జగన్.. ఇజ్రాయిల్ లో ఏం చేస్తున్నాడో తెలిస్తే షాక్ అవుతారు..?

142

ఏపీ సీఎం జగన్ కుటుంబసభ్యులతో కలిసి జెరూసలేం టూర్ కి వెళ్లిన సంగతి తెలిసిందే. ఈ టూర్ లో భాగంగా జగన్ ఇజ్రాయిల్ చేరుకున్నారు. ఆయన ముందుగా జెరూసలేం వెళ్ళి ఆ తర్వాత అమెరికా వెళ్లారన్నది ముందుగా ఉన్న సమాచారం.. అయితే ఆయన విదేశీ పర్యటన దేశాల జాబితాలో ఇజ్రాయిల్ కూడా ఉంది.అందుకే అక్కడ పర్యటించాడు. అక్కడ జగన్ కొత్త లుక్ లో కనిపించారు. నిత్యం వైట్ అండ్ వైట్ డ్రెస్ లో సింపుల్ గా కనిపించే జగన్.. ఇజ్రాయిల్ లో ఇన్ ష్టర్ లో కనిపించారు. ఈ డ్రెస్ లో జగన్ చాలా స్మార్ట్ గా కనిపిస్తున్నారని అభిమానులు అంటున్నారు.

ఇజ్రాయిల్.. నీటి వనరులు అంతగా లేని దేశం.. కానీ ఉన్న నీటిని సద్వినియోగం చేసుకుని ప్రపంచానికి ఆదర్శంగా నిలిచింది. ఏపీ అభివృద్ధికి అడ్డుగా నిలుస్తున్న నీటి కొరతకు ఇజ్రాయిల్ సాంకేతిక పరిజ్ఞానం సమాధానంగా నిలుస్తోంది. అంతే కాదు నీటి కొరతకు ఓ చక్కటి పరిష్కారం కనుగొంది. సముద్రం నీటిని శుద్ది చేసి మంచినీటిగా మార్చే సాంకేతికతను విరివిగా వాడుతోంది. ఏపీ సీఎం జగన్ తన ఇజ్రాయిల్ పర్యటనలో హాథేరా నగరంలోని డిశాలినేషన్ ప్లాంట్‌ను పరిశీలించారు.. జగన్మోహన్ రెడ్డి ఇజ్రాయిల్ పర్యటన సందర్భంగా అక్కడ సాగుతున్న వివిద అభివృద్ది, నీటి సంరక్షణ కార్యక్రమాలను పరిశీలించారు. జగన్ అక్కడి వ్యవసాయ క్షేత్రాలను కూడా పరిశీలించారు. ఉప్పునీటిని శుద్ది చేసే ప్రక్రియను జగన్ అడిగి తెలుసుకున్నారు. అక్కడి అదికారులు ఉప్పు నీటిని తాగునీరుగా మార్చే మెకానిజం మరియు ప్రాజెక్టుకు సంబంధించిన ఆర్థిక వ్యవస్థ, వ్యయంపై జగన్ కు పవర్ పాయింట్ ప్రదర్శన ఇచ్చారు. ప్రాజెక్టుకు ఏర్పాటుకు పెట్టిన ఖర్చు, కార్యాచరణ ఖర్చుల గురించి వివరించారు. ఆ కేంద్రంలో శుద్ది చేసిన నీటిని ముఖ్యమంత్రి సహా అధికారులు రుచి చూశారు. నాణ్యత బావుండటంతో వారిని అభినందించారు.

Image result for జగన్.. ఇజ్రాయిల్

ఇజ్రాయిల్ దేశ సాంకేతితక ఏపీకి బాగానే పనికొస్తుంది. ఏపీకి దేశంలోనే రెండో అతిపెద్ద తీర ప్రాంతం ఉంది. తీరం పొడవునా మంచినీటికి ఇబ్బందులూ ఉన్నాయి. ఈ టెక్నాలజీ సాయంతో సముద్రం నీటిని మంచినీరుగా మార్చగలిగితే.. తాగునీటి సమస్య పరిష్కారం అవుతుంది. తక్కువ ఖర్చుతో ఇలాంటి టెక్నాలజీని వాడుకుంటే.. రాష్ట్రానికి తీరప్రాంతంలో తాగునీటికి కొరత ఉండదు. ఇక జగన్ నాలుగు రోజుల పాటు జెరూసలేంలో ఉంటారు. ఫ్యామిలీతో కలిసి ఆయన టూర్ కి వెళ్లారు. ఆగస్టు 5వ తేదీన మధ్యాహ్నం వైఎస్ జగన్ అమరావతి చేరుకోనున్నారు. ఇన్నాళ్లు రాజకీయాలతో బిజీబిజీగా గడిపిన జగన్.. ఇప్పుడు ఫ్యామిలీతో వెకేషన్ మూడ్ లోకి వెళ్లారు. ఫారిన్ టూర్ లో భార్య, పిల్లలతో ఎంజాయ్ చేస్తున్నారు.