వైసీపీ సంచ‌ల‌న నిర్ణ‌యం

401

వైసీపీ తాజాగా రాజ్య‌స‌భ డిప్యూటి చైర్మ‌న్ కోసం జ‌రిగే ఎన్నిక‌ల్లో ఓటింగ్ పై కొత్త నిర్ణ‌యం తీసుకుంది.. ఎన్డీయే అభ్యర్థి హరివంశ్‌ నారాయణ్‌ సింగ్‌కు కానీ, విపక్షాల అభ్యర్థిగా బరిలోకి దిగిన కె. హరిప్రసాద్‌కు గానీ తాము మద్దతివ్వడం లేదని వైఎస్సార్‌సీపీ పార్లమెంటరీ పార్టీ నేత, రాజ్యసభ సభ్యుడు వి.విజయసాయిరెడ్డి స్పష్టం చేశారు. దీంతో ఎన్డీయేకు కాంగ్రెస్ కు మా మ‌ద్ద‌తు లేదు అని తెలియ‌చేసింది వైసీపీ .

Image result for vijayasai reddy
కాంగ్రెస్‌, బీజేపీలు రెండు ఏపీకి తీరని ద్రోహాన్ని చేశాయని.. అందులో సందేహమే లేదన్నారు ఆయ‌న‌. అందుకే రాజ్యసభ డిప్యూటీ చైర్మన్‌ ఎన్నికల్లో బీజేపీ, కాంగ్రెస్‌లకు ఓట్లు వేయవద్దని నిర్ణయించుకున్నట్లు వివరించారు… గ‌తంలో రాష్ట్రాన్ని విభ‌జించి ఏపీకి కాంగ్రెస్ ద్రోహం చేసింది ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ త‌ర‌హాలోనే బీజేపీ కూడా ఏపీకి అన్యాయం చేస్తోంది అని, ఇచ్చిన మాట నిల‌బెట్టుకోలేదు అని వైసీపీ విమ‌ర్శిస్తోంది.

Image result for vijayasai reddy
ఏపీకి ద్రోహం చేసిన రెండు పార్టీలతో కుమ్మక్కై టీడీపీ రాజకీయ వ్యభిచారం చేస్తోందని ఆయన నిప్పులు చెరిగారు… రాష్ట్రపతి, ఉప రాష్ట్రపతి లాంటి కీలక రాజ్యాంగ పదవులు ఏవైనా ఏకగ్రీవం కావాలనేది తమ అభిప్రాయమని విజయసాయిరెడ్డి తెలియ‌చేశారు.నేడు జ‌రుగ‌నున్న ఎన్నికల్లో ఎన్డీయే తరపున జేడీయూ ఎంపీ హరివంశ్‌ నారాయణ్‌ సింగ్, విపక్షాల తరపున కాంగ్రెస్‌ ఎంపీ కె. హరిప్రసాద్ లో ఎవ‌రు ఈ ప‌ద‌విని ద‌క్కించుకుంటారో తేలిపోనుంది.