ఆ అధికారులకు జగన్ సీరియస్ వార్నింగ్ ఎవరైనా తోకజాడిస్తే ఉద్యోగాలు పీకేస్తా

126

ఏపీలో సీఎం వైయస్ జగన్ పాలనపై ప్రజలు ఏమనుకుంటున్నారు అనే రీతిలో వైసీపీ నేతలు ప్రజల నుంచి వారి స్పందన తెలుసుకుంటున్నారు. ఇక అధికారులు కూడా ఎలా పనిచేస్తున్నారు అనే విషయంలో జగన్ కూడా అధికారుల నుంచి వారి సమధానాలు పనితీరు తెలుసుకుంటున్నారు.రూపాయి లంచం లేకుండా పని జరిగిందన్న పేరు రావాలని, ఇందుకు కొన్ని నియమాలు, నిబంధనలు, ప్రమాణాలు తీసుకు రావాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అన్నారు. దీనిపై కలెక్టర్లు మరిన్ని సలహాలు, సూచనలు ఇవ్వాలని కోరారు. ఎమ్మార్వో, పోలీసుస్టేషన్లు, సబ్ రిజిస్ట్రార్, మున్సిపల్ కార్యాలయాల్లో అవినీతి అన్నది కనిపించకూడదని స్పష్టం చేశారు.

Image result for jagan

స్పందన సమస్యల పరిష్కారంలో పురోగతి సాధించినందుకు, వినతులు ఇస్తే పరిష్కారం అవుతాయన్న నమ్మకాన్ని కలిగించినందుకు కలెక్టర్లు, ఎస్పీలు, ఇతర అధికారులకు ముఖ్యమంత్రి అభినందనలు తెలిపారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ‘స్పందన’ కార్యక్రమంపై జిల్లా కలెక్టర్లు, ఎస్పీలతో వీడియో కాన్పరెన్స్ ద్వారా సమీక్షించారు. జూలై 12 వరకు పెండింగ్లో 59 శాతం సమస్యలుంటే, జూలై 19 నాటికి 24 శాతానికి తగ్గాయని ముఖ్యమంత్రి పేర్కొన్నారు. సమస్యల పరిష్కారంలో నాణ్యత ఇంకా మెరుగుపడాలని, స్పందన కింద వచ్చే సమస్యలను వేగవంతగా పరిష్కరించాలని సూచించారు. ఎమ్మార్వోలతో వీడియో కాన్ఫరెన్స్ సందర్భంగా కలెక్టర్, జాయింట్ కలెక్టర్ పక్కపక్కనే ఉంటారు కాబట్టి పర్యవేక్షణతో పాటు నిర్ణయాలు తీసుకునే వీలు ఉంటుందన్నారు. స్పందన కార్యక్రమం కింద సమస్యలను స్వీకరించాక కలెక్టర్లు ఒక గంట ఎమ్మార్వోలతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహిస్తే నాణ్యత మరింత పెరుగుతుందని చెప్పారు. ఎమ్మార్వోలు, ఎస్ఐలతో ప్రతి వారం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహిస్తున్నారా.. లేదా అనే విషయంపై ముఖ్యమంత్రి ఆరా తీశారు.

Image result for jagan

పశ్చిమగోదావరి జిల్లాలో స్పందన సమస్యల పరిష్కారంలో ట్రాకింగ్ విధానం బాగుందని ముఖ్యమంత్రి అన్నారు. ఎమ్మార్వో కార్యాలయాలు, పోలీసుస్టేషన్లలో అవినీతి అనేది ఉండకూడదని, మండల అధికారులతో నిర్వహించే సమీక్షా సమావేశాల్లో ఈ విషయాన్ని పదే పదే చెప్పాలని, వ్యవస్థ అవినీతి రహితంగా ఉండాల్సిందేనని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. పోలీసుస్టేషన్లలో రిసెప్షనిస్టులను ఏర్పాటు చేశారా లేదా అనే విషయాన్ని ముఖ్యమంత్రి ఆరా తీశారు. కొన్ని పిటీషన్లు దీర్ఘకాలం పెండింగ్లో ఉండటం గురించి ఎస్పీలు ప్రస్తావించారు. దీనిపై సీఎం స్పందిస్తూ ఆ కేసులకు సంబంధించి ఇప్పటి వరకు ఏం చేశారు.. ఇకపై ఏం చేయబోతున్నారో చెప్పాలన్నారు. ఇలాంటి కేసులను ప్రత్యేకంగా ఒక అధికారికి అప్పగించి పరిష్కారానికి ప్రయత్నించాలని సీఎం సూచించారు. దీని వల్ల పిటీషన్ ఇచ్చిన వారికి బాధ్యతగా సమాచారం ఇచ్చినట్లు అవుతుందన్నారు. మనం సమస్యను సీరియస్గా తీసుకుంటామని, చిత్తశుద్ధిని ప్రదర్శిస్తున్నామనే సంకేంతం వెళ్లాలన్నారు. పోలీసుస్టేష్లలో రిసెప్షనిస్టులు చిరునవ్వుతో స్వాగతించాలని, ఎందుకు పోలీసుస్టేషన్కు వచ్చామనే భావన రాకూడదని స్పష్టం చేశారు.

ఈ క్రింద వీడియోని చూడండి

కొన్ని భూ వివాదాలను త్వరగా పరిష్కరించాలనే ఆత్రుతలో న్యాయం కన్నా, అన్యాయం చేశామనే భావన వచ్చే అవకాశం ఉందని.. అందువల్ల జాగ్రత్తగా ఉండాలని ముఖ్యమంత్రి సూచించారు. సచివాలయంలో స్పందన కార్యక్రమంపై జరిగిన వీడియో కాన్ఫరెన్స్లో మాట్లాడుతున్న సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి. ఇక ఎమ్మెల్యేలు మంత్రులు కూడా కొందరు అధికారుల తీరుపై కంప్లైంట్ చేస్తున్నారు ప్రజా సమస్యల విషయంలో అలసత్వం వహిస్తే ఉద్యోగాలు ఉండవు అనే సంకేతాలు జగన్ సీరియస్ వార్నింగ్ ఇచ్చినట్లు తెలుస్తోంది. మొత్తానికి అవినీతికి దూరంగా ఉండేలా జగన్మోహన్ రెడ్డి సర్కార్ తీసుకుంటున్న నిర్ణయాలు బాగున్నాయంటున్నారు ప్రజలు.