జగన్ కు తలనొప్పిగా మారిన వైసీపీ ఎమ్మెల్యే సీరియస్ వార్నింగ్

161

ఎక్కడైనా సరే పాలనలో ఉన్న వారికి, అధికార పార్టీ నేతలకు సహనం ఉండాలి.. విపక్షాల విమర్శలను స్వీకరించే ఓపిక ఉండాలి. విమర్శలను తిప్పికొట్టే నేర్పు ఉండాలి.. విమర్శలకు సమాధానం చెప్పే నాలెడ్జ్ ఉండాలి. కానీ ఇవేవీ పట్టించుకోకుండా మంద బలం ఉంది కదా అని రెచ్చిపోవడం కొన్నిసార్లు చేటు తెస్తుంది..ఇప్పుడు వైసీపీ విషయంలో అదే జరుగుతోంది. కొందరు నేతలు తమ సంఖ్యాబలం చూసి రెచ్చిపోతున్నారు. జగన్ కు కొందరు ఎమ్మెల్యేలు తలనొప్పులు తెస్తున్నారు. అలాంటి వారిలో నెల్లూరు జిల్లాకు చెందిన ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి ఒకరు.

Image result for ys jagan

శాసనసభలో తెలుగుదేశం పార్టీ సభ్యుల తీరు ప్రజలు అసహ్యించుకునేలా ఉందని వైసీపీ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి అన్నారు. సభలో మాట్లాడేందుకు తమ ప్రభుత్వం ఎన్ని అవకాశాలు ఇచ్చినా ప్రతిపక్షం గందరగోళం సృష్టించేందుకే ప్రయత్నిస్తోందన్నారు. గత ప్రభుత్వంలో 63మంది ఎమ్మెల్యేలు ఉన్నా ప్రతిపక్ష నేత జగన్‌కు మాట్లాడేందుకు అవకాశమే ఇచ్చేవారు కాదని, సభలో ఏదైనా మాట్లాడాలంటే అధ్యక్షా మైకు.. అధ్యక్షా మైకు.. అంటూ బతిమాలుకోవాల్సి వచ్చేదని అన్నారు.

Related image

గత అసెంబ్లీలో టీడీపీ ఎమ్మెల్యేలు జగన్‌ను ఉద్దేశించి మగాడివా.. మగతనం ఉందా.. అంటూ అవమానించేలా మాట్లాడితే చప్పట్లు కొట్టిన పెద్ద మనిషి చంద్రబాబు అని శ్రీధర్‌రెడ్డి అన్నారు. తమ ప్రభుత్వానికి చెడ్డపేరు తీసుకురావాలని ప్రయత్నిస్తే ఊరుకునేది లేదన్నారు. వీడ్కోలు సభలో గవర్నర్ నరసింహన్ మాట్లాడుతూ.. జగన్ అద్భుత ముఖ్యమంత్రి అని కితాబిచ్చారని, జగన్‌కు దక్కతున్న ప్రశంసలు చూసి తట్టుకోలేక ఈ ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టాలని చంద్రబాబు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. అసెంబ్లీ సాక్షిగా చెబుతున్నా.. ‘ఖబడ్దార్.. ఖబడ్దార్ చంద్రబాబూ.. నీ ఎమ్మెల్యేలను అదుపులో పెట్టుకో’ అంటూ శ్రీధర్‌రెడ్డి ఆగ్రహంతో ఊగిపోయారు. ఇక ఆయనపై గతంలో కూడా టీడీపీ నేతలు టార్గెట్ చేసిన అంశం ఉంది. ఆయన ఓ జర్నలిస్టును నరికిపారేస్తా అంటూ చేసిన బెదిరింపులు వైసీపీ పరువు తీశాయి. మీడియాలో హల్ చల్ గా మారాయి.

Image result for ys jagan

నాపైనే పోస్టింగ్‌లు పెడతావా..? అంటూ కోటంరెడ్డి ఓ విలేకరిని అసభ్యపదజాలంతో దూషించారు. నీ తోలు తీస్తా.. నీ దిక్కున్నచోట చెప్పుకో.. నీవేమైనా పెద్ద తోపువా.. అంతా రికార్డు చేసుకో.. నిన్ను నడిరోడ్డుపై నరికేస్తా.. నిన్ను ఎవరు కాపాడతారా చూస్తా.. నీ ఇంటికే వస్తా, దమ్ముంటే టైమ్ చెప్పు అంటూ శ్రీధర్ రెడ్డి విలేకరిని ఫోన్లో బెదిరించారు. దీనిపై లోకేశ్ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ఈ రాక్షస రాజ్యంలో జర్నలిస్టుల పరిస్థితి ఇదైతే ఇక సామాన్యుడి పరిస్ధితి ఎలా ఉండబోతోందో మీరే ఊహించుకోండి అంటూ ట్వీట్ చేశారు.

ఈ క్రింద వీడియోని చూడండి

ఇప్పుడు తాజాగా ఆయన నిండు అసెంబ్లీలో చంద్రబాబును ఖబడ్దార్ అంటూ చేసిన ప్రసంగం అభ్యంతరకరంగా లేకపోయినా అహంకారపూరితంగా ఉంది. ఖబడ్డార్, చంద్రబాబునాయుడూ అంటూ రెచ్చిపోయిన శ్రీధర్ రెడ్డి, ‘మీ ఎమ్మెల్యేలను అదుపులో పెట్టుకో’ అంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. గతంలో ప్రతిపక్షంలో ఉన్న తమకు శాసన సభా సమావేశాలు జరుగుతున్న సమయంలో ఎంత వేడుకున్నా మాట్లాడే అవకాశం దక్కేది కాదనీ, బతిమలాడుకోవాల్సిన దుస్థితి ఉండేదని అన్నారు. అది నిజమే కావచ్చు.. కానీ ఇప్పుడు వైసీపీ కూడా అదేలా ప్రవర్తిస్తే ఇక తేడా ఏముంటుంది.. సభను హుందాగా నడిపిస్తామన్న స్పీకర్ మాటలకు విలువేముంటుంది..? ఇలా వైసీపీ ఎమ్మెల్యేలు చేస్తున్న అతి వల్ల చివరకు జగన్ కే మైనస్ అవుతుంది అని రాజకీయ విశ్లేషకులు కూడా చెబుతున్నారు. సదరు ఎమ్మెల్యేలకు జగన్ కూడా ఇప్పటికే తెలియచేశారట ఇలాంటి ఆవేశ కామెంట్లు చేయవద్దు అని. చంద్రబాబుపై ఈ ఎమ్మెల్యే చేసిన కామెంట్లపై మీరేమంటారు మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియచేయండి.