వైసీపీ మ‌రో ప్ర‌య‌త్నం స‌క్సెస్ అవుతుందా ?

451

ఏపీలో ఇప్పుడు రాజకీయాలు చాలా హీట్ గా మారిపొయాయి.. కాంగ్రెస్ జ‌న‌సేన సేమ్ పొజిష‌న్లో ఉంటే, ఇటు బీజేపీ మాత్రం త‌ట‌స్ధంగా ఉండిపోయింది.. ముఖ్యంగా తెలుగుదేశం – వైసీపీ మ‌ధ్య బ‌లంగా పోటీ ఉండేలా క‌నిపిస్తోంది వ‌చ్చే ఎన్నిక‌ల్లో..ఇక క‌ర్నాట‌క రాజ‌కీయం ఏమైనా రిపీట్ అవుతుందా అనే ఆలోచ‌న చేస్తున్న‌వారికి అటువంటి బెంగ అక్క‌ర్లేదు అంటున్నారు రాజ‌కీయంగా.. ఇక్క‌డ‌తెలుగుదేశం మంచి ఫామ్ లో ఉన్నా ఆ ఫామ్ ని అదిగ‌మించే ప‌నిలో వైసీపీ ఉంది.. ఇటు పాద‌యాత్ర సెప్టెంబ‌ర్ నాటికి శ్రీకాకుళంలో పూర్తి చేసి మొత్తం రాజ‌కీయంగా మేనిఫెస్టో ప్ర‌క‌టించి బ‌స్సు యాత్ర చేయాలి అని జ‌గ‌న్ చూస్తున్నారు.. అన్ని వ‌ర్గాల నుంచి ఎవ‌రికి ఏమి కావాలి అనేది ఇప్ప‌టికే ఆయ‌న తెలుసుకుంటున్నారు.

Image result for jagan padayatra

ఇక ప్ర‌జ‌ల్లో కూడా వైసీపీ ఎంతో బ‌లంగా వెళుతున్నా… టీడీపీ పోరాటం పై కూడా ప్ర‌జ‌లు ఆలోచ‌న చేస్తున్నారు… మిత్ర‌బంధం వ‌దిలేసి తెలుగుదేశం అవిశ్వాసం ప్ర‌వేశ‌పెట్టి కేంద్రం పై పోరాటం చేసింద‌ని, బీజేపీని సెంట‌ర్ చేసింది అని తెలుగుదేశం పై కూడా ప్ర‌జ‌ల్లో పాజిటీవ్ రెస్పాన్స్ వ‌చ్చింది… వైసీపీ తమ పార్టీ ఎంపీలు రాజీనామాల‌తో రాజ‌కీయం మారుతుంది అని అనుకున్నారు ప్ర‌జ‌ల నుంచి రెస్పాన్స్ బాగానే వ‌స్తుంది అని భావించారు.. కాని ఇప్పుడు ఐదుగురి ఎంపీల రాజీనామాలు ఎలా ఉన్నా తెలుగుదేశం పోరాటం మాత్ర‌మే గుర్తువ‌స్తోంది జ‌నాల‌కు… సో ఇప్పుడు పొలిటిక‌ల్ గా ఏ స్టెప్ వేసినా తెలుగుదేశం వైసీపీ ని ప్ర‌జ‌లు బాగా అబ్జ‌ర్వ్ చేస్తున్నారు..

Related image

అందుకే ఆచితూచి అడుగులు వేయాల‌ని ఈ రెండు పార్టీలు యోచిస్తున్నాయి.ఇప్ప‌టికే అవిశ్వాస తీర్మానం త‌ర్వాత తెలుగుదేశం ఎంపీలు రాజీనామా చేసి మాతో పోరాటం చేయాల‌ని పిలుపునిచ్చిన జ‌గ‌న్, బంద్ కు పిలుపునిచ్చారు.. ఇక ఈ బంద్ స‌మ‌యంలో కూడా అధికార పార్టీ, వైసీపీ నేత‌ల‌ను అరెస్ట్ చేసింది అని విమ‌ర్శ‌లు వ‌చ్చాయి.. బంద్ కొన్ని చోట్ల స‌క్సెస్ అయినా మ‌రికొన్ని చోట్లతేలిపోయింది.. ఇక తాజాగా వైసీపీ ఈ నెల 9న గుంటూరు జిల్లాలో వంచ‌న గ‌ర్జ‌న చేయాల‌ని నిర్ణ‌యించింది మ‌రి దీని రెస్పాన్స్ ప్ర‌జ‌ల నుంచి ఎలా ఉంటుందో చూడాలి.