కన్నీరు పెట్టుకున్న జగన్ అసలు ఏం జరిగిందంటే

129

ఏపీలో పాలనలో తనదైన మార్క్ చూపిస్తూ అభివ్రధ్ది వైపు పరుగులు తీయిస్తున్న జగన్ సర్కారుకు, ప్రతీ చోట అభినందనలు వస్తున్నాయి.. పక్క రాష్ట్రం తెలంగాణ సీఎం కేసీఆర్ కూడా ప్రసంసలు ఇస్తున్నారు.ముఖ్యంగా నాయకులు ఎందరో ఉంటారు. కానీ మనసున్న నాయకులు చాలా తక్కువ మంది ఉంటారు. అలాంటి వారిలో ఏపీ సీఎం జగన్ తొలి వరుసలో నిలిచారు అని చెప్పాలి.. ఇదీ ఇప్పుడు తమిళనాడు ప్రభుత్వం చేస్తున్న భారీ ప్రచారం. తమిళనాడు రాజధాని చెన్నైలో ప్రభుత్వమే స్వయంగా జగన్‌కు కటౌట్ పెట్టి ప్రశంసలు కురిపిస్తోంది. నమ్మలేకపోతున్నారా ! ఇది నిజం. అసలు ఏం జరిగిందంటే.. ఒక పక్క దక్షిణాది రాష్ట్రాలైన కర్ణాట‌క‌, ఏపీ, తెలంగాణల్లో భారీ వర్షాలు వరదలు ముంచెత్తుతున్నాయి. మరోపక్క, ఇదే దక్షిణాది రాష్ట్రమైన తమిళనాడు రాజధాని చెన్నైలో చుక్క నీరు అందక ప్రజలు రెండు మాసాలుగా అల్లాడిపోతున్నారు. స్నానం చేయడం ఇక్కడి వారు ఎప్పుడో మరిచిపోయారు. తాగడానికి కాదు.. ప్రాణాలు నిలుపుకొనేందుకు ఎందుకైనా ఓ గ్లాసుడు తాగునీరు దొరికితే చాల‌ని వెయ్యి దేవుళ్లకు మొక్కుకుంటున్నారు.

ఈ క్రింద వీడియో చూడండి

గడిచిన రెండు మాసాలుగా పరిస్థితి ఇలానే ఉంది. దీంతో ఇటీవల కొన్ని కోట్ల లీటర్లు తాగునీటిని రాజస్థాన్ నుంచి రైలు మార్గంలో దిగుమతి చేసుకున్నారు. అవి కూడా అయిపోయాయి. దీంతో ఇప్పుడు వారు ఏమీ చేయలేని పరిస్థితి ఏర్పడింది. ఈ నేపథ్యంలో తమిళనాడులో ఏపీ ప్రభుత్వం ఎన్టీఆర్ హయాంలో చేసుకున్న తెలుగుగంగ‌ ఒప్పందం మేరకు త‌మ‌కు నీటిని విడుదల చేయాలని కోరింది చెన్నై మహానగరానికి తెలుగుగంగ ప్రాజెక్టు ద్వారా నీటిని విడుదల చేసి 90 లక్షల మంది దాహార్తిని తీర్చాలని ఆ రాష్ట్ర ప్రభుత్వం ఏపీ సీఎం జగన్‌ను అభ్యర్థించింది. ఇరుగు పొరుగు రాష్ట్రాలు పరస్పరం సహకరించుకోవాల‌ని, మానవ‌తా దృక్పథంతో వ్యవహరించాలని తమిళనాడు ప్రభుత్వం కోరింది. ఈ నేపథ్యంలోనే తాజాగా శుక్రవారం తమిళనాడు సీఎం ఎడప్పాడి పళ‌నిస్వామి తన మంత్రుల బృందాన్ని ఏపీకి పంపారు.

Image result for jagan

తమిళనాడు మున్సిపల్ శాఖ మంత్రి గణేషన్, మత్స్యశాఖ, పాలనా సంస్కరణల శాఖ మంత్రి జయకుమార్, ప్రిన్సిపల్ సెక్ర‌టరీ మునివాస్ తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రి జగన్‌ను శుక్రవారం కలిశారు. చెన్నైలో తాగునీటి సమస్య తీవ్ర స్థాయిలో ఉందని, 90 లక్షల మంది అల్లాపోతున్నారని వివరించారు. తెలుగుగంగ పథకం ద్వారా నీటిని మళ్లిస్తే చెన్నై గొంతు త‌డుస్తుందని వేడుకొన్నారు. గతంలో చేసుకున్న ఒప్పందం మేరకు కృష్ణా జలాలను విడుదల చేసి క‌ష్టం తీర్చాలని కోరారు. ఈ విజ్ఞప్తి పై సీఎం జగన్ అక్కడికక్కడే స్పందించారు. తెలుగుగంగ ద్వారా కృష్ణా జిల్లాలను మళ్లించి తమిళుల‌ దాహార్తిని తీర్చాలని అధికారులను ఆదేశించారు. ఇరుగు పొరుగు రాష్ట్రాలు పరస్పరం సోదరభావంతో మెలగాలని తమిళనాడు ప్రభుత్వానికి వివరించారు.

Image result for jagan

అన్ని లక్షల మంది కష్టంలో ఉంటే మానవత్వంతో స్పందించాల్సిన అవసరం ఉందని, ఈ సమస్యను ఇప్పటి వరకు ఎందుకు తన దృష్టికి తీసుకురాలేదని కూడా ఆయన తమిళనాడు మంత్రుల బృందాన్ని ప్రశ్నించారని తెలిసింది. తమిళులు కూడా తమకు సోదరులేనని, వారి కష్టం, మా కష్టం వేరు కాదని జగన్ కన్నీటి పర్యంతమయ్యారు అని సాక్షాత్తు తమిళనాడు నుంచి వచ్చిన మంత్రులు చెప్పడం ఇక్కడ గమనార్హం. దీంతో ఇప్పుడు తమిళనాడు ప్రభుత్వం జగన్‌కు ప్రత్యేక ధన్యవాదాలు చెప్పడంతో పాటు ఆయన కటౌట్లు ఏర్పాటు చేయాలని, ప్రజలకు వివరించాలని ఒకటి రెండు రోజుల్లోనే తాగునీటి సమస్య పరిష్కారం అవుతుందని అధికారులకు ఆదేశించడం సంచలనంగా మారింది. మొత్తానికి ఇంట‌ గెలవడమే కాదు.. జగన్ రచ్చ కూడా గెలుస్తున్నార‌ని అని అంటున్నారు పరిశీలకులు. సో జగన్ తీసుకున్న నిర్ణయం పై మీ అభిప్రాయాలను కామెంట్ ల రూపంలో తెలియచేయండి.