AP లో స్కూల్స్ పై జగన్ మరో సంచలన నిర్ణయం

261

ఏపీలో సీఎం జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి తీసుకునే నిర్ణ‌యాలు సంచ‌ల‌నాల‌ను క్రియేట్ చేస్తున్నారు.. ఏ రాష్ట్రాల్లో అమ‌లు చేయ‌ని ప‌థ‌కాలు సీఎం జ‌గ‌న్ అమ‌లు చేస్తున్నారు. ముఖ్యంగా విద్యావ్య‌వ‌స్ధ‌లో అనేక మార్పులు తీసుకువ‌స్తున్నారు.. వైద్యం పై సంచ‌ల‌న నిర్ణ‌యాలు తీసుకుంటున్నారు. పాఠ‌శాల‌లో మౌళిక స‌దుపాయాలు క‌ల్పిస్తున్నారు. అవ్వాతాత‌ల‌కు పించ‌న్ల పెంపు, కొత్త 104-108 వాహ‌నాల కొనుగోలు, రాజ‌న్న క్యాంటీన్లు, మ‌ధ్యాహ్న భోజ‌న ప‌థ‌కం. ఇలా అనేక సౌక‌ర్యాలు సంక్షేమ ప‌థ‌కాలు ప్ర‌వేశ‌పెట్టారు అలాగే నిరుద్యోగుల‌కు 5 ల‌క్ష‌ల ఉద్యోగాల క‌ల్ప‌న‌, గ్రామ‌స‌చివాల‌యాలు, ఇంటికి రేషన్ స‌రుకులు చేరేలా నిర్ణ‌యం ఇవ‌న్నీ కూడా సీఎం జ‌గ‌న్ పాల‌న‌లో న‌వ‌ర‌త్నాలు అనే చెప్పాలి.

Image result for jagan

అలాగే అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో ఇచ్చిన హామీలను సీఎం జగన్ ఒక్కొక్కటిగా నెరవేరుస్తున్నారు. ప్రభుత్వ స్కూళ్లను బలోపేతం చేస్తామని ప్రకటించిన ఆయన.. ఆ దిశగా చర్యలు ప్రారంభించారు. ప్రభుత్వ పాఠశాలల్లో నాణ్యమైన విద్య అందించేందుకు గానూ తరగతి గదిలో టీచర్ల ఫోన్ వినియోగంపై కఠిన నిర్ణయం తీసుకున్నారు. ఇకపై క్లాస్ రూంలో టీచర్లు ఎట్టి పరిస్థితుల్లోనూ సెల్‌ఫోన్లు వినియోగించకూడ‌ద‌ని ఆదేశించారు. ఒకవేళ తరగతి గదిలో టీచర్ వద్ద మొబైల్ ఉన్నట్లు రుజువైతే సదరు ఉపాధ్యాయుడితో పాటు స్కూల్ హెడ్మాస్టర్‌పైనా చర్యలు తీసుకోవాలని ప్రభుత్వం నిర్ణయించింది.

Image result for jagan

ఏపీ ప్రభుత్వ పాఠశాలల్లో ఐదో తరగతి విద్యార్థులు సైతం సరిగా చదవడం, రాయలేని స్థితిలో ఉన్నారు. దీంతో టీచర్లు క్లాస్ రూంలో ఉన్నప్పుడు కేవలం పిల్లలపైనే దృష్టి పెట్టాలన్న ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకున్నారు. కరువు జిల్లా అయిన అనంతపురం రైతులు తమ పిల్లల్ని ప్రైవేట్ స్కూళ్లకు పంపే పరిస్థితి లేదు. ఈ నేపథ్యంలో ఆ జిల్లాపై ఫోకస్ చేసిన అధికారులు విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించడంపై దృష్టి పెట్టారు.

ఈ క్రింద వీడియోని చూడండి

సెల్‌ఫోన్లపై నిషేధంతో పాటు ప్రతిపాఠశాలలో బయోమెట్రిక్ తప్పనిసరిగా అమలు చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేశారు. స్కూల్ పని వేళల్లో ఉపాధ్యాయులు పాఠశాలలోనే ఉండేలా చూడటంతో పాటు నిబంధనలు పాటించని వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని అధికారులు స్పష్టం చేస్తున్నారు. మొత్తమ్మీద సర్కారీ బడుల్లో నాణ్యమైన విద్య అందించేందుకు ఏపీ ప్రభుత్వం తీసుకున్న బృహత్తర నిర్ణయం తీసుకుంది. ఇక డీఈవోల‌ను ప‌లు స్కూళ్ల‌ను ప‌రిశీలించేలా బోధ‌న ఎలా ఉందో చూసేలా చ‌ర్య‌లు తీసుకోనున్నారు…క్లాస్‌రూంలో టీచర్లు సెల్‌ఫోన్ వాడకుండా ఆదేశాలు జారీ చేయడంపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో చెప్పండి.