రామోజీరావు మనవరాలు వివాహానికి.. జగన్ ఎందుకు వెళ్ళలేదు..?

330

ప్రముఖ వ్యాపారవేత్త, ఈనాడు సంస్థల అధినేత రామోజీ రావు మనవరాలు వివాహం ఘనంగా జరిగిన సంగ‌తి తెలిసిందే. సుమన్ కుమార్తె అయిన కీర్తి సోహానా, వినయ్‌ల వివాహం శ‌నివారం హైదరాబాద్‌లోని రామోజీరావుఫిల్మ్‌సిటీలో అంగరంగ వైభవంగా జ‌రిగింది. ఈ వేడుక‌కు రాజ‌కీయ‌నాయ‌కు, వ్యాప‌ర‌వేత్త‌లు, సినీ ప్ర‌ముఖుల‌తో పాటు ప‌లువురు పాల్గొని నూత‌న వ‌ధూవ‌రుల‌ను ఆశీర్వ‌దించారు.

Image result for రామోజీ రావు మనవరాలు వివాహం

ఇక ఈ వేడుక‌కు రాజ‌కీయ‌నేత‌ల్లో ముఖ్యంగా ఏపీ ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు, తెలంగాణ ముఖ్య‌మంత‌రి కేసీఆర్, జ‌న‌సేన అధినేన‌ ప‌వ‌న్ క‌ళ్యాణ్ ఇలా అనేక మంది రాజ‌కీయ ప్ర‌ముఖులు పాల్గొన్నారు. వైసీపీ నుండి రాజ్య‌స‌భ ఎంపీ విజ‌య‌సాయిరెడ్డి కూడా పాల్గొన్నారు. అయితే వైసీపీ అధినేత జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి మాత్రం రామోజీరావు మ‌న‌వ‌రాలి వివాహ వేడుక‌కు హాజ‌రు కాక‌పోవ‌డం రాజ‌కీయ‌వ‌ర్గాల్లో చ‌ర్చ‌కు దారి తీసింది.

ఈ క్రింది వీడియో చూడండి

ఇక జ‌గ‌న్ పాద‌యాత్ర ప్రారంభించే ముందు రామోజీరావును క‌ల‌వ‌డం అప్ప‌ట్లో రాజ‌కీయ‌వ‌ర్గాల్లో సంచ‌ల‌నంగా మారింది. ఇంత‌క ముందు జ‌గ‌న్‌ను దుమ్మెత్తిపోసే ఈనాడు గ‌తంలోలా జ‌గ‌న్‌ను టార్గెట్ చేయ‌డంలేదు. దీంతో కొంత‌కాలంగా రామోజీరావు, జ‌గ‌న్ మ‌ధ్య రిలేష‌న్‌లో మార్పు క‌నిపిస్తోంద‌ని స‌ర్వ‌త్రా భావించారు.అయితే తాజాగా రామోజీ మ‌న‌వరాలు పెళ్ళికి జ‌గ‌న్ హాజ‌రు కాక‌పోవ‌డంతో ఈ ఇద్ద‌రి మ‌ధ్య వైరం కొన‌సాగుతూనే ఉందా అనే అనుమానాలు తెర‌పైకి వ‌స్తున్నాయి. ఏది ఏమైనా ప్ర‌ముఖులంతా హాజ‌రు అయిన రామోజీ మ‌న‌వ‌రాలు వివాహానికి జ‌గ‌న్ ఇత‌ర ముఖ్య కార‌ణాల వ‌ల్ల హాజ‌రు కాలేక‌పోయారా లేక వ్య‌క్తిగ‌త కార‌ణాల వ‌ల్ల రాలేక‌పోయారా అనేది ఇప్పుడు రాకీయ‌వ‌ర్గాల్లో చ‌ర్చ‌నీయాంశంగా మారింది.