వైసీపీ – టీడీపీ 60 రోజుల స్ట్రాట‌జీ

394

వైయ‌స్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి ఇప్పుడు ఉత్త‌రాంధ్రా జిల్లాలో ప్ర‌వేశించి చివ‌ర‌గా శ్రీకాకుళం జిల్లాలో ప్లీన‌రీ త‌ర‌హా పాద‌యాత్ర ముగింపు స‌భ పెట్ట‌నున్నారు.. ఈ స‌భ‌లో జ‌గ‌న్ పాద‌యాత్ర‌కు సంబంధించి ప‌లు విష‌యాలు తెలిచేస్తారు అని తెలుస్తోంది.. అలాగే పాద‌యాత్ర పూర్తి అయిన త‌ర్వాత అంద‌రి నుంచి తెలుసుకున్న ప‌లు స‌మ‌స్య‌ల‌పై విశ్లేష‌కుల నుంచి తీసుకున్న‌ స‌ల‌హాల మేర‌కు మ‌రిన్ని ప‌థ‌కాలు హమీలు ఆయ‌న ఇవ్వ‌నున్నారు అని తెలుస్తోంది.

Image result for ycp flag

ఇక శ్రీకాకుళం జిల్లాలో పాద‌యాత్ర చేసే స‌మ‌యానికి, జ‌గ‌న్ ఇక్క‌డ ఎటువంటి పొలిటిక‌ల్ స్ట్రాట‌జీ అమ‌లు ప‌రుస్తారో చూడాలి.. గ‌త ఎన్నిక‌ల్లో తెలుగుదేశం ఉత్త‌రాంధ్రాలో అనుకున్న స్ధానాల‌కంటే ఎక్కువ గెలుచుకుంది.. ఇక ఫిరాయింపులుకూడా స‌క్సెస్ గా జ‌రిగాయి.. అయితే ఈసారి ఇక్క‌డ ఫిరాయింపుల‌కు అవ‌కాశం ఇవ్వ‌కుండా వైసీపీ త‌ర‌పున సీనియ‌ర్లు జూనియ‌ర్లు కొత్త‌వారికి సీట్లు ఇచ్చే ఆలోచ‌న‌లో జ‌గ‌న్ ఉన్నారు అని తెలుస్తోంది..

Image result for tdp flag

తెలుగుదేశం మాత్రం స‌ర్వే మంత్రం ప‌టిస్తోంది.. ఎవ‌రికి స‌ర్వేలో ప్ర‌జ‌ల నుంచి ఎక్కువ మద్దతు వ‌స్తుందో వారు ఆర్ధికంగా బ‌లంగా లేక‌పోయినా పార్టీ త‌ర‌పున సాయం చేసి టికెట్ ఇవ్వ‌నున్నారు.. మ‌రో రెండు నెలల్లో పాద‌యాత్ర ముగిసే స‌మ‌యానికి ఇంకెన్ని రాజ‌కీయ ఒడిదుడుకులు పార్టీల మ‌ధ్య జ‌రుగుతాయో చూడాలి… అలాగే ఈ 60 రోజుల్లోనే ఈ రెండు రాజ‌కీయ పార్టీలు స్ట్రాట‌జీలు చూపుతాయి మ‌రి వైసీపీ – టీడీపీ నేత‌ల‌ను కాపాడుకునే పీక్ స‌మ‌యం కూడ ఇదే.