వివేకా మ‌ర్డ‌ర్ మిస్ట‌రీ బ‌య‌ట‌ప‌డ్డ SMS తిట్లు హెచ్చ‌రిక‌లు

280

మాజీ మంత్రి వైఎస్‌ వివేకానందరెడ్డి హత్య కేసు దర్యాప్తు కొనసాగుతోంది. విచారణలో భాగంగా వైఎస్ వివేకానందరెడ్డి సోదరులు ఆదివారం పులివెందులలోని డీఎస్పీ కార్యాలయానికి వెళ్లారు. అనంతరం వైఎస్‌ భాస్కర్‌ రెడ్డి మాట్లాడుతూ..’పోలీసులు పిలిస్తే డీఎస్పీ కార్యాలయానికి వచ్చాం. పోలీసులకు అన్నివిధాల సహకరిస్తాం. హత్య జరిగిన వెంటనే మేమంతా అక్కడికి వెళ్లాం. అక్కడ ఏమి జరిగిందనే అంశంపై ఆరా తీశారు. కేసులో మాకు అనేక అనుమానాలు ఉన్నాయి. అన్యాయంగా వివేకాను చంపేశారు. ఆయన చాలా మంచివ్యక్తి’ అని అన్నారు.

Image result for ys vivekananda reddy letter

మరోవైపు వివేకానందరెడ్డి బావమరిది శివప్రకాష్‌ రెడ్డి కూడా డీఎస్పీ కార్యాలయంలో విచారణకు హాజరయ్యారు. కాగా ఘటనా స్థలంలో సాక్ష్యాలు తారుమారు, రక్తాన్ని తుడిచి వేయడం, మృతదేహాన్ని బాత్‌రూం నుంచి బెడ్‌రూంకి ఎందుకు తెచ్చారు అనే కోణంలో ప్రశ్నించిన పోలీసులు…వీరందరి స్టేట్‌మెంట్‌ రికార్డు చేశారు. ఇక దారుణ హత్యకు గురైన మాజీ మంత్రి వైఎస్‌ వివేకానందరెడ్డి హత్య కేసును ఛేదించేందుకోసం 12 బృందాలు పనిచేస్తున్నాయని జిల్లా ఎస్పీ రాహుల్‌దేవ్‌శర్మ చెప్పారు. ఆదివారం రాత్రి డీపీఓలోని కాన్ఫరెన్స్‌ హాలులో ఆయన మీడియాతో మాట్లాడారు. వివేకానందరెడ్డి హత్య కేసును సీఐడీ అడిషనల్‌ డీజీ అమిత్‌గార్గ్‌ పర్యవేక్షణలో ప్రత్యేక దర్యాప్తు బృందాలు పర్యవేక్షిస్తున్నాయని, ఇందులో సిట్‌ ఆధ్వర్యంలో ఐదు బృందాలు పనిచేస్తుండగా, జిల్లా పోలీసుల ఆధ్వర్యంలో ఏడు బృందాలు పనిచేస్తున్నాయని చెప్పారు.

ఈ క్రింది వీడియో చూడండి 

వివేకానందరెడ్డి ఈ నెల 15వ తేదీ రాత్రి 11.30 గంటలకు పులివెందులలోని తన స్వగృహానికి వచ్చారని, ఇంటికి రాగానే డ్రైవర్‌ను పంపించి నిద్రపోయారన్నారు. తెల్లవారేసరికి ఆయన హత్యకు గురయ్యారని, ఈ నేపథ్యంలో ఆయన నిద్రకు ఉపక్రమించినప్పటి నుంచి మరుసటిరోజు ఉదయం 5.30 గంటల్లోపు ఏం జరిగి ఉంటుందనే దానిపై పూర్తిస్థాయిలో విచారిస్తున్నామని చెప్పారు. ఇక ఆయ‌న మోబైల్ కు వ‌చ్చిన మెసేజ్ లు అలాగే కాల్స్ ప‌రిశీలిస్తున్నారు ఇంటి ప‌నిమ‌నుషులు డ్రైవ‌ర్ ప్ర‌సాద్ ను కూడా అదుపులోకి తీసుకున్నారు…హత్య జరిగిన రోజు ఉదయాన్నే డాగ్‌స్క్వాడ్, క్లూస్‌ టీంలతో సమగ్రంగా విచారించి ఆధారాలు సేకరించామన్నారు. కేసును సిట్‌కు అప్పజెప్పడంతో అన్ని కోణాల్లో విచారణ కొనసాగిస్తున్నట్లు తెలిపారు. ఇంతవరకు 20 మంది సాక్షులను విచారించామన్నారు. ఈ కేసులో ఫింగర్‌ ప్రింట్‌ బ్యూరో, ఫోరెన్సిక్‌ సైన్స్‌ ల్యాబ్‌ సేవల్నీ వినియోగించుకుంటున్నామని చెప్పారు. ఆ లేఖ‌లో రాసిన హ్యాండ్ వ్రైటింగ్ ఫింగ‌ర్ ప్రింట్స్ అన్ని ప‌రిశిలిస్తామ‌ని చెప్పారు. ఈ స‌మ‌యంలో పులివెందుల‌లో ఓ క‌రుడుగ‌ట్టిన రౌడీని అరెస్ట్ చేశారు అని తెలుస్తోంది అత‌న‌ని విచారణ‌లో మ‌రిన్నీ కీల‌క విష‌యాలు చెప్పాడు అనే వార్త వైర‌ల్ అవుతోంది. మ‌రి దీనిపై పోల‌సులు ఎలాంటి స‌మాచారం ఇవ్వ‌లేదు. చూడాలి సిట్ ఎటువంటి విష‌యం ఈ కేసు ప‌రిశోధ‌న‌లో తెలియ‌చేస్తుందో.