ముగ్గురికి ఎమ్మెల్సీ పదవులు ఇస్తున్న జగన్ వారు ముగ్గురు ఎవరో తెలిస్తే మతిపోవడం ఖాయం

312

ఏపీలో పాలనపై ద్రష్టిపెట్టిన ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి తమ వెంట పార్టీ తరపున కష్టపడిన నేతలకు, పదవులు ఇస్తున్నారు.. ఇఫ్పటికే మంత్రిపదవులు నామినేటెడ్ పదవులు ఇచ్చారు అలాగే కాపు కార్పొరేషన్ పదవి కూడా జక్కంపూడి రాజాకు ఇచ్చారు.. అయితే ఇప్పుడు ఎమ్మెల్సీ పండుగ వాతావరణం వైసీపీలో కనిపిస్తోంది. జగన్ ఎవరికి ఎమ్మెల్సీ పదవులు ఇస్తారు అని ఆలోచిస్తున్నారు.
వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ (వైసీపీ)లో ఎమ్మెల్సీ ఆశావహుల సంఖ్య పెరుగుతోంది. రాష్ట్రంలో ఖాళీ అయిన మూడు ఎమ్మెల్సీ స్థానాలకు ఈనెల 26న ఎన్నిక నిర్వహించనున్నట్టు రాష్ట్ర ఎన్నికల సంఘం ప్రకటించడంతో సీనియర్‌ నేతలు, గత ఎన్నికల్లో ఓటమి పాలైన నేతలు ఆశలు పెంచుకుంటున్నారు. ఖాళీ అయిన మూడు స్థానాలకు ఎవరిని ఎంపిక చేయాలనే దానిపై పార్టీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఇప్పటికే ఒక నిర్ణయానికి వచ్చినట్టు చెబుతున్నప్పటికీ తమకు అవకాశం ఏమైనా దక్కుతుందేమోనని ఆశిస్తున్నారు.

Image result for చల్లా రామకృష్ణారెడ్డి

రాష్ట్రంలో తాజాగా ఖాళీ అయిన మూడు ఎమ్మెల్సీ స్థానాలను వైసీపీ కైవసం చేసుకోనుంది. మంత్రి మోపిదేవి వెంకటరమణ ఆ పదవిలో కొనసాగాలంటే కచ్చితంగా అక్టోబర్‌లోపు ఎమ్మెల్సీగా ఎన్నిక కావాల్సిన అవసరం ఉంది. దీంతో ఒక సీటును మోపిదేవికి కేటాయించడం ఖాయం. అలాగే హిందూపురంలో ఓటమి పాలైన రిటైర్డ్‌ పోలీస్‌ అధికారి ఇక్బాల్‌కు ఎమ్మెల్సీ పదవి ఇస్తానని జగన్‌ ముస్లింలకు హామీ ఇచ్చి ఉన్నారు. దీంతో రెండో సీటు ఇక్బాల్‌కు కేటాయించడం ఖాయంగా కనిపిస్తోంది.

Image result for ఐహెచ్‌ ఫరూఖీ

ఇక మూడో సీటుకు కర్నూలు జిల్లాకు చెందిన సీనియర్‌ నేత చల్లా రామకృష్ణారెడ్డి పేరు పరిశీలనలో వున్నప్పటికీ మరికొందరి పేర్లను కూడా పరిశీలించే అవకాశం లేకపోలేదని పార్టీలో ప్రచారం జరుగుతోంది. జీవీఎంసీ ఎన్నికల నేపథ్యంలో నగరంలో ఎమ్మెల్యేలు లేని లోటును తీర్చేందుకు ఎమ్మెల్సీ సీటును జిల్లాకు కేటాయించే అవకాశం వున్నదని సీనియర్‌ నేతలు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఒకవేళ విశాఖ జిల్లాకు కేటాయిస్తే ఎవరిని ఎంపిక చేస్తారనే దానిపై పార్టీలో చర్చ జరుగుతోంది. 2014 సార్వత్రిక ఎన్నికలకు ముందు నుంచి పార్టీలో కీలకంగా పనిచేసి గత ఎన్నికల్లో పశ్చిమ నియోజకవర్గం నుంచి పోటీ చేసి ఓటమిపాలైనమళ్ల విజయ్‌ప్రసాద్‌తోపాటు పార్టీ నగర అధ్యక్షుడు వంశీకృష్ణశ్రీనివాస్‌, ఇటీవల జరిగిన ఎన్నికలకు ముందు పార్టీలో చేరి అనకాపల్లి ఎంపీ, ఎమ్మెల్యే సీట్లను గెలుచుకోవడానికి తీవ్రంగా కృషిచేసిన దాడి వీరభద్రరావు కుటుంబం ‘ఎమ్మెల్సీ’ పదవిపై ఆశలు పెట్టుకున్నట్టు పార్టీలో ప్రచారం జరుగుతోంది.

పార్టీ ఆవిర్భావం నుంచి కష్టపడుతున్న తనకు న్యాయం చేస్తానని జగన్‌ హామీ ఇచ్చినందున ఎమ్మెల్సీ పదవి జిల్లాకు కేటాయిస్తే తనకే మొదటి ప్రాధాన్యం వుంటుందని పార్టీ నగర అధ్యక్షుడు వంశీకృష్ణ శ్రీనివాస్‌ తన అనుచరుల వద్ద ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఇదిలావుండగా గత ఎన్నికల్లో తమకు పోటీ చేసే అవకాశం కల్పించకపోయినా, అనకాపల్లి ఎంపీ, ఎమ్మెల్యేల గెలుపునకు శక్తివంచన లేకుండా కృషి చేసినందున ముఖ్యమంత్రి జగన్‌ తమను గుర్తించి తన కుమారుడు రత్నాకర్‌కు ఎమ్మెల్సీ పదవి ఇస్తారని పార్టీ సీనియర్‌ నేత దాడి వీరభద్రరావు ఆశిస్తున్నారు. వీరితోపాటు మైనారిటీ కోటా కింద పార్టీ సీనియర్‌ నేత ఐహెచ్‌ ఫరూఖీ కూడా ఎమ్మెల్సీ పదవిని ఆశిస్తున్నారు. ఈ వారంలో ఎమ్మెల్సీ అభ్యర్థులెవరనే దానిపై స్పష్టత వస్తుందని పార్టీ నేతలు చెబుతున్నారు. మీ ఓపినియన్ ప్రకారం ఎవరికి ఎమ్మెల్సీ ఇస్తే బెటర్ అని మీరు భావిస్తున్నారు, మీ అభిప్రాయం కామెంట్ల రూపంలో తెలియచేయండి.