బాబు మోడీని క‌లిసిన‌ప్పుడు అవే అడిగేవారు పురందేశ్వ‌రి

453

తెలుగుదేశం పార్టీ అధినేత సీఎం చంద్ర‌బాబు పై విమ‌ర్శ‌లు చేయ‌డంతో చిన్నమ్మ బీజేపీ నేత మాజీ కేంద్ర మంత్రి పురందేశ్వ‌రి విమ‌ర్శ‌లు చేస్తూనే ఉంటారు.. ఇటు ఫ్యామిలీ మెంబ‌ర్ ఆయినా రాజ‌కీయం రాజ‌కీయం అంటూ ఉంటారు.. అస‌లు ఏపీ బీజేపీ ప‌గ్గాలు ఆమెకు వ‌స్తాయి అని అనుకున్నారు అంద‌రూ.. కాని ఆమెకు కాకుండా క‌న్నాకు ద‌క్కాయి.. ఈ స‌మ‌యంలో అస‌లు చిన్న‌మ్మ పురందేశ్వ‌రికి ఆ ప‌గ్గాలు వ‌చ్చి ఉంటే ఏపీలో బీజేపీ తెలుగుదేశం ఫైట్ మ‌రింత ర‌స‌వ‌త్త‌రంగా ఉండేది.

Image result for babu and modi

ఇక రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ కేంద్రం పై విమ‌ర్శ‌లు చేయ‌డం ప‌నిగా పెట్టుకుంది అని ఆమె విమ‌ర్శ‌లు చేస్తున్నారు..ఇటు కేంద్రం ద‌గ్గ‌ర నిధులు తీసుకుని మ‌రీ కేంద్రం పై అభాండాలు వేస్తున్న పార్టీ తెలుగుదేశం అని ఆమె విమ‌ర్శించారు.. గ‌తంలో కూడా బాబు పై ఎటువంటి చ‌ర్య‌లు బీజేపీ తీసుకోదు అని దీనిపై తెలుగుదేశం నేత‌లు కంగారు ప‌డ‌వ‌ద్ద‌ని ఆమె సంచ‌ల‌న కామెంట్లు చేశారు.. ఇక బాబు కేంద్రంపై చేసే ఆరోప‌ణ‌లు అన్నీ అస‌త్య ఆరోప‌ణ‌లు అని ఆమె విమ‌ర్శించారు.

Image result for jagan

 

రాష్ట్రంలో తెలుగుదేశం పూర్తిగా వైఫల్యం చెందింది అందుకే కేంద్రం పై బీజేపీ పై ఆరోప‌ణ‌లు చేస్తున్నారు అని ఆమె విమ‌ర్శించారు..రాజకీయ లబ్ధి కోసమే టీడీపీ తప్పుడు ప్రచారం చేస్తోందని మండిపడ్డారు ఆమె…. హోదా కంటే ప్యాకేజీ గొప్పగా ఉంటుందని చంద్రబాబు గ‌తంలో అంగీకరించలేదా అని ప్రశ్నించారు. రాష్ట్ర విభజనకు చంద్రబాబు వ్యతిరేకం కాదన్నారని గుర్తుచేశారు… రాష్ట్ర ప్రయోజనాల నాలుగేళ్ల పాలనలో కోసం ఏమైనా అడిగారా అని ధ్వజమెత్తారు.

Image result for Purandeswari

 

ప్ర‌ధాని న‌రేంద్ర‌మోడీని చంద్ర‌బాబు క‌లిసిన స‌మ‌యంలో ఆయ‌న ఏమి అడిగేవారో బీజేపీ నేత‌ల‌కు తెలుసు అని, గ‌తంలో సోము వీర్రాజు కూడా ఇలాంటి ఆరోప‌ణ‌లు చేశారు.. నియోజ‌క‌వ‌ర్గాల పున‌ర్విభ‌జ‌న జ‌గ‌న్ కేసుల గురించి మిన‌హా ఏమీ ఎప్పుడూ అడ‌గలేదు అని ఆయ‌న విమ‌ర్శించారు.. ఇప్పుడు పురందేశ్వ‌రి కూడా అటువంటి విమ‌ర్శ‌లు చేయ‌డం వెనుక ఇది వాస్త‌వ‌మా అనే ఆలోచ‌న కూడా వ‌స్తోంది ప్ర‌జ‌ల్లో.