ఆర్టికల్ 370, 35A అంటే ఏమిటి..అసలు దీని గురించి కాశ్మీర్ లో ఎందుకు రచ్చ జరుగుతుంది

450

గత కొద్ది రోజులుగా జమ్మూ కశ్మీర్లో పరిణామాలు వేగంగా మారుతున్నాయి. కేంద్రం భారీ సంఖ్యలో బలగాలను కాశ్మీర్ లో మోహరిస్తోంది. అదే సమయంలో జమ్మూ కశ్మీర్‌ నుంచి యాత్రికులు, పర్యాటకులను వెనక్కి పంపిస్తున్నారు. ఆ రాష్ట్రానికి ప్రత్యేక హోదా కల్పించే ఆర్టికల్ 370ని రద్దు చేస్తున్నట్లు అమిత్ షా రాజ్యసభలో ప్రకటించారు. అసలు ఆర్టికల్ 370. 35a అంటే ఏమిటి..అసలు దాని మీద కాశ్మీర్ లో ఎందుకు ఇంత రచ్చ జరుగుతుంది.. ఆ విషయాలన్నిటి గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

Image result for kashmir
  • జమ్మూ కశ్మీర్‌కు స్వయం ప్రతిపత్తి కల్పిస్తూ నాటి భారత ప్రభుత్వం చేసిన ఏర్పాటే ఆర్టికల్ 370. దేశంలో ఉన్న ఇత‌ర రాష్ట్రాల అసెంబ్లీల‌కు లేని ప్ర‌త్యేక అధికారాలు జ‌మ్మూ కాశ్మీర్‌కు ఉంటాయి. ఈ క్ర‌మంలో వారు మ‌నదేశ పార్ల‌మెంట్‌తో సంబంధం లేకుండా అక్క‌డ అసెంబ్లీలో ప్ర‌త్యేక చ‌ట్టాలు చేసుకోవ‌చ్చు. దీని ప్రకారమే 1965 వరకూ ఆ రాష్ట్రానికి సీఎం బదులు ప్రధాని, గవర్నర్ స్థానంలో ప్రెసిడెంట్ ఉండేవారు. రక్షణ, విదేశీ వ్యవహారాలు, ఆర్థిక, సమాచార శాఖల వ్యవహారాలు మినహా మిగతా చట్టాల అమలుకు ఆ రాష్ట్ర ప్రభుత్వ ఆమోదం తప్పనిసరి.
  • ఆర్టికల్ 370 పట్ల రాజ్యాంగ నిర్మాత బీఆర్ అంబేద్కర్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈ ఆర్టికల్‌ను గోపాలస్వామి అయ్యంగార్ రూపొందించారు. ఆయన అంతకు ముందు జమ్మూ కశ్మీర్ రాజు మహారాజా హరి సింగ్ వద్ద దివాన్‌గా పని చేశారు.

ఈ క్రింద వీడియో చూడండి

  • యుద్ధం, విదేశీ దురాక్రమణ సమయంలోనే కేంద్రం ఆ రాష్ట్రంలో ఎమర్జెన్సీ విధించగలదు. అంతర్గత ఘర్షణలు తలెత్తినప్పుడు కూడా రాష్ట్ర ప్రభుత్వ సమ్మతి లేనిదే ఎమర్జెన్సీ విధించలేం.
  • జమ్మూ కశ్మీర్‌కు ప్రత్యేక రాజ్యాంగం, ప్రత్యేక పీనల్ కోడ్ ఉన్నాయి. రాష్ట ప్రజలకు ద్వంద్వ పౌరసత్వం ఉంటుంది. జమ్మూ కశ్మీర్ అసెంబ్లీ కాలపరిమితి ఆరేళ్లు.
  • ఇక ఆర్టిక‌ల్ 35ఎ ద్వారా జ‌మ్మూ కాశ్మీర్ శాశ్వ‌త నివాసి ఎవ‌రు అన్న‌ది నిర్దారిస్తారు. అంటే అక్క‌డ 10 ఏళ్లుగా స్థిరంగా నివాసం ఉన్న‌వారు లేదా.. 1954 మే 14వ తేదీ ముందు నుంచి ఉన్న‌వారిని కాశ్మీర్ శాశ్వ‌త పౌరులుగా నిర్ణయిస్తారు. ఈ క్ర‌మంలోనే ఆ రాష్ట్రంలోని సంక్షేమ ప‌థ‌కాలు, విద్యార్థుల‌కు స్కాల‌ర్‌షిప్‌లు స్థిర నివాసి అన్న ముద్ర ప‌డ్డ కాశ్మీర్ పౌరుల‌కే వ‌ర్తిస్తాయి. ఇక దేశంలో ఉన్న ఇత‌ర రాష్ట్రాల‌కు చెందిన వారు కాశ్మీర్‌లో భూముల‌ను కొనుగోలు చేయ‌లేరు. ఇలా ఆర్టిక‌ల్ 35ఎ ద్వారా జ‌మ్మూ కాశ్మీర్ ప్ర‌జ‌ల‌కు కొన్ని ప్ర‌త్యేక హ‌క్కులు ఉంటాయి.
Image result for modi

కాగా కేంద్ర ప్ర‌భుత్వం ఆర్టిక‌ల్ 370, ఆర్టిక‌ల్ 35ఎ ల‌ను ర‌ద్దు చేస్తే గ‌న‌క ఇక‌పై జ‌మ్మూ కాశ్మీర్ కూడా మ‌న దేశంలోని ఇత‌ర రాష్ట్రాల్లో ఒక‌టిగానే సాధార‌ణ రాష్ట్రంగానే ఉంటుంది. దానికి ఎలాంటి స్వ‌యం ప్ర‌తిప‌త్తి ఉండ‌దు. ఇక అక్క‌డి పౌరుల‌కు ఎలాంటి ప్రత్యేక హ‌క్కులూ ఉండ‌వు. అన్ని రాష్ట్రాల్లానే సాధార‌ణ రాష్ట్రంగానే జ‌మ్మూ కాశ్మీర్‌ను ప‌రిగ‌ణిస్తారు. అయితే కేంద్ర ప్ర‌భుత్వం ఈ రెండు ఆర్టిక‌ల్స్‌ను ర‌ద్దు చేసే నిర్ణ‌యం తీసుకుంటుందా.. లేక పాక్ ఆక్ర‌మిత కాశ్మీర్ (పీవోకే)ను స్వాధీనం చేసుకుంటామ‌ని ప్ర‌క‌టిస్తుందా.. అన్న‌ది ఉత్కంఠ‌గా మారింది. అయితే ఆర్టిక‌ల్ 370, 35ఎ ల‌ను ర‌ద్దు చేస్తే కాశ్మీర్‌లో పెద్ద ఎత్తున హింస చెల‌రేగే అవ‌కాశం ఉంటుంది క‌నుక‌నే అక్క‌డ పెద్ద ఎత్తున బ‌ల‌గాల‌ను మోహ‌రించారు. ఇక పీవోకేను స్వాధీనం చేసుకోవాల‌ని చూస్తే భార‌త్‌, పాక్‌ల మ‌ధ్య క‌చ్చితంగా యుద్ధం వ‌స్తుంది. అందుకు కూడా పెద్ద ఎత్తున సైన్యం కావాలి. క‌నుక‌నే ముందు జాగ్ర‌త్త‌గా జ‌మ్మూ కాశ్మీర్‌లో బ‌ల‌గాల‌ను మోహ‌రించారు. అయితే ఇవాళ కేంద్ర కేబినెట్ స‌మావేశం అనంత‌రం హోం మంత్రి అమిత్ షా లోక్‌స‌భ‌లో కాశ్మీర్‌పై ప్ర‌క‌ట‌న చేస్తార‌ని తెలుస్తోంది. మ‌రి ఈ విష‌యంలో స్ప‌ష్ట‌త రావాలంటే ఆ ప్ర‌క‌ట‌న వ‌చ్చే వ‌ర‌కు వేచి చూడ‌క త‌ప్ప‌దు..