మైల‌వరంలో మంత్రికి వైసీపీ చెక్

382

తెలుగుదేశం ప్ర‌భుత్వం వైసీపీ నాయ‌కుల‌ని టార్గెట్ చేయడం,ఇటు వైసీపీ నాయ‌కులు టీడీపీని టార్గెట్ చేయ‌డం తెలిసింది. ఇక తాజాగా మంత్రిదేవినేని ఉమా సెగ్మెంట్లో, వ‌చ్చే ఎన్నిక‌ల్లో ఆయ‌న‌కు విజ‌యం అంత సుల‌భం కాదు అనిపిస్తోంది టీడీపీకి..మంత్రి దేవినేని ఉమా మ‌హేశ్వ‌ర‌రావు కు విజ‌య‌వాడ‌లో చాలా ఫాలోయింగ్ ఉంది… కాని ఆయ‌న సెగ్మెంట్ అయిన మైల‌వరం టీడీపీలో ఇప్పుడు ఆ ఫాలోయింగ్ 10 ప‌ర్సెంట్ కూడా లేదు అని అంటున్నారు నాయ‌కులు.

Image result for devineni uma

కృష్ణాజిల్లా మైల‌వ‌రం దేవినేని ఉమాసెగ్మెంట్… మైల‌వ‌రంలో ఇప్పుడు పొలిటిక‌ల్ హీట్ మ‌రింత పెరిగింది అనేచెప్పాలి.. వైసీపీ త‌ర‌పున ఇక్క‌డ నియోజకవర్గ కన్వీనర్ వసంత వెంకట కృష్ణ ప్రసాద్ దూసుకుపోతున్నారు… ఇప్ప‌టికే సెగ్మెంట్లో ప‌ర్య‌ట‌న‌లు బైక్ ర్యాలీలు పార్టీ కార్య‌క్ర‌మాల‌తో నియోజ‌క‌వ‌ర్గంలో అంద‌రితో క‌లిసి ముందుకు వెళుతున్నారు. కాని మంత్రి దేవినేని ఉమా మాత్రం ఇక్క‌డ వ‌చ్చే ఎన్నిక‌ల్లో త‌న గెలుపు న‌ల్లేరుపై న‌డ‌క అని భావిస్తున్నారు.

Image result for వెంకట కృష్ణ ప్రసాద్

 

మైల‌వ‌రం ఎమ్మెల్యే మంత్రి దేవినేని ఉమాపై వ‌సంత ప్ర‌సాద్ పోటీ అన‌గానే ఇక్క‌డ టీడీపీ కోట‌ల‌కు బీట‌లు వాలాయి… గ‌తంలో దేవినేని ఉమా ఎంత ఆస్తిప‌రుడు ఇప్పుడు కోట్ల రూపాయ‌ల ఆస్తి ఎలా వ‌చ్చింది అని వ‌సంత కృష్ణ‌ప్రసాద్ ప్ర‌శ్నిస్తున్నారు.. ఇక్క‌డ జోగిర‌మేష్ ను పెడ‌న పంపించి జ‌గ‌న్ ఇక్క‌డ వ‌సంత ప్ర‌సాద్ కు నియోజ‌క‌వ‌ర్గ బాధ్య‌త‌లు ఇవ్వ‌డంతో ఇటు దేవినేని వ‌ర్గం కాస్త డైల‌మాలో ప‌డింది… ముఖ్యంగా ఈ సెగ్మెంట్లో విజ‌యం వ‌స్తుంది అని అనుకున్న దేవినేని ఉమా ఆశ‌ల‌కు జ‌గ‌న్ బ్రేకులు వేసిన‌ట్లే అయింది… మైలవ‌రం అభివృద్ది ఏం జ‌రిగింది అని మంత్రిని సూటిగా ప్ర‌శ్నిస్తున్నారు.

Image result for వెంకట కృష్ణ ప్రసాద్

ఇక వైసీపీ త‌ర‌పున బాధ్య‌త‌లు చూస్తున్న ప్ర‌సాద్ పై ఓ విష‌ప్ర‌చారం మొద‌లు పెట్టారు.. ఇక్క‌డ జోగి ర‌మేష్ ను కోట్ల రూపాయ‌లు ఇచ్చి ప‌క్క సెగ్మెంట్ కు పంపించారు అని విమ‌ర్శ‌లు సోష‌ల్ మీడియాలో అస‌త్య వార్త‌లు ప్ర‌చారం చేయ‌డం పై కూడా, వసంత సీరియ‌స్ అయ్యారు. రాజ‌కీయంగా ఇక్క‌డ మైల‌వ‌రంలో తెలుగుదేశానికి వైసీపీ మంచి ట‌గ్ వార్ జ‌రిగేలా ప్ర‌స్తుత పొలిటిక‌ల్ సీన్ క‌నిపిస్తోంది.