తెలంగాణ స్పీకర్ గా కెసిఆర్ ఎవరిని తీసుకుంటున్నాడో తెలిస్తే షాక్

468

ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న సమయం వచ్చేసింది.తెలంగాణ ఎన్నికలలో కెసిఆర్ ఘనవిజయం సాధించారు.గత ఎన్నికలలో కంటే ఈసారి ఇంకా ఎక్కువ సీట్స్ వచ్చాయి.దాంతో మరొకసారి కెసిఆర్ మరొకసారి ప్రభుత్వాన్ని నడిపియ్యనున్నాడు.కెసిఆర్ రేపు ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చెయ్యనున్నారు. అయితే తన కేబినెట్ లో ఎవరికీ మంత్రి పదవులు ఇస్తారా అని అందరు ఎదురుచూస్తున్నారు.ముఖ్యంగా స్పీకర్ గా ఎవరిని తీసుకుంటాడో అని ఎదురుచూస్తున్నారు. మరి ఆ విషయం గురించి తెలుసుకుందామా.

Image result for పద్మా దేవేందర్

గత ప్రభుత్వ హయాంలో మంత్రులుగా చేసిన జూపల్లి కృష్ణారావు తుమ్మల నాగేశ్వర రావు పట్నం మహేందర్ రెడ్డి ఓటమి పాలయ్యారు.వీళ్ళతో పాటు శాసనసభ స్పీకర్ గా చేసిన మధుసూదనాచారి కూడా ఓడిపోవడంతో అందరు షాక్ కు గురయ్యారు. అయితే వీళ్ళ స్థానాలను ఎవరికీ కట్టబెడతాడో అనే అంశం ఆసక్తిగా మారింది.ముఖ్యంగా స్పీకర్ గా ఎవరిని అనౌన్స్ చేస్తారనే ఉత్కంఠ అందరిలో ఉంది.గత ప్రభుత్వ హయాంలో కేబినెట్ లో మహిళలకు చోటు ఇవ్వలేదనే విమర్శ ఉంది.ఈ వాదనలకు పులుస్టాప్ పెట్టేందుకు మెదక్ నుంచి గెలిచినా పద్మా దేవేందర్ కు మంత్రి పదవి ఇచ్చే ఆలోచనలో కెసిఆర్ ఉన్నట్టు తెలుస్తుంది.ఒకవేళ ఆమెకు మంత్రి పదవి ఇవ్వకపోతే ఇంతకముందు డిప్యూటీ స్పీకర్ గా చేసిన అనుభవం ఉంది కాబట్టి ఈసారి ఆమెను స్పీకర్ గా నియమించాలనే ఆలోచనలో కెసిఆర్ ఉన్నాడు.పద్మా దేవేందర్ విషయంలో కెసిఆర్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటాడో అనే విషయం మీద రాజకీయ వర్గాలలో ఆసక్తిగా మారింది.

ఈ క్రింద వీడియో మీరు చూడండి

ఒకవేళ ఆమెకు కనుక మంత్రి పదవి ఇస్తే లాస్ట్ ఎన్నికలలో గెలిచి ఈసారి కూడా గెలిచి పోయిన ప్రభుత్వ హయాంలో మంత్రి కానీ వారికి స్పీకర్ డిప్యూటీ స్పీకర్ పదవులు ఇచ్చే అవకాశం ఉంది.అలంటి వారు తెరాస ప్రభుత్వంలో చాలా మంది ఉన్నారు..మంత్రి పదవి ఆశించే నాయకులూ చాలా మంది ఉన్నారు.చూడాలి మరి కెసిఆర్ ఎవరికీ ఏ పదవులు కట్టబెడతాడో.అలాగే రేపు కెసిఆర్ ప్రమాణ స్వీకారంతో పాటు మరొక ఐదు మందిని మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేపించాలని కూడా కెసిఆర్ అనుకుంటున్నాడు.ఒకవేళ అదే జరిగితే కేటీఆర్ హరీష్ రావు ఈటెల రాజేందర్ నాయిని నరసింహ రెడ్డి తలసాని శ్రీనివాస్ యాదవ్ లతో ప్రమాణ స్వీకారం చేయిస్తాడని అంటున్నారు.మరి ఏం జరుగుతుందో చూద్దాం.