కేర‌ళ వ‌ర‌ద బాధితులకు జ‌గ‌న్ భారీ విరాళం ప్ర‌క‌ట‌న

491

వ‌ర‌ద‌ల‌తో అత‌లాకుతం అయిన కేర‌ళ‌కు ఇప్ప‌టికే దేశంలోఆయా రాష్ట్ర ప్ర‌భుత్వాలు పెద్ద ఎత్తున సాయం చేస్తున్నాయి.. అలాగే కేర‌ళ ప్ర‌జ‌ల‌ను ఆదుకునేందుకు యావ‌త్ దేశంలో ప్ర‌జ‌లు అంద‌రూ త‌మ‌కు తోచిన విధంగా విరాళాలు పంపుతున్నారు.. వంద నుంచి ల‌క్ష‌లాది రూపాయ‌లు త‌మ స్దోమ‌త‌కు త‌గ్గ‌ట్లు పంపుతున్నారు.. అలాగే కోట్ల రూపాయ‌లు ప‌లు కంపెనీలు సంస్ద‌లు విరాళాలు ఇస్తున్నాయి. ఇక తెలంగాణ స‌ర్కారు25 కోట్లు, ఏపీ10 కోట్లు ప్ర‌భుత్వాల త‌ర‌పున భారీగా సాయం చేశాయి.

Image result for kerala flood

కేరళ వరద బాధితులను ఆదుకునేందుకు పలువురు సినీ ప్రముఖులు ముందుకొచ్చారు… టాలీవుడ్‌ హీరో ప్రభాస్‌ రూ.కోటి సాయాన్నిప్రకటించారు. తెలుగు సినీ పరిశ్రమకు చెందిన మిగతా వారిలో రామ్‌చరణ్‌ రూ.60 లక్షలు, అల్లు అర్జున్‌ రూ.25 లక్షలు ప్రకటించారు. తమిళ సినీ ప్రముఖుల్లో కమల్‌హాసన్‌ రూ.25 లక్షలు, రజనీకాంత్‌ రూ.15 లక్షలు, దర్శకుడు శంకర్‌ రూ.10 లక్షల సాయాన్ని ప్రకటించారు. ఇక అత్య‌ధికంగా విజ‌య్ 14 కోట్ల రూపాయ‌లు విరాళం ప్ర‌క‌టించారు.

Image result for kerala flood

భారీ వరదలతో అస్తవ్యస్తమైన కేరళకు వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఆపన్నహస్తం అందించారు. తన తరఫున, పార్టీ తరఫున కేరళ వాసులకు కోటి రూపాయల విరాళం ప్రకటించారు. ఈ మేరకు కోటి రూపాయల విరాళాన్ని కేరళ ముఖ్యమంత్రి సహాయనిధికి వైఎస్సార్‌సీపీ పంపనుంది. ఇక ఎమ్మెల్యేలు కూడా ఇప్ప‌టికే ప‌లువురు త‌మ నెల‌జీతాన్ని కూడా విరాళంగా ఇచ్చేందుకు ముందుకు వ‌స్తున్నారు.