కశ్మీర్ ఇప్పుడెలా ఉంది అక్కడ ముఖ్యమంత్రులను ఏం చేసారో తెలిస్తే షాక్

100

కశ్మీర్ కు సంబంధించి చారిత్రక సంచలన నిర్ణయాలు తీసుకుంటూ దూసుకెళ్లిపోతోంది మోడీ సర్కారు. కశ్మీర్ కు చేయాల్సిన చికిత్సను ఇన్నాళ్లకు చేసిన మోడీ తీరుపై సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది. ఇదిలా ఉంటే.. కొన్ని పార్టీలు మాత్రం మోడీ ప్రభుత్వ చర్యను తీవ్రంగా తప్పు పడుతున్నారు. ఇదిలా ఉంటే.. సంచలన నిర్ణయాలకు కారణమైన కశ్మీరులో ఇప్పుడు ఎలాంటి పరిస్థితి ఉంది? అక్కడి నేతలు ఏం చేస్తున్నారు? ఇప్పుడెక్కడ ఉన్నారు? అన్న ప్రశ్నలకు సమాధానాలు వెతికితే ఆసక్తికర సమాచారం బయటకు వస్తుంది.

Image result for ఒమర్ అబ్దుల్లా.. మొహబూబా ముఫ్తీలతో

జమ్ముకశ్మీర్ కు ఉన్న ప్రత్యేక ప్రతిపత్తిని పూర్తిగా రద్దు చేయటమే కాదు.. ప్రత్యేక రాష్ట్రంగా ఉన్న ఆ రాష్ట్రాన్ని రెండు కేంద్రపాలిత ప్రాంతాలుగా ఏర్పాటు చేస్తూ.. పార్లమెంటులో బిల్లుకు ఆమోద ముద్ర పడిన సంగతి తెలిసిందే. మరీ.. విషయంపై కశ్మీర్ ప్రాంతానికి చెందిన కీలక నేతలకు సంబంధించిన సమాచారం ఇప్పుడు బయటకు వచ్చింది. తాజా పరిణామాల నేపథ్యంలో కశ్మీర్ లోయలో నిర్బంధం సాగుతోంది. జమ్ముకశ్మీర్ లోని 400 మంది రాజకీయ నేతలు.. వారి అనుచరులు.. ప్రత్యేక వాదుల్ని కేంద్ర భద్రతా బలగాలు అరెస్ట్ చేశాయి.

ఈ క్రింది వీడియో ని చూడండి

జమ్ముకశ్మీర్ లోని పలు హోటళ్లు.. అతిధి గృహాలు – ప్రభుత్వ – ప్రైవేటు భవనాలను తాత్కాలిక జైళ్లుగా మార్చి – వాటిలో 400 మందిని ఉంచారు. ఇలా అదుపులోకి తీసుకున్న నేతల్లో మాజీ ముఖ్యమంత్రులు ఒమర్ అబ్దుల్లా.. మొహబూబా ముఫ్తీలతో పాటు ఫరూఖ్ అబ్దుల్లాలను సైతం నిర్భందంలోకి తీసుకున్నారు.పలు ప్రభుత్వ అతిధి గృహాల్లోనూ.. ప్రోటోకాల్ బిల్డింగ్ లలోనూ.. ప్రభుత్వ.. ప్రైవేటు క్వార్టర్లను తాత్కాలిక జైళ్లుగా మార్చారు. అరెస్ట్ చేసిన నేతల్ని అందులో ఉంచారు. మాజీ ముఖ్యమంత్రులు ఒమర్.. మెహబూబాలను అరెస్ట్చేసి హరి నివాస్ లోని వేర్వేరు కాటేజీలకు తరలించారు. కశ్మీర్ ను భారత్ నుంచి విడిదీయాలని కోరుకునే 91 ఏళ్ల సయ్యద్ అలీషా గిలానీని అరెస్ట్ చేశారు. తనను హౌస్ అరెస్ట్ చేశారంటూ నేషనల్ కాన్ఫరెన్స్ నేత ఫరూఖ్ అబ్దుల్లా ఆరోపించారు.

Image result for ఫరూఖ్ అబ్దుల్లా

మరి.. ఇలా అందరిని హౌస్ అరెస్ట్ లు.. అదుపులోకి తీసుకోవటం సరైనదేనా? అంటే.. కీలక నిర్ణయాన్ని తీసుకున్న వేళ.. భావోద్వేగంతో వారు చేసే వ్యాఖ్యలు ఇష్యూను మరింత ఇబ్బందికరంగా మార్చటం ఖాయం. దాంతో పోలిస్తే.. మోడీ సర్కారు అనుసరిస్తున్న విధానమే బెటర్ అన్న అభిప్రాయం పలువురు వ్యక్తం చేస్తున్నారని చెప్పాలి. 70 ఏళ్లుగా కశ్మీర్ విషయంలో ప్రభుత్వాలు చేసిన తప్పుల్ని ఇప్పుడు సరి చేస్తున్న వేళ.. ఇలాంటి చర్యలు తప్పవనే చెప్పాలి.