మీడియాకు షాకిచ్చిన జగన్ మూడు ఛానళ్లపై ఏపీ సర్కారు నిషేధం

263

ఆంధ్రప్రదేశ్ సర్కార్ తనకు మాత్రమే అనుకూలమైన ప్రజాస్వామ్య సూత్రాలను ఏ మాత్రం సంకోచం లేకుండా అమలు చేస్తోంది అనే విమర్శలు వస్తున్నాయి. తమకు వ్యతిరేకంగా ఉన్నది.. మీడియానా.. లేక ప్రతిపక్షమా.. లేక మరో వ్యవస్థా.. అన్నది చూసుకోవడం లేదు. ముందుగా.. అడ్డు తొలగించుకునే ప్రయత్నమే చేస్తోంది. సంప్రదాయాల ప్రకారం.. పాటించాల్సిన పద్దతులు పాటించడం లేదు. తాజాగా… ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలోకి రాకుండా.. మూడు చానళ్లను నిషేధిస్తూ.. సంచలన నిర్ణయం తీసుకున్నారు.

Image result for jagan

బుధవారం.. ఏబీఎన్ ఆంధ్రజ్యోతి, టీవీ5, ఈటీవీ చానళ్లను అసెంబ్లీలోకి అనుమతించలేదు. కారణం ఏమిటంటే.. మీడియా పాయింట్లో… లైవ్ను.. ఆ చానళ్లు ఇచ్చినందుకట….45 ఏళ్లకే పెన్షన్ ఇస్తానన్న జగన్ హామీని అమలు చేయాలంటూ.. మూడు రోజుల కిందట అసెంబ్లీలో రగడ జరిగింది. ఆ సమయంలో.. ముగ్గురు టీడీపీ సభ్యులు అచ్చెన్నాయుడు, బుచ్చయ్యచౌదరి, నిమ్మల రామానాయుడులపై సస్పెన్షన్ వేటు వేశారు. దాంతో వారిని బయటకు పంపేశారు. వారు మీడియా పాయింట్ వద్ద … మీడియా ప్రతినిధులతో మాట్లాడారు. తమపై అన్యాయంగా వేటు వేశారని.. తాము తమ సీట్లలోనే ఉన్నామని.. అయినప్పటికీ.. తమ సవాల్కు సమాధానం చెప్పలేకనే.. సస్పెండ్ చేశారని ఆరోపణలు గుప్పించారు.

ఈ క్రింద వీడియోని చూడండి

ఆ సమయంలో లోపల సభ జరుగుతోంది. అయినా… కొన్ని చానళ్లు.. వీరి మీడియా పాయింట్ ప్రసంగాన్ని లైవ్లో కవర్ చేశాయి. ఇలా చేయడం .. నిబంధనలకు విరుద్ధమని చెబుతూ… మూడు చానళ్లపై బ్యాన్ వేసేశారు. గతంలో.. వైఎస్ హయాంలోనూ అసెంబ్లీలో సభ్యులకు మాట్లాడే అవకాశం ఇవ్వకపోతే.. బయటకు వచ్చి మాట్లాడేవారు. లోపల అసెంబ్లీ జరుగుతున్నా.. పట్టించుకోకుండా టీవీ చానళ్లు.. ప్రతిపక్ష నేతల ఆందోళనను హైలెట్ చేసేవి. ఈ కారణంగా అప్పట్లో.. అసెంబ్లీ జరుగుతూండగా.. మీడియా పాయింట్ నుంచి ప్రత్యక్ష ప్రసారాలు ఇవ్వకూడదని.. నిబంధన తెచ్చారు. అయితే.. ఆ తర్వాత చాలా సార్లు అలాగే అసెంబ్లీ జరుగుతున్నా.. బయట నుంచి టీవీ చానళ్లు ప్రసారాలు చేశాయి. ఇలా ఎక్కువగా చేసింది సాక్షి టీవీనే. అయినా అప్పుడు సాక్షి టీవీపై.. ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోలేదు. కానీ ఇప్పుడు మాత్రం.. మూడు చానళ్లు దొరికేశాయని… వెంటనే వేటేసేశారు. ఇప్పుడు ఇదే తెలుగుదేశం నేతలు ప్రశ్నిస్తున్నారు.

Image result for jagan

అయితే అధికారులు వైసీపీ నేతలు మాత్రం చట్టం ప్రకారం చేస్తున్నామని చెబుతున్నారు. మరి దీనిపై జగన్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో చూడాలి. మొత్తానికి అనుకూల మీడియా వ్యతిరేక మీడియాగా విడిపోవడంతో ఇలాంటి పరిస్దితి వచ్చింది అంటున్నారు మేధావి వర్గం.