మ‌ళ్లీ టీడీపీని సెంట‌ర్ చేసిన విష్ణుకుమార్ రాజు

370

టీడీపీ బీజేపీ మిత్ర బంధంగా ఉన్నా స‌రే విమ‌ర్శ‌లు చేస్తూ అధికార పార్టీని విమ‌ర్శించే వారు ఆయ‌న‌… ఎటువంటి లోపాలు ఉన్నా వారిని ప్ర‌శ్నించేవారు… బీజేపీ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు.. ఇక ఇప్పుడు కూడా అదే పందా అనుస‌రిస్తున్నారు బీజేపీ శాస‌న‌స‌భాప‌క్ష నాయ‌కుడు.. విశాఖపట్నం రైల్వే జోన్‌, కడప ఉక్కు ఫ్యాక్టరీలను ఏపీకి కేటాయించేందుకు కేంద్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని బీజేపీ శాసనసభాపక్ష నేత, ఎమ్మెల్యే విష్ణు కుమార్‌ రాజు అన్నారు….కేంద్రం ఇచ్చిన నిధుల‌పై స‌రైన స‌మాధానాలు ఇక్క‌డ అధికార పార్టీ చెప్ప‌డం లేద‌ని ఆయ‌న విమ‌ర్శించారు.

Image result for bjp vishnu kumar raju

ఇక కేంద్రం రైల్వేజోన్ పై ప్ర‌క‌ట‌న చేస్తుంద‌ని త్వ‌ర‌లోనే రైల్వేజోన్ ప్ర‌క‌ట‌న ఏపీ ప్ర‌జ‌ల‌కు తెలుస్తుంది అని ఆశాభావం వ్య‌క్తం చేశారు ..దుగరాజపట్నం పోర్టుకు ప్రత్యామ్నాయ భూమి చూపిస్తే పోర్టు నిర్మించేందుకు కేంద్ర ప్రభుత్వం సిద్ధంగా ఉందని దీనికి రాష్ట్ర ప్ర‌భుత్వం సుముఖంగా లేదు అని ఆయ‌న అన్నారు… పోల‌వ‌రానికి ఎంత ఖ‌ర్చు అయినా కేంద్రం పెట్టేందుకు రెడీగా ఉంద‌ని ఆయ‌న అన్నారు..

Related image

ఏపీలో అవినితి అక్ర‌మాలు ఇసుక దందాలు పెరిగిపోయాయి అని ఆయ‌న విమ‌ర్శించారు..కేంద్రం ఎంత సాయం చేసినా ఇక్క‌డ రాష్ట్ర ప్ర‌భుత్వం మాత్రం ఎటువంటి నిజాలు చెప్ప‌డం లేద‌ని కేంద్రంఅన్ని హామీలు నెర‌వేరుస్తుంద‌ని తెలియ‌చేశారు ఆయ‌న‌…బీజేపీ రాష్ట్ర కోర్ కమిటీ సమావేశం జ‌రుగుతోంది. ఇక్క‌డ రాష్ట్రంలో బీజేపీ అభివృద్దికి ఎటువంటి కార్య‌క్ర‌మాలు చేయాలి అనేది చ‌ర్చించ‌నున్నారు…..ఈ సమావేశానికి ఏపీ బీజేపీ మాజీ అధ్యక్షుడు విశాఖ ఎంపీ కంభం హారిబాబు గైర్హాజరయ్యారు. మ‌రి ఈ విషయం ఏమిటో చూడాలి.