వైసీపీకీ గుడ్ బై జ‌న‌సేన‌లో చేరిన కోఆర్డినేట‌ర్

262

ఏపీలో ఇప్పుడు తెలంగాణ‌లో ఎంత ఎన్నిక‌ల హడావిడి ఉందో అంతే హడావిడి ఏపీలో క‌నిపిస్తోంది. రాజకీయ క్రీడలో ప్రభుత్వాధికారులు, పోలీసులు పావులైతే నష్టపోయేది అధికారులే తప్ప రాజకీయ నాయకులు కాదని జనసేన పార్టీ అధినేత పవన్‌కల్యాణ్‌ అన్నారు. ఏపీలో ప్ర‌చారంలో బీజీగా ఉన్నారు ఆయ‌న త‌న పార్టీ త‌ర‌పున ప్ర‌జాపోరాట యాత్ర‌ల‌తో ఆయ‌న పెద్ద ఎత్తున రోజూ రోడ్ షోలు బ‌హిరంగ‌స‌భ‌ల‌తో ప్ర‌జ‌ల్లో ఉంటున్నారు.


ఐదేళ్లు పాలించి వెళ్లిపోయే రాజకీయ నాయకుల మాటలు విని చట్టాన్ని, న్యాయాన్ని తుంగలోకి తొక్కి అమాయకులపై అక్రమంగా పోలీసు కేసులు పెడుతున్నారని అన్నారు. రాజశేఖరరెడ్డి హయాంలో జరిగిన అవినీతి అక్రమాల్లో ఐఏఎస్‌, ఐపీఎస్‌లను ఎలా జైలులో పెట్టారో గుర్తుంచుకుని విధులు నిర్వహించాలని విజ్ఞప్తి చేశారు. వైసీపీ మండపేట కోఆర్డినేటర్‌ వేగుళ్ల లీలాకృష్ణ ఆయన అనుచరులతో పవన్‌కల్యాణ్‌ సమక్షంలో జనసేనలో చేరారు. ఆయనకు జనసేన కండువా వేసి సాదరంగా ఆహ్వానించారు. ఇసుకమాఫియా అక్రమాలను అడ్డుకున్నందుకు లీలాకృష్ణ, ఆయన అనుచరులు, వృద్ధులని కూడా చూడకుండా 20మందిపై అక్రమ కేసులు బనాయించడం దురదృష్టకరమని పవన్‌ వ్యాఖ్యానించారు. మొత్తానికి వైసీపీ నుంచి జ‌న‌సేన‌లోకి ఎక్కువ‌గా చేరిక‌లు జ‌ర‌గ‌డం, ఆ పార్టీకి పెద్ద ఫ్ల‌స్ గా జ‌న‌సేన భావిస్తోంది.