వైఎస్ వివేకా హత్య కేసు: చంద్రబాబుపై ఈసీకి ఫిర్యాదు చేసిన సునీత

242

తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన మాజీ మంత్రి వైఎస్‌ వివేకానందరెడ్డి హత్య కేసులో సిట్‌ దర్యాప్తు ముమ్మరం చేసింది. సిట్ అనుమానిస్తున్న ఆయన అనుచరులపై దృష్టిపెట్టింది. వివేకా అనుచరులు గంగిరెడ్డి, పరమేశ్వర్‌రెడ్డి చుట్టూ ఉచ్చు బిగుస్తోంది. గంగిరెడ్డితో పరమేశ్వర్‌రెడ్డి చేతులు కలిపినట్టుగా పోలీసులు అనుమానిస్తున్నారు. బెంగళూరులోని ఓ భూవివాదంలో వివేకా, గంగిరెడ్డి మధ్య గొడవ జరిగినట్లుగా పోలీసులు భావిస్తున్నారు. రూ.125 కోట్ల సెటిల్‌మెంట్‌ వ్యవహారంలో వివాదం నెలకొన్నట్టుగా తెలుస్తోంది. ఈ డీల్‌లో రూ.1.5 కోట్ల లావాదేవీలపై సిట్ ఆరా తీస్తోంది. గత నాలుగు రోజులుగా గంగిరెడ్డిని రహస్య ప్రాంతంలో విచారిస్తున్నారు. వివేకానందరెడ్డి హత్యకు 15 రోజుల ముందే రెక్కీ నిర్వహించినట్టుగా పోలీసులు అనుమానిస్తున్నారు.ఇంటి ద‌గ్గర అనుమానితుల సంచారం జ‌రిగిందా అనే అనుమానం కూడా బ‌ల‌ప‌డింది. వివేకానందరెడ్డి హత్యకు సంబంధించి ఇప్పటివరకు రకరకాల ఆధారాలు, కోణాలు వెలుగులోకి వచ్చాయి.

ఈ క్రింది వీడియో చూడండి

ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసుపై దుమారం కొనసాగుతోంది. వైసీపీ, టీడీపీ మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. ఎన్నికల ప్రచారంలో ఏపీ సీఎం చంద్రబాబునాయుడు ఇదే అంశాన్ని హైలైైట్ చేస్తున్నారు. కుటుంబ సభ్యులే వివేకానందను హత్యచేశారని, ఆ నేరాన్ని తమపై మోపేందుకు జగన్ కుట్రచేశారని ఆరోపిస్తున్నారు. ఈ క్రమంలో ఏపీ సీఎం చంద్రబాబుపై వైఎస్ వివేకానందరెడ్డి కూతురు సునీత ఎన్నికల అధికారులకు ఫిర్యాదు చేశారు. రాష్ట్ర ఎన్నికల అధికారి జీకే ద్వివేదిని కలిసిన సునీత సాక్షాత్తు ముఖ్యమంత్రే కేసు దర్యాప్తును పక్కదోవ పట్టించేలా మాట్లాడుతున్నారని ఫిర్యాదులో పేర్కొన్నారు.సీఎం చంద్రబాబు వ్యాఖ్యలు విచారణాధికారులను ప్రభావితం చేసేలా ఉన్నాయని ద్వివేదికి చెప్పారు సునీత. హత్య కేసును నిస్పక్షపాతంగా విచారించి అసలు దోషులకు శిక్షపడేలా చేయాలని విజ్ఞప్తి చేశారు. సిట్ విచారణ పారదర్శకంగా జరిగేలా చూడాలని ఆమె కోరారు.

వైఎస్ వివేకా హత్య కేసు: చంద్రబాబుపై ఈసీకి ఫిర్యాదు చేసిన సునీత

ఈ మేరకు వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులపై టీడీపీ నేతలు మాట్లాడిన న్యూస్ పేపర్ క్లిప్సింగ్స్‌ని రాష్ట్ర ఎన్నికల అధికారికి సమర్పించారు. త్వరలో కేంద్ర ఎన్నికల సంఘాన్ని కూడా ఫిర్యాదు చేస్తామని సునీత స్పష్టంచేశారు. కాగా, విజయనగరం జిల్లా సాలూరు రోడ్‌షో వైఎస్ జగన్‌పై సంచలన ఆరోపణలు చేశారు ఏపీ సీఎం చంద్రబాబు. ‘బాబాయ్‌ని ఇంత దారుణంగా చంపేసి, ఎవరో చంపేసినట్టు నాటకాలు ఆడుతున్నారని మండిపడ్డారు. ఇలాంటి వాళ్లు అధికారంలోకి వస్తే మీకు రక్షణ ఉంటుందా? ఆడబిడ్డలు బయటకు వస్తే ఇంటికి రాగలరా? వీధికి ఒక రౌడీ తయారవుతాడు.’ అని తీవ్ర విమర్శలు గుప్పించారు.మరి వివేకా హత్య గురించి అలాగే చంద్రబాబు మీద ఎన్నికల అధికారికి సునీత పిర్యాదు చెయ్యడం గురించి మీ అభిప్రాయాలను మాకు కామెంట్ రూపంలో చెప్పండి.