విశ్వ‌రూప్ వైసీపీలో ఎమ్మెల్యేగా పోటీ చేస్తారా ?

422

అమ‌లాపురంలో వైసీపీ తెలుగుదేశం పోటా పోటీగా రాజ‌కీయంగా ముందుకు వెళుతున్నాయి.. ఇక్క‌డ కుల స‌మీక‌ర‌ణలు చూసుకున్నా, అభివృద్ది జ‌పం పార్టీలు చేసినా …ప్ర‌జ‌లు ఓటు వేసేది మాత్రం అభివృద్ది కార్య‌క్ర‌మాల‌కు మాత్ర‌మే..పార్టీ ఏది ఉన్నా ఇక్క‌డ అభివృద్ది ఎవ‌రుచేస్తే ఆ పార్టీకి ఓటు వేస్తారు ఓట‌ర్లు.. అందుకే అంత సుల‌భంగా తూర్పుగోదావ‌రి వాణిజ్య రాజ‌ధాని అమ‌లాపురం ఓట‌రు నాడి ప‌సిగ‌ట్ట‌లేము.. 60 ఏళ్ల రాజ‌కీయ చ‌రిత్ర‌లో రెండు కులాల‌కు సంబంధించిన నేత‌లు ఇక్క‌డ ప‌ద‌వులు అధిరోహించారు.

Image result for jaganకాపులు బ‌లంగా ఈ సెగ్మెంట్లో ఉన్నా, బీసీ ఓటు బ్యాంకు కూడా రాజ‌కీయాల‌ను ఇక్క‌డ మార్చేస్తుంది. ఇక్క‌డ రాజకీయపార్టీల ప్రభంజనంలోను ఐదుసార్లు స్వతంత్ర అభ్యర్థులు విజయం సాధించారు.. నాలుగుసార్లు కుడుపూడి ప్రభాకరరావు, మూడుసార్లు మెట్ల సత్యనారాయణరావు ప్రాతినిధ్యం వహించారు. ఇది ఎస్సీల రిజ‌ర్వు ప్రాంతం….ఇక్క‌డ గ‌త ఎన్నిక‌ల్లో తెలుగుదేశం అభ్య‌ర్ది అయితాబ‌త్తుల ఆనంద‌రావు విజ‌యం సాధించారు..

Image result for Vishwaroop MLA

తెలుగుదేశం ఇప్పుడు ఇక్క‌డ విజ‌యం సాధిస్తుందా అంటే వ‌ర్గ‌పోరు చాలా పెరిగిపోయింది అని అంటున్నారు… అసెంబ్లీ స్దానంలో త‌మ‌కు టికెట్ అంటే త‌మ‌కు టికెట్ అని అప్పుడే సిట్టింగ్ ఎమ్మెల్యేకే ఎర్త్ పెడుతున్నారు కొంద‌రు నాయ‌కులు.. ఇటు జిల్లాలో ఇద్ద‌రు మంత్రులకు రెండు వ‌ర్గాలుగా నాయ‌కులు చీలిపోయి ఉన్నారు.. దీంతో ఇక్క‌డ గెలుపు ఎవ‌రికి అనేది అంత సుల‌భంగా చెప్పే ప‌రిస్దితుల్లో లేదు.

Related image

ఇక్క‌డ వ‌చ్చే ఎన్నిక‌ల్లో అధికార పార్టీ త‌ర‌పున పోటీ చేయ‌డానికి ముగ్గురు రెడీగా ఉన్నారు… ఇటు వైసీపీ త‌ర‌పున వ‌ర్గ‌పోరు లేదు అని చెప్పాలి…ఇక వైసీపీ నుంచి పి.విశ్వ‌రూప్ ఎమ్మెల్యేగా అమ‌లాపురం నుంచి పోటీ చేస్తారు అని అమ‌లాపురం వైసీపీ కేడ‌ర్ భావిస్తోంది..గ‌త ఎన్నిక‌ల్లో విశ్వ‌రూప్ అమ‌లాపురం త‌ర‌పున వైసీపీ నుంచి ఎంపీగా నిల‌బ‌డ్డారు.. కాని ఆ ఎన్నిక‌ల్లో ఆయ‌న ఓట‌మిపాల‌య్యారు… అమ‌లాపురం అసెంబ్లీకీ గ‌త ఎన్నిక‌ల్లో వైసీపీ త‌ర‌పున పోటీచేసిన గొల్ల‌బాబురావు పార్టీ కార్య‌క్ర‌మాల‌కు దూరంగా ఉంటున్నారు.. సో విశ్వ‌రూప్ కు గ‌తంలో ఇక్క‌డ ప్ర‌జ‌ల్లో కూడా బ‌ల‌మైన నేత‌గా పేరు ఉండ‌టంతో, ఆయ‌న పోటీకి జ‌గ‌న్ గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చారు అని తెలుస్తోంది…. ఆయన అమ‌లాపురం నుంచి శాస‌న‌స‌భ‌కు పోటీ చేసి వ‌చ్చే ఎన్నిక‌ల్లో గెలుస్తారు అని అంటున్నారు నేత‌లు.