహ‌నాలు ఉన్నాయా అనే విష‌యంలో ప‌రిశీలన చేస్తున్నారు.ఇక్క‌డ దాదాపు నాలుగు గంట‌ల పుటేజీని ఇప్ప‌టికే సిట్ అధికారులు సేక‌రించారు అని తెలుస్తోంది.. మ‌రికొంద‌రిని విచారించి ఈకేసుకు సంబంధించి వాస్త‌వాలు తెలియ‌చేస్తాము అని చెబుతున్నారు పోలీసులు. ఇక కొంద‌రిని అందులో అనుమానితులుగా గుర్తించారు అని తెలుస్తోంది.. అయితే పూర్తి విచార‌ణ జ‌రిగిన త‌ర్వాత వివ‌రాల‌తో మీడియా ముందుకు సిట్ రానుంద‌ని స‌మాచారం.