డ్వాక్రా మహిళలకు బంపర్ ఆఫర్ ఇచ్చిన జగన్

211

మే 30న ఏపీ సీఎంగా బాధ్యతలు చేపట్టిన వైఎస్ జగన్ పాలనపై తనదైన మార్క్ వేస్తున్నారు. ఎన్నికల ముందు హామీ ఇచ్చినట్టుగానే ప్రజలకు వరాలు ప్రకటిస్తున్నారు. పెన్షన్లను పెంచడం, సీపీఎస్ రద్దు; ఆశా వర్కర్లు, పారిశుద్ధ్య కార్మికుల వేతనాలు పెంపు, రైతు భరోసాలో భాగం డబ్బులు ఇచ్చే తేదీని ప్రకటించడం, బెల్ట్ షాపుల ఎత్తివేత, అవినీతిని సహించబోననే హెచ్చరికలు.. తదితర నిర్ణయాల పట్ల సర్వత్రా హర్షం వ్యక్తం అవుతోంది.ఇటీవల రాజన్న బడిబాట కార్యక్రమంలో పాల్గొన్న జగన్.. తాడేపల్లి మండలం పెనమాకలోని వందేమాతరం హైస్కూల్లో ఒకేసారి 2 వేలమంది చిన్నారులతో సామూహిక అక్షరాభాస్యం నిర్వహించారు..అమ్మ ఒడి పథకం కింద పిల్లల్ని బడికి పంపే తల్లులకు రూ.15,000 అందజేస్తామన్నారు. పిల్లల్ని ఏ బడికైనా పంపించండి, జనవరి 26 నాటికి ప్రతి అమ్మ చేతిలోనూ రూ.15,000 పెడతామని హామీ ఇచ్చారు.

Image result for jagan

ఇటీవల రాజన్న బడిబాట కార్యక్రమంలో పాల్గొన్న జగన్.. తాడేపల్లి మండలం పెనమాకలోని వందేమాతరం హైస్కూల్లో ఒకేసారి 2 వేలమంది చిన్నారులతో సామూహిక అక్షరాభాస్యం నిర్వహించారు..అమ్మ ఒడి పథకం కింద పిల్లల్ని బడికి పంపే తల్లులకు రూ.15,000 అందజేస్తామన్నారు. పిల్లల్ని ఏ బడికైనా పంపించండి, జనవరి 26 నాటికి ప్రతి అమ్మ చేతిలోనూ రూ.15,000 పెడతామని హామీ ఇచ్చారు. పిల్లలు చదువుకొని డాక్టర్లు, ఇంజినీర్లు, ఉన్నత విద్యావంతులు కావాలని కోరుకుంటున్నట్టు జగన్ తెలిపారు. చదువుల కోసం ఏ తల్లి, తండ్రి కూడా అప్పులు పాలు కాకూడదనే తన ఆశని, పాదయాత్ర సందర్భంగా పేదల కష్టాలను చూశానని అందుకే ఈ నిర్ణయం తీసుకున్నానన్నారు. పాదయాత్రలో ఇచ్చిన హామీలు ఒక్కొక్కటిగా నెరవేరుస్తూ 2024లో అధికారమే టార్గెట్గా వడివడిగా అడుగులు వేస్తున్నారు.

Image result for jagan

ముఖ్యమంత్రి కాగానే వైయస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వపాఠశాలలపై ప్రత్యేక శ్రద్ద చూపడం మొదలు పెట్టారు. తన ప్రాధాన్యతాంశాల్లో విద్యారంగం ఒక్కటన్నది చెప్పకనే చెబుతున్నారు. మరీ ముఖ్యంగా ప్రాధమిక విద్యనుంచే మార్పుల పర్వానికి శ్రీకారం చుట్టిన సీఎంను విద్యావేత్తలు, సామాజికశాస్త్రవేత్తలు, టీచర్లు అభినందించడం మొదలయింది.ప్రతిపక్షనేతగా 3,648 కిలోమీటర్ల సుదీర్ఘపాదయాత్ర చేసిన జగన్ చెంతకు పాఠశాలల పిల్లలు పరుగుపరుగున వచ్చిన సందర్భాలెన్నో. విద్యాసంవత్సరం ముగుస్తున్నా, అందని టెక్ట్స్బుక్స్పై, పాఠశాలల్లో వసతుల లేమిపై ఆయనకు ఎంతో చెప్పుకున్నారు. వారితో పాటు టీచర్లూ తమ సమస్యలు చెప్పుకున్నారు. మధ్యాహ్నభోజన పథకంలో పనిచేసే కార్మికులు తమ గోడును వెళ్ల బోసుకున్నారు. ఇక విద్యార్థినులైతే టాయిలెట్లు లేక తాము ఎంత ఇబ్బంది పడుతున్నదీ జగన్కు చెప్పుకుని బాధపడ్డారు. చాలా స్కూళ్లకు ప్రహారిగోడలు లేక, పోకిరీలకు అడ్డాలుగా మారిన వైనాల్ని వివరించారు.

Image result for jagan

నాడు వైయస్ జగన్ అన్నీ విన్నారు. చూశారు. అప్పుడు వారికి నేనున్నానని భరోసా ఇచ్చారు.వైయస్ జగన్ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి. ప్రమాణస్వీకారం చేసిన మరుక్షణం నుంచే ప్రభుత్వశాఖల పనితీరును సమీక్షించడం మొదలుపెట్టారు. అదే వరసలో మొదటగా ప్రభుత్వపాఠశాలలకు చెందిన మధ్యాహ్నభోజన పథకం గురించి అక్షయ ప్రతినిధులతో మాట్లాడారు. వైయస్సార్ అక్షయపాత్ర పేరిట …ఇక మధ్యాహ్నభోజన పథకం సమర్ధవంతంగా నడవాలని జగన్ ఆకాంక్ష. పిల్లలకు పౌష్టికాహారం అందించి తీరాలన్న పట్టుదల. ఆ దిశలో ఇప్పటికే ఆయన అనేక నిర్ణయాలు తీసుకున్నారు. మధ్యాహ్నభోజనపథకంలో పనిచేస్తున్న కార్మికులకు ఇప్పటిదాకా ఇస్తున్న రూ.1000లను రూ.3వేలకు పెంచుతూ ఉత్తర్వులు జారీచేశారు. ప్రభుత్వపాఠశాలల్లో మౌలికవసతులు కల్పించడం, విద్యార్థినీవిద్యార్థులు చదువుకోవడంలో ఎలాంటి ఇబ్బందులు పడకుండా చూడటం చాలా ముఖ్యమన్నారు. ప్రతి శనివారం నోబ్యాగ్ డే గా చూడాలని..ఆరోజు విద్యార్థి మానసిక, శారీరక ఆరోగ్యాన్ని పెంచే క్రీడలు, ఇతర కార్యక్రమాలు నిర్వహించాలని…అందుకు ప్రణాళిక సిద్దం చేయాలని విద్యాశాఖకు ఆదేశించారు.

Image result for jagan

పాఠశాలల ప్రస్తుత పరిస్థితి తెలుసుకోవడానికి రాష్ట్రవ్యాప్తంగా వున్న ప్రభుత్వస్కూళ్ల ఫొటోలు తీసి పంపాలని చెప్పారు ఏపీ సీఎం. తర్వాత కాలంలో వాటిని మెరుగుపర్చిన తీరును ఫొటోలు తీస్తే, పనితీరు స్పష్టంగా తెలిసిపోతుందని సీఎం జగన్ ఆలోచన. అలాగే రాష్ట్రంలోని దాదాపు 40వేలకు పైగా వున్న ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీషుమీడియంలోనూ బోధన జరగాలని, తెలుగు బోధన తప్పని సరిగా వుండాలని అధికారులకు స్పష్టం చేసిన సీఎం, చదువుల విషయంలో చేసే ఖర్చు…మంచి ఫలితాలు సాధిస్తుందని గట్టిగా విశ్వసిస్తున్నారు.

తాజాగా ఆంధ్రప్రదేశ్లో డ్వాక్రా మహిళలకు ఏపీ ప్రభుత్వం ప్రభుత్వం నుంచి గుడ్ న్యూస్ అందింది. ఎన్నికలకు ముందు జగన్ మోహన్ రెడ్డి ప్రకటించిన నవరత్నాలు పథకాల్లో భాగంగా ‘వైఎస్ఆర్ ఆసరా’ ద్వారా డ్వాక్రా మహిళలకు రుణమాఫీ చేయనున్నారు. డ్వాక్రా మహిళలకు రుణమాఫీ చేసేందుకు తాజాగా సీఎం గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. 2019 ఏప్రిల్ 11వ తేదీకి ముందు తీసుకున్న రుణాలు మాఫీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది.మొత్తం రూ.840 కోట్ల డ్వాక్రా రుణాలను మాఫీ చేయనున్నారు. నాలుగు విడతల్లో ఈ రుణమాఫీ చేయనుంది ఏపీ ప్రభుత్వం. కానీ, రుణం పొందిన మహిళలు తమ బకాయిని చెల్లిస్తూ ఉండాలి. ఆ తర్వాత రోజుల్లో ప్రభుత్వం నుంచి మాఫీ అయిన నగదు మొత్తం లబ్ధిదారుల బ్యాంక్ ఖాతాల్లో జమ అవుతుంది. మండలాలు, పట్టణాల్లో సంబంధిత అధికారులు బ్యాంకుల ద్వారా అర్హులైన లబ్ధిదారులను ముందుగా గుర్తిస్తారు. అనంతరం 2019, ఏప్రిల్ 11 నాటికి అప్పు తీసుకున్న డ్వాక్రా సభ్యులకు ఆ మొత్తాన్ని బ్యాంకులో జమచేస్తారు.