ముద్ర‌గ‌డ కొత్త పార్టీలో చేర‌బోతున్నారా ?

394

వైసీపీ కాపుల రిజ‌ర్వేష‌న్ల పై స్ప‌ష్ట‌మైన విష‌యం తెలియ‌చేసింది.. ఇటు తెలుగుదేశం నాలుగేళ్లుగా కాపుల‌కు ఇచ్చిన హామీని నెర‌వేర్చ‌లేదు.. దీంతో కాపులు అంద‌రూ తెలుగుదేశం వైసీపీ మాట‌ల‌ను న‌మ్మే ప‌రిస్దితుల్లో లేరు.. ఈ స‌మ‌యంలో వైసీపీ తెలుగుదేశం మాట ఎలా ఉన్నా ముఖ్యంగా కాపు ఉద్య‌మ‌నేత మాజీ మంత్రి ముద్ర‌గ‌డ ప‌ద్మ‌నాభం ఏమాట చెబుతారా అని నేత‌లు ఆలోచిస్తున్నారు… మ‌రోప‌క్క జ‌న‌సేన పై కూడా ఆశ‌లు ఉన్నాయి… ప‌వ‌న్ కాపుల‌కు రిజ‌ర్వేష‌న్ల హామీ ప్ర‌క‌టిస్తే రాష్ట్ర జ‌నాభాలో 15 శాతం ఉన్న కాపు ఓటు బ్యాంకు మొత్తం జ‌న‌సేన‌కు మ‌ర‌లుతుంది.. అంటే సుమారు 70 ల‌క్ష‌ల ఓట్లు జ‌న‌సేన‌కు ఇక్క‌డ ప్ల‌స్ అవుతాయి మ‌ళ్లీ బీసీ ఓటు బ్యాంకు జ‌న‌సేన‌కు మైన‌స్ అవుతుంది అందుకే రాజకీయ పార్టీలు డైల‌మాలో ఉన్నాయి.

Image result for ముద్ర‌గ‌డఇక ఈ స‌మ‌యంలో మాజీ మంత్రి ముద్ర‌గ‌డ ప‌ద్మ‌నాభం కాపుల రిజ‌ర్వేష‌న్ అంశం విష‌యంలో రాజ‌కీయ పార్టీలు తీసుకుంటున్న నిర్ణయాల‌ను చూసి ఆయ‌న ఏమి చెబుతారా అని నేత‌లు ఆలోచ‌న‌లో ఉన్నారు.. ఆయ‌న ఇప్ప‌టికే ప‌లు ద‌ఫాలుగా కాపు నేత‌ల‌తో భేటీ అవుతున్నారు.ఆయ‌న మాట‌ల ప్ర‌కారం వైసీపీలో ఆయ‌న చేరే ఆలోచ‌న‌లో లేరు…. ఇక టీడీపీ వైపు అడుగులు వేసే ఆలోచ‌న ఆయ‌న‌కు లేనే లేదు అని అంటున్నారు.

Image result for ముద్ర‌గ‌డ

అవ‌కాశం కోసం చూస్తున్నకాంగ్రెస్ పార్టీ ఇక్క‌డ త‌న రాజకీయ చ‌తుర‌త‌ను చూపుతోంది.. మాజీ మంత్రి ముద్ర‌గ‌డ‌ను కాంగ్రెస్ పార్టీలో చేర్చుకోవాలి అని భావిస్తున్నారు కాంగ్రెస్ నేత‌లు.. ఆయ‌న‌తో ఉమెన్ ఛాందీ భేటీ అవుతార‌ని ఆయ‌నకు గోదావ‌రి జిల్లాల కాంగ్రెస్ బాధ్య‌త అప్ప‌గించ‌నున్నారు అని తెలుస్తోంది. ఆయ‌నకు మ‌ళ్లీ కాంగ్రెస్ పార్టీలో పున‌ర్వైభ‌వం ఇచ్చేంద‌కు స్టేట్ లీడ‌ర్లు రెడీ అవుతున్నారు అని చ‌ర్చించుకుంటున్నారు.. ఉమెన్ రాయబారం ఒకే అయితే ఆయ‌న రాహుల్ స‌మ‌క్షంలో కాంగ్రెస్ కు రీ ఎంట్రీ అని అంటున్నారు కిర్లంపూడి నాయ‌కులు… మ‌రి చూడాలి కాపుల‌కు కాంగ్రెస్ కూడా అదికారంలోకి వ‌చ్చిన వెంట‌నే రిజ‌ర్వేష‌న్లు క‌ల్పిస్తాం అంటోంది ఇది ఎంత వ‌ర‌కూ ముద్ర‌గ‌డ న‌మ్ముతారో.