ప్రత్యెక హోదాపై మాట మార్చిన మోడీ ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానం పెట్టండి…నేను స్వయంగా ఢిల్లీ వెళ్లి అన్ని పార్టీల అధినాయకులని కలిసి మద్దతు కూడగడతానని గతంలో భారీ స్టేట్ మెంట్ ఇచ్చిన పవన్ ఇప్పుడా విషయంపై స్పందించడం లేదు..
అభిమాన గణం ఎదురుగా మైకు దొరికితే రెచ్చిపోయే పవన్ మాటలన్నీ పాల పొంగులా ఉంటున్నాయే తప్ప వాటికి ప్రాధాన్యత లేదు…ఈ రోజు ఏపి అధికార పక్షం మోడీ ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టింది..మరి.. దీనిపై మాట్లాడటం.. ప్రత్యేక హోదా అంశంపై మోడీ చేసిన హామీలు.. చెప్పిన మాటల్ని ప్రస్తావించాల్సిన అవసరం ఉంది. ఏదో తూతూ మంత్రంగా ట్విట్టర్ లో ఒక సందేశాన్ని పోస్టు చేసేసి పని అయిపోయిందన్నట్లుగా వ్యవహరించటం తగని పని.
ఏపీకి ముఖ్యమంత్రి కావాలన్న ఆశను.. ఆసక్తిని ఈ మధ్యన ప్రదర్శిస్తున్న పవన్ కల్యాణ్.. అందుకు ముందు తనకు అర్హత ఉందన్న విషయాన్ని తన చేతలతో చేసి చూపించాల్సిన అవసరం ఉంది. ఏపీకి మోడీ సర్కారు చేసిన అన్యాయంపై గుక్క తిప్పుకోకుండా అన్నట్లు తన వాదనను వినిపించిన గల్లా మాదిరి పవన్ ప్రిపేర్ కావాల్సిన అవసరం ఉంది. అదేమీ లేకుండా.. అప్పుడప్పుడు ముక్కున పెట్టుకున్నట్లుగా మాట్లాడటంతో ఏపీకి ఎలాంటి ప్రయోజనం ఉండదన్న విషయాన్ని పవన్ గుర్తిస్తే మంచిది.