లక్ష్మీ పార్వతికి కీలక పదవి ఇచ్చిన జగన్ సంతోషంలో నందమూరి కుటుంబం

423

వైఎస్ఆర్సీపీ తరఫున బలంగా వాయిస్ వినిపించే లక్ష్మీ పార్వతికి జగన్ సర్కారు నామినేటెడ్ పదవిని ఇచ్చింది. దివంగత సీఎం, టీడీపీ వ్యవస్థాపకుడు ఎన్టీఆర్ భార్య అయిన లక్ష్మీ పార్వతిని తెలుగు అకాడమీ చైర్‌పర్సన్‌‌గా నియమిస్తూ జీవో జారీ చేసింది. లక్ష్మీ పార్వతికి నామినేటెడ్ పదవి ఖాయమని గత కొద్దిరోజులుగా ప్రచారం జరుగుతోంది. అందుకు అనుగుణంగానే ఆమెకు తెలుగు అకాడమీ చైర్‌పర్సన్‌గా బాధ్యతలు అప్పగించారు. దీనిపై నందమూరి అభిమానులు ఆనందంలో ఉన్నారు. అంతేకాదు ఆమెకి నందమూరి కుటుంబం ఎలాంటిసాయం చేయడం లేదు ఆమెని పట్టించుకోవడం లేదు, కాని ఎన్టీఆర్ ఆశయాలకు అనుగుణంగా ఆమె నడిచారు.

Image result for lakshmi pravathi

చంద్రబాబును విపరీతంగా వ్యతిరేకించే లక్ష్మీ పార్వతి.. వైఎస్ఆర్సీపీకి ఆయుధంలా మారారు. కుదిరినప్పుడల్లా టీడీపీపై ఆమె తీవ్ర విమర్శలు గుప్పించేవారు. ఎన్నికల వేళ చంద్రబాబు, లోకేశ్‌లను టార్గెట్‌గా చేసుకొని ఆమె విమర్శలు చేశారు. ఈ క్రమంలో ఆమె వ్యక్తిత్వాన్ని దిగజార్చేలా ప్రచారం కూడా జరిగింది. ఎన్నికల ముందు వైసీపీలో ఆమె బలంగా ఉండటం ప్రచారం చేయడం ఇవన్నీ కొందరు ఆమెని రాజకీయంగా దిగజార్చేందుకు కుట్రలు పన్నారు. కాని ఆమె మాత్రం ఎలాంటి నిరాశ పడలేదు. ఎన్నికల తర్వాత ఆమెపై దుష్ప్రచారం చేసిన వారి బండారం బయటపడింది.

ఈ క్రింద వీడియో చూడండి

ఎన్నో ఆటుపోట్లను ఎదుర్కొన్న లక్ష్మీ పార్వతి.. జగన్ తరఫున బలంగా తన గొంతుకను వినిపించారు. వాస్తవానికి ఆమె ఎమ్మెల్సీ పదవిని ఆశించారని ప్రచారం జరిగింది. ఆర్టీసీ చైర్‌పర్సన్‌గా నియమిస్తారని కూడా వార్తలొచ్చాయి. కానీ జగన్ సర్కారు మాత్రం ఆమెను తెలుగు అకాడమీ చైర్‌పర్సన్‌గా నియమించింది. ఇక కొంతకాలం ఆమె పార్టీలో ఇలా కొనసాగితే మహిళా కోటాలో రాజ్యసభకు కూడా పంపాలి అని భావించారట. కాని ఆమెకు పదవి ఇవ్వలేదు అనే విమర్శలు ఇటు టీడీపీ నుంచి కూడా ఎక్కువగా వస్తున్నాయి. దీంతో వెంటనే జగన్ కూడా ఆమె విషయంలో ఆలోచించి అకాడమీ పదవిని ఇవ్వడం జరిగింది. అయితే దీనిపై నందమూరి కుటుంబం కూడా సంతోషంగా ఉంది అంటున్నారు.. తెలుగుదేశం పార్టీ నుంచి ఆమె బయటకు వచ్చినా కొందరు మాత్రం ఆమెకి సపోర్ట్ ఉన్నారట, వారు చాలా ఆనంద పడ్డారట, జగన్ ఆమెకు మంచి పదవిని ఇచ్చారు అని సంతోషం వెళ్లిబుచ్చారట, ఇక జూనియర్ ఎన్టీఆర్ కూడా ఆమెకు ప్రత్యేకంగా అభినందనలు తెలిపారు అని వార్తలు వస్తున్నాయి.

ఈ క్రింద వీడియో చూడండి