విజ‌య‌సాయిరెడ్డికి మ‌హిళా టీడీపీ నేత పంచ్

254

మొత్తానికి వైసీపీ త‌ర‌పున విమ‌ర్శ‌లు కౌంట‌ర్లు చేసే ఎంపీ విజ‌య‌సాయిరెడ్డికి కౌంట‌ర్లు ప‌డుతున్నాయి తెలుగుదేశం నుంచి ప్ర‌తీ విష‌యంలో చంద్ర‌బాబుపై విమ‌ర్శ‌లు చేయ‌డం మానుకోవాలి అని అన్నారు తెలుగుదేశం నేత పంచుమర్తి అనురాధ. ఆయ‌న వ్యాఖ్య‌ల‌పై ఆమె మండిప‌డ్డారు.వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎంపి విజయసాయిరెడ్డి పిచ్చి కూతలు కూస్తున్నారని టీడీపీ నేత పంచుమర్తి అనురాధ మండిపడ్డారు. బుధవారం ఆమె మీడియాతో మాట్లాడుతూ వైసీపీ ఆత్మ కేసీఆర్, అంతరాత్మ కేటీఆర్ అని విమర్శించారు.

Image result for vijayasai reddy

ఇక్క‌డ తెలంగాణలో వైసీపీ ఎమ్మెల్యేలు టీఆర్ఎస్‌లో చేరితే జగన్ కనీసం గవర్నర్‌కు కూడా ఫిర్యాదు చేయలేదని అన్నారు. వైసీపీ ఎమ్మెల్యేలకు మిషన్ భగీరథ కాంట్రాక్టులు అప్పగించారని ఆమె ఆరోపించారు. వైసీపీ బహిరంగంగా టీఆర్ఎస్‌కు మద్దతిస్తోందని, ప్రత్యేక హోదాకు అడ్డుపడ్డ కేసీఆర్‌కు మద్దతిస్తారా? అంటూ ఆమె ప్రశ్నించారు. వైసీపీని ఏపీ ప్రజలు క్షమించరని పంచుమర్తి అనురాధ అన్నారు. ఇక్క‌డ తెలుగుదేశంలో చేరిన వైసీపీ నేత‌ల గురించి కంప్లైంట్ ఇచ్చిన జ‌గ‌న్, తెలంగాణ‌లోఎందుకు ఇవ్వ‌లేదు అని ప్ర‌శ్నించారు.