వివేకానందరెడ్డి హత్యను పోలీసులు ఎందుకు దాచారు వెలుగులోకి నమ్మలేని నిజాలు

242

వైఎస్ వివేకానందరెడ్డి హత్య సంచలనం రేపుతోంది. హత్య అని పోస్టుమార్టం రిపోర్ట్ వచ్చే వరకు పోలీసులు ఎందుకు ప్రకటించలేదు.. ఎందుకు ఆ దిశగా కనీసం అనుమానాలను వ్యక్తం చేయలేదు.. ఓ మృతదేహంపై ఏడు కత్తిగాట్లు ఉంటే.. అది కూడా బలంగా తగిలి ఉన్నా కూడా పోలీసులు ఎందుకు దాచారు.. వైఎస్ వివేకానందరెడ్డి మృతదేహం పడి ఉన్న తీరు చూసిన తర్వాత.. ఆస్పత్రికి తరలించిన తర్వాత కూడా హత్య అనే విషయాన్ని బయటకు రాకుండా ఎందుకు దాచారు అనే ప్రశ్నలు వ్యక్తం అవుతున్నాయి. పోస్టుమార్టం రిపోర్టులో హత్య అని డాక్టర్లు స్పష్టం చేసిన తర్వాతే.. పోలీసులు వెల్లడించటం వెనక కారణాలు అందరినీ విస్మయానికి గురి చేస్తున్నాయి. దీని వెనుకు ఏదైనా మర్మం ఉందా అని అనుమానాలు వ‌స్తున్నాయి.

Image result for ys vivekananda reddy dead body

వైఎస్ వివేకానందరెడ్డి మరణం తర్వాత స్పాట్ కు క్లూస్ టీం వచ్చింది. పోలీస్ కుక్కలు వచ్చాయి. భారీ ఎత్తున పోలీసులు వచ్చి పరిశీలించారు. అంతా పరిశీలించిన తర్వాత కూడా హత్య అన్న విషయాన్ని బయటకు వెల్లడించలేదు. అంత రక్తం ఎలా పోయింది.. బాత్రూమ్ లో మృతదేహం పడి ఉన్న తీరు.. ఆస్పత్రికి తరలించిన తర్వాత.. డాక్టర్లు పరిశీలిస్తున్నారు. శరీరంపై అప్పుడైనా గాయాలు కనిపించలేదా అనేది మరో సందేహం. పోస్టుమార్టం కంటే ముందే.. ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో వివేకాను పరిశీలించారు వైద్యులు. అప్పుడు కూడా ఆ డాక్టర్లు చెప్పిన విషయాన్ని పోలీసులు బయటకు చెప్పటానికి నిరాకరించారు. చాలా గోప్యంగా వ్యవహరించారు.

ఈ క్రింది వీడియో చూడండి 

ఓ వ్యక్తి శరీరంపై ఎనిమిది కత్తిగాట్లు.. అందులోనూ బలంగా ఉన్నాయి. వాస్తవంగా అయితే సీన్ చూసిన తర్వాత.. మృతదేహాన్ని పరిశీలించిన వెంటనే పోలీసులు ప్రాథమికంగా హత్య.. ఆత్మహత్యా.. అనుమానాస్పద మృతి.. ఇలా ఏదో ఒకటి చెప్పేస్తారు. వైఎస్ వివేకానందరెడ్డి విషయంలో పోలీసులు మాత్రం ఎక్కడా తొందరపడలేదు.. మీడియాలో వచ్చే వార్తలను కూడా ఖండించలేదు. గుండెపోటు అని అందరూ చెబుతుంటే స్పందించలేదు. ఓ వ్యక్తి ఇంత కిరాతకంగా చంపబడితే.. స్పాట్ అంతా రక్తంతో మడుగు అయితే.. పని ఉన్న తీరుపై అందరికీ అనుమానాలు వ్యక్తం అవుతున్నా.. పోలీసులు మాత్రం హత్యగా చెప్పటానికి వెనకాడటం ఏంటో అర్థం కావటం లేదు. శాంతి భద్రతల విషయాన్ని దృష్టిలో పెట్టుకుని ఇలా చేశారా లేక మరేదైనా కారణం ఉందా అనేది వాళ్లు చెబితేనే తెలుస్తుంది.