మ‌హిళా సచివాలయ ఉద్యోగులకు జ‌గ‌న్ గుడ్ న్యూస్

325

ఏపీ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా భావిస్తున్న సచివాలయ ఉద్యోగలు నియామకాలు ప్రారంభం అయ్యాయి. అక్టోబర్ 2న గాంధీ జయంతి సందర్బంగా జగన్ గ్రామ సచివాలయ వ్యవస్థను ప్రారంభించాలని నిర్ణయం తీసుకున్నారు. అందులో భాగంగా ఉద్యోగుల కేటాయింపులకు సంబంధించిన విధి విధానాలను ఖరారు చేసారు. అభ్యర్ధి సొంత గ్రామంలో మాత్రం అవకాశం ఇవ్వరు. మండలం వరకు ఇబ్బంది లేదని అధికారు లు స్పష్టం చేసారు. అదే సమయంలో మూడు ప్రాంతాలను ఆప్షన్లుగా ఎంచుకొనే అవకాశం కల్పించారు. వీలైనంత వరకు మొదటి ప్రాధాన్యతగా కోరుకున్న ప్రాంతంలో పోస్టింగ్ ఇచ్చే ప్రయత్నం చేస్తారు. ఒకే పోస్టుకు ఎక్కువ మంది పోటీ పడితే రెండు..మూడు ప్రాధాన్యత కలిగిన పోస్టుల్లో నియమిస్తారు. అపాయింట్‌మెంట్‌ లెటర్ల తర్వాత ఉద్యోగులకు వేరుగా పోస్టింగ్‌ ఆర్డర్లు ఇవ్వనున్నారు.

Image result for jagan

సచివాలయ ఉద్యోగాలకు ఎంపికైన వారికి జిల్లా సెలక్షన్‌ కమిటీల(డీఎస్సీ) ఆధ్వర్యంలో పోస్టింగ్‌ ఇస్తారు. ఈ మేరకు విధివిధా నాలను ప్రభుత్వం ఖరారు చేసింది. దీనిపై పంచాయతీరాజ్‌ ముఖ్య కార్యదర్శి ద్వివేది, కమిషనర్‌ గిరిజా శంకర్‌ అన్ని జిల్లాల కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేశారు.ఇప్పటికే సర్టిఫికెట్‌ వెరిఫికేషన్‌ కూడా పూర్తయి ఉద్యోగాలకు ఎంపికైన వారికి జిల్లా కేంద్రాల్లో అపాయింట్‌మెంట్‌ లెటర్లు ఇవ్వటం మొదలైంది. అపాయింట్‌మెంట్‌ లెటర్‌ అంటే అభ్యర్థి ఫలానా ఉద్యోగానికి ఎంపికైనట్టు నిర్ధారిస్తూ ఇచ్చే పత్రమని, సదరు ఉద్యోగిని ఎక్కడ విధుల్లో నియమించారనే సమాచారాన్ని వేరుగా అందజేసే పోస్టింగ్‌ ఆర్డర్‌లో తెలియజేయనున్నట్టు అధికారులు తెలియ‌చేశారు, ఈరోజు సాయంత్రం క‌ల్లా ఎవ‌రు ఎక్క‌డ పోస్టింగ్ లో ఉంటారు అనేది మొత్తం తెలియ‌నుంది. అభ్య‌ర్దులు రేప‌టి నుంచి ఉద్యోగంలో చేరాల్సి ఉంటుంది.

ఈ క్రింద వీడియో చూడండి

తాజాగా పట్టణ, గ్రామ సచివాలయ ఉద్యోగుల విధి విధానాలను ప్రభుత్వం ఖరారు చేసింది. ప్రస్తుతం ఉద్యోగాల్లో చేరుతున్న వారు రెండేళ్లపాటు ప్రొబేషన్ పిరియడ్‌లో కొనసాగాల్సి ఉంటుంది. కొత్త ఉద్యోగులు చేపట్టాల్సిన అంశాలు, విధి విధానాలు, బాధ్యతలు స్వీకరించిన తరువాత సర్వీసు అంశాల అమలు విధానాలపై దృష్టి పెట్టాలి.పట్టణ, గ్రామీణ సచివాలయాల్లో పని చేసే మహిళా ఉద్యోగులకు ప్రత్యేక సెలవులు ఉన్నాయి. గర్భిణీలకు ఆరు నెలలు వేతనంతో కూడిన ప్రసూతి సెలవులు అమలు అవుతాయి. ప్రస్తుతం ఉద్యోగాలు వచ్చిన గర్భిణీలు.. విధుల్లో చేరిన వెంటనే ఆరు నెలలు సెలవు తీసుకునే అవకాశాన్ని ప్రభుత్వం కల్పించింది. దానిని ఉపయోగించుకోవచ్చు. దీంతో ఈ ఉద్యోగంలో చేరే వారు అంద‌రూ కూడా ఎంతో ఆనందంలో ఉన్నారు.