CM జగన్ అమెరికాలో ఏం చేయ్యబోతున్నారో తెలుసా?

87

ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఇటీవలె జెరూసలేం వెళ్లివచ్చారు. కుటుంబ సమేతంగా ఆయన జెరూసలేం వెళ్లడంతో ముఖ్యమంత్రి అయ్యాక లాంగ్ ట్రిప్ అని అందరూ అనుకున్నారు. ఇక తాజాగా మరో టూర్ కు కూడా ముఖ్యమంత్రి జగన్ సిద్దం అయ్యారు. ఇది గతంలోనే ఫిక్స్ అయిన టూర్ , ఆయన కొన్ని రోజులు ఏపీలో ఉండరు అనేసరికి చకచక వర్కులు కొన్ని జరుగుతున్నాయి..ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత తొలిసారిగా అమెరికా పర్యటనకు వెళుతున్నవైసీపీ అధినేత వైఎస్‌ జగన్‌ కి ఘన స్వాగతం పలికేందుకు ప్రవాసాంధ్రులు భారీగా ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ నెల 15వ తేదీ నుంచి వారం రోజుల పాటు సీఎం జగన్ అమెరికా పర్యటన కొనసాగనుంది 24న తాడేపల్లికి తిరిగి వస్తారు.. అలాగే అక్కడ ఉన్న పార్టీ అభిమానులు కూడా జగన్ అన్నని చూడాలి అనే కోరికతో ఉన్నారు. కొత్త ప్రభుత్వంతో కలిసి పనిచేస్తామని స్కూల్స్ లో ఎలాంటి ఫర్నిచర్ కావాలి అన్నా, లేదా మౌలిక సదుపాయాలు కావాలి అన్నా కల్పిస్తామని కొందరు జగన్ కు చెప్పనున్నారట.. తమ సొంత ప్రాంతంలో స్కూల్స్ అభివ్రద్దికి తాము తోడ్పాటు అందిస్తామని చెప్పనున్నారు.

Image result for jagan

ఆగస్టు 15న స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల్లో పాల్గొన్న తర్వాత అదే రోజు ఆయన హైదరాబాద్‌ వెళ్తారు. అక్కడి నుంచి కుటుంబ సభ్యులతో రాత్రికి శంషాబాద్‌ విమానాశ్రయం నుంచి అమెరికాకు బయలుదేరతారు. ఈ సందర్భంగా వైఎస్‌ జగన్‌ ఆగస్ట్‌ 17న డల్లాస్‌లో ప్రవాసాంధ్రులను ఉద్దేశించి ప్రసంగిస్తారు. ప్రవాసాంధ్రుల కోరిక మేరకు జగన్ ప్రసిద్ధిగాంచిన డల్లాస్ కన్వెన్షన్ సెంటర్ (కే బెయిలీ హచీసన్ కన్వెన్షన్ సెంటర్) లో ప్రసంగించనున్నారు. ఇందుకోసం ఇప్పటికే అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి.ఈ పర్యటన సందర్భంగా ఏపీలో పెట్టుబడులకు ఉన్న సానుకూల వాతావరణంపై జగన్ పలువురు ప్రముఖులతో సమావేశం కానున్నట్టు తెలుస్తోంది. వైఎస్ జగన్‌ కొద్దిరోజుల క్రితమే.. ముఖ్యమంత్రి హోదాలో డిప్లొమాటిక్ పాస్‌పోర్ట్ పొందారు. విజయవాడలో ఉన్న పాస్‌పోర్ట్‌ కార్యాలయానికి వెళ్లిన జగన్.. పాస్‌పోర్ట్ తీసుకున్నారు. ఆ తర్వాతే ఈ అమెరికా పర్యటన ఖాయమయ్యింది. వారం పాటూ కుటుంబంతో కలిసి అమెరికాలో పర్యటించబోతున్నారు.

ఈ క్రింద వీడియో చూడండి

అయితే జగన్ పెద్ద కూతురు హర్షకు లండన్ లోని ప్రతిష్టాత్మకమైన కేంబ్రిడ్జి వర్సిటీలో సీటు వచ్చిన సంగతి తెలిసిందే.. ఇప్పుడు సీఎం జగన్ చిన్న కుమార్తె వర్షా రెడ్డిని అమెరికాలోని ఒక ప్రముఖ విశ్వవిద్యాలయంలో గ్యాడ్యుయేట్ కోర్సులో చేర్పించేందుకు వెళుతున్నారని సమాచారం. ఇలా ఇద్దరు ఉన్నత చదువుల చదవడం నిజంగా తండ్రిగా కూడా జగన్ గ్రేట్ అంటున్నారు వైసీపీ అభిమానులు..అయితే ఇద్దరూ కూడా తండ్రికి తగ్గ కూతుర్లు అని జగన్ కూడా ఫస్ట్ క్లాస్ స్టూడెంట్ అని చెబుతున్నారు పార్టీ నేతలు.. తెలుగుదేశం నేతలు విమర్శలు చేసినట్లు, జగన్ చదువులో అలా ఎప్పుడూ లేరు అని గతంలోజగన్ స్నేహితుడు సుమంత్ ఇంటర్వ్యూలో కూడా తెలియచేశారు. జగన్ మాత్రం తన పిల్లలను కూడా మంచి చదువులు చదివిస్తున్నారు.. ముఖ్యంగా అమ్మాయిలు చదువు బాగా చదివి పైకిరావాలి అని జగన్ భావిస్తారు. అందుకే తమ కూతుళ్లని కూడా వారి ఇష్టం మేరకు వారు ఏం చదవాలంటే అదే చదివిస్తున్నారు అని తెలుస్తోంది.. జగన్ చిన్న కుమార్తె కూడా అమెరికాలో చదివేందుకు ఆసక్తి చూపించారట. అందుకే జగన్ అక్కడ ఆమె కాలేజీ గురించి కూడా తెలుసుకోనున్నారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.