జ‌గ‌న్ మీడియా ఉండ‌దు జ‌గ‌న్ ఉండ‌డు మంత్రి సంచ‌ల‌న వ్యాఖ్య‌లు

431

తెలుగుదేశం పార్టీ 2019 ఎన్నిక‌ల త‌ర్వాత గెలిస్తే రాజ‌కీయ పార్టీల‌ను మూయించేలా ఉంది అనేది తాజాగా మంత్రి మాట‌లు వింటుంటే తెలుస్తొంది… ఒక‌వేళ గాని మేము రాజ‌కీయంగా గెలిచి జ‌గ‌న్ ఓడిపోతే ఆయ‌న మీడియా అలాగే జ‌గ‌న్ క‌నిపించ‌రు అని అన్నారు మంత్రి య‌న‌మ‌ల రామ‌కృష్ణుడు.. ఇక ఇది కామెడీ వ్యాఖ్య‌లా ఓరిజిన‌ల్ మాట‌లా అనేది తెలియ‌డం లేదు.. కేవ‌లం జ‌గ‌న్ మీడియానే తెలుగుదేశం టార్గెట్. ఇప్ప‌టి నుంచే కాదు ఎప్ప‌టి నుంచో ఇలా జ‌గ‌న్ మీడియాపై అక్క‌సు వెళ్ల‌గ‌క్కుతున్నారు తెలుగుదేశం నేతలు.. ఇప్పుడు కూడా ఇలా సాక్షి మీడియాని టార్గెట్ చేశారు… ఇప్ప‌డు మంత్రి వ్యాఖ్య‌లు పొలిటిక‌ల్ కారిడార్లో వైర‌ల్ అవుతున్నాయి.

Image result for య‌న‌మ‌ల రామ‌కృష్ణుడు

అలాగే 2019లో ప్రధానిని నిర్ణయించేది తెలుగుదేశం పార్టీనే అని ఈ సందర్భంగా మంత్రి స్పష్టం చేశారు…. తాజాగా మీడియాతో మాట్లాడిన ఆయన.. జగన్‌ తన దుష్ప్రచారం కోసమే సాక్షి మీడియాను పెట్టారని విమర్శలు గుప్పించారు..అబద్దాలలో, దుష్ప్రచారంలో సాక్షి గోబెల్స్‌ను మించిపోయిందని చెప్పారు… గ‌తంలో గోబెల్స్ ప్ర‌చారం గురించి ఎంపీ విజ‌య‌సాయిరెడ్డి చంద్ర‌బాబుపై టీడీపీ పై చేసిన వ్యాఖ్య‌లను ఇప్పుడు వైసీపీ అధినేత‌పై ప్ర‌యోగించారు….. మొత్తానికి తెలుగుదేశం అధినేతపై జ‌గ‌న్ అక్క‌సు ప్ర‌ద‌ర్శిస్తున్నారు అని టీడీపీ విమ‌ర్శింస్తుంటే, ఎల్లో మీడియాల‌తో జ‌గ‌న్ పై దుష్ప్ర‌చారం చేస్తున్నారు అని వైసీపీ విమ‌ర్శిస్తోంది.

Image result for jagan

ఇక మంత్రిగారి వ్యాఖ్య‌లు చూస్తుంటే తెలుగుదేశం వ‌చ్చే ఎన్నిక‌ల స‌మ‌యానికి ఇంకెన్నీ కీల‌క నిర్ణ‌యాలు తీసుకుంటుందా అని నేత‌లు కూడా క‌ల‌వ‌ర‌ప‌డుతున్నారు.. నిజంగా జ‌గ‌న్ మీడియాని కనిపించ‌కుండా చేస్తారు అని ఇప్ప‌టికే అంటూనే ఉన్నారు.. ఇక తాజాగా జ‌గ‌న్ ని కూడా క‌నిపించ‌కుండా చేస్తారా అనేలా చ‌ర్చించుకుంటున్నారు.