కూక‌ట్‌ప‌ల్లి నియోజకవర్గంపై మీడియా సంచలన ఎగ్జిట్ పోల్ సుహాసిని ఓడిపోతుందా గెలుస్తుందా?

395

టీఆర్ఎస్‌, మ‌హాకూట‌మి మ‌ధ్య హోరాహోరీగా సాగిన తెలంగాణ ఎన్నిక‌ల పోరు క్లైమాక్స్‌ ద‌శ‌కు చేరుకుంది. ఎన్నిక‌ల పోలింగ్ ముగియ‌డంతో ఇప్పుడు అంద‌రి దృష్టి ఎన్నిక‌ల ఫ‌లితాల‌పై ప‌డింది. దాదాపు తెలంగాణ వ్యాప్తంగా 73 శాతం పోలింగ్ న‌మోదు అయిన‌ట్లు ఎన్నిక‌ల కమిష‌న్ శ‌నివారం అధికారికంగా ప్ర‌క‌టించింది. ఇంకా కొన్ని జిల్లాల నుంచి తుది రిపోర్టులు రాలేద‌ని, దాదాపు 72 శాతం ఉండ‌వ‌చ్చ‌ని ఈసీ తెలిపింది. ఇక ఈ నెల 11న ఎన్నిక‌ల కౌంటింగ్ జ‌ర‌గనున్న విష‌యం తెలిసిందే. ఈ మేర‌కు ఇప్ప‌టికే నియోజ‌క‌వ‌ర్గాల్లో కౌంటింగ్‌కు ఈసీ ఏర్పాట్లు చేస్తోంది. దీంతో ఆ రోజు తెలంగాణ ఎన్నిక‌ల్లో ఎవ‌రు గెలుస్తార‌నేది అంతిమంగా తేల‌నుంది. తెలంగాణ‌ ఎన్నిక‌ల ఫ‌లితాల‌పై తెలుగు రాష్ట్రాల‌తో పాటు దేశ‌వ్యాప్తంగా కూడా ఆస‌క్తి నెల‌కొని ఉండ‌టంతో ప్ర‌తిఒక్క‌రూ ఉత్కంఠ‌తో ఎదురుచూస్తున్నారు.ముఖ్యంగా నందమూరి వారసురాలిగా కూకట్ పల్లి నుంచి పోటీ చేసిన సుహాసిని గెలుస్తుందా ఓడుతుందా అని అనుకుంటున్నారు.మరి సర్వేలు ఏం చెబుతున్నాయి.గెలుస్తుందా ఓడుతుందా..ఇప్పుడు తెలుసుకుందాం.

Image result for nandamuri suhasini

తెలంగాణ ఎన్నిక‌ల‌పై వివిధ ఎగ్జిట్ పోల్స్ సంచ‌ల‌నం సృష్టిస్తున్నాయి. నేష‌న‌ల్ మీడియా ఛాన‌ల్స్ అన్ని టీఆర్ఎస్ విజ‌య‌ఢంకా మోగిస్తుంద‌ని చెబుతుండ‌గా.. స‌ర్వేల్లో సిద్ద‌హ‌స్తుడైన ఆంధ్రా ఆక్టోప‌స్ ల‌గ‌డ‌పాటి రాజ‌గోపాల్ మాత్రం ప్ర‌జాకూట‌మి గెలుపు ఖాయ‌మ‌ని చెబుతున్నారు. ఎవ‌రు గెలుస్తార‌నే దానిపై న‌రాలు తెగే ఉత్కంఠ మ‌ధ్య ప్ర‌జ‌లు ఎదురుచూస్తున్నారు. అయితే తెలంగాణ ఎన్నిక‌ల్లో అన్ని నియోజ‌క‌వ‌ర్గాలు ఒక్క ఎత్తు అయితే..కూక‌ట్ ప‌ల్లి నియోజ‌క‌వ‌ర్గం మ‌రో ఎత్తు. నంద‌మూరి హ‌రికృష్ణ కుమార్తె నంద‌మూరి సుహాసిని ఇక్క‌డ నుంచి పోటీ చేయ‌డంతో తెలుగు రాష్ట్రాల్లో అంద‌రి దృష్టి కూక‌ట్ ప‌ల్లి పైనే ఉంద‌ని చెప్ప‌వ‌చ్చు. కూక‌ట్ ప‌ల్లిలో సుహాసిని గెలుస్తుందా.. లేదా అనేది పెద్ద చ‌ర్చ‌నీయాంశంగా మారింది. ఆమె గెలుస్తుందా.. లేదా అనే దానిపై భారీ స్ధాయిలో బెట్టింగ్‌లు జ‌రుగుతున్నట్లు టాక్ వినిపిస్తుంది. తెలంగాణ ఎన్నిక‌ల్లో సుహాసిని గెలుపోట‌ముల‌పైనే భారీగా బెట్టింగ్ రాయుళ్లు పందేలు కాస్తున్న‌ట్లు వార్త‌లు వినిపిస్తున్నాయి. అయితే ఆమె గెలుపుపై టీడీపీ శ్రేణులు మాత్రం ధీమాతో కనిపిస్తున్నారు. సుహాసిని గెలుపు ఖాయ‌మని తేల్చిచెబుతున్నారు.అయితే మ‌రికొంత‌మంది మాత్రం సుహాసిని గెలుపుపై అనుమానం వ్య‌క్తం చేస్తున్నారు.

ఈ క్రింద వీడియో మీరు చూడండి

ఈ క్ర‌మంలో ఇంత‌కు సుహాసిని గెలుస్తుందా.. లేదా అనే దానిపై డివిజ‌న్ల వారీగా పీడీఆర్ మీడియా నిర్వ‌హించిన ఎగ్జిట్ పోల్ మీకు అందిస్తున్నాం.ముందుగా కూక‌ట్ ప‌ల్లి నియోజ‌క‌వ‌ర్గ ఓటర్ల సంఖ్య చూసుకుంటే మొత్తం ఓట‌ర్ల సంఖ్య 3 ల‌క్ష‌ల 72 వేల 819 . అందులో పురుష ఓట‌ర్లు ల‌క్షా 12 వేల 872 మంది కాగా, మ‌హిళా ఓట‌ర్లు ల‌క్షన్న‌ర మంది ఉన్నారు.ఇందులో 2 ల‌క్ష‌ల 15 వేల‌369 ఓట్లు పోల‌య్యాయి. మొత్తం ఓటింగ్ శాతం చూసుకుంటే 57.77గా న‌మోదు అయింది. ఇక డివిజ‌న్ల వారీగా పురుష‌ ,మ‌హిళా ఓట‌ర్ల సంఖ్య‌తో పాటు పోలైన ఓట్లు, ఓటింగ్ శాతం మీరు కింద ఉన్న టేబుల్‌లో చూడ‌వ‌చ్చు .కూక‌ట్ ప‌ల్లిలో ప్ర‌త్యేకంగా పీడీఆర్ మీడియా నిర్వ‌హించిన‌ ఎగ్జిట్ పోల్ స‌ర్వే ప్ర‌కారం నంద‌మూరి సుహాసిని భారీ మెజార్టీతో గెల‌బోతున్న‌ట్లు స్ప‌ష్టంగా క‌నిపిస్తుంది. కూక‌ట్ ప‌ల్లిలో మొత్తం పోలైన‌ 2 ల‌క్ష‌ల 15 వేల‌369 ఓట్లల్లో తెలుగుదేశం పార్టీ అభ్య‌ర్ధి నంద‌మూరి సుహాసినికి 1, 22 , 125 ఓట్లు పోలైన‌ట్లు మా ఎగ్జిట్ పోల్ స‌ర్వేలో తేలింది. ఇక తెరాస అభ్య‌ర్ది మాధ‌వ‌రం కృష్ణారావుకు 81 , 364 ఓట్లు పోల‌య్యాయి. డివిజ‌న్ల వారీగా పీడీఆర్ మీడియా నిర్వ‌హించిన ఎగ్జిట్ పోల్ ప్ర‌కారం నంద‌మూరి సుహాసిని భారీ మెజార్టీతో గెల‌వ‌బోతోంద‌ని మా పీడీఆర్ మీడియా స‌ర్వేలో స్ప‌ష్టంగా తేలింది.చూడాలి మరి ఏం జరగబోతుందో.మరి ఈ విషయం గురించి మీరేమంటారు.సుహాసిని గెలవబోతుందా లేక ఓడిపోతుందా..అలాగే సర్వేలు చెబుతున్న లెక్కల గురించి మీ అభిపాయాలను మాకు కామెంట్ రూపంలో చెప్పండి.