పత్తికొండలో విజయం ఎవరిది?

212

కర్నూలు జిల్లాలో పత్తికొండ లో వైసీపీకి ఎటువంటి ఫేమ్ ఉంది …అలాగే సిట్టింగ్ తెలుగుదేశం నాయకుడు డిప్యూటీ సీఎం గా ఉన్న కేఈ కృష్ణమూర్తి ఈసారి ఇక్కడ ఎలాంటి స్ట్రాటజీ చూపనున్నారు అనే విషయం పై పెద్ద ఎత్తున వార్తలు కర్నూలు జిల్లాలో వినిపిస్తున్నాయి.వచ్చే ఎన్నికలలో టీడీపీ, బీజేపీ, జనసేన పార్టీలు వేర్వేరుగా అభ్యర్థులను బరిలో దింపినా సరే ఇక్కడ వైసీపీ గెలుస్తుంది అని వైసీపీ కి తిరుగులేదు అని చెబుతున్నారు ఇక్కడ వైసీపీ నాయకులు.

Image result for కేఈ కృష్ణమూర్తి

అలాగే తెలుగుదేశం నుంచి కేఈ కుమారుడు శ్యాంబాబు పోటికి ఉండటంతో ,బరిలోకి ఆయన దిగడంతో మరి సీనియర్ రాజకీయ కుటుంబ వారసుడికి విజయం వస్తుంది అని అంటున్నారు ఇక్కడ టీడీపీ నేతలు…పత్తికొండ వైసీపీ పార్టీ సమన్వయకర్త కంగాటి శ్రీదేవికి కేఈ శ్యాంబాబుకు ఈసారి పార్టీల తరపున గట్టి టఫ్ పోటి ఉంటుంది అని తెలుస్తోంది. ఇక్కడ ఇద్దరూ కూడా వేరు వేరు సామాజిక వర్గాలు.. అలాగే రెండు కేడర్లు ఉన్నాయి.

Image may contain: 10 people, people smiling, people standing

గత ఎన్నికల్లో కేఈ కుటుంబం ఇక్కడ ఎమ్మెల్యేగా గెలిచి టీడీపీకి మళ్లీ ఫేమ్ తీసుకువచ్చారు.. అయితే ఇప్పుడు ఆయన తనయుడు బరిలోకి దిగుతున్నారు ఇక పత్తికొండ నియోజకవర్గం లో సమస్యలు తీర్చలేదు అని వైసీపీ ఇంచార్జ్ శ్రీదేవి విమర్శిస్తున్నారు. మొత్తానికి వీరి వివాదాలు ఎలాఉన్నా విమర్శలు మాత్రం వీరు చేసుకుంటున్నా, ప్రజలు మాత్రం వీరిలో ఎవరు సరైన ఎమ్మెల్యే అనేది తేల్చనున్నారు.. ఎందుకు అంటే ఇప్పుడు ఇక్కడ పార్టీలు ముఖ్యం అవనున్నాయి ఇద్దరూ కూడా తొలిసారి ఎమ్మెల్యే అభ్యర్దులు కానుండటంతో.