శివాజీ సీక్రెట్ ను బ‌య‌ట‌పెట్టిన రాజుగారు

335

న‌టుడు శివాజీ చంద్ర‌బాబుకు నోటీసులు వ‌స్తాయి అని, ఆయ‌న పై కుట్ర జ‌రుగుతోంది అని చెబుతున్న అంశం ఏపీలో వైర‌ల్ అవుతోంది.. ఇక ధ‌ర్మాబాద్ కోర్టు నుంచి నోటీసులు రావ‌డంతో ఇప్పుడు ఇదే విష‌యం పై చ‌ర్చ జ‌రుగుతోంది. తాజాగా తెలంగాణ ఎన్నికల్లో లబ్ది పొందేందుకే టీడీపీ పార్టీ నోటీసుల డ్రామా ఆడుతోందని ఏపీ బీజేపీ ఎమ్మెల్యే విష్ణుకుమార్‌ రాజు ఆరోపించారు.. చిన్న‌చిన్న కేసుల‌కు కూడా ఏదో జ‌రిగిపోతోంది అనేలా మాట్లాడుతున్నారు అని బీజేపీ విమ‌ర్శించింది.

Image result for sivaji

ఇదివరకు నోటీసులు ఎన్టీఆర్‌ ట్రస్ట్‌ భవన్‌లో అందుకున్నట్లు సమాచారం ఉందని తెలిపారు. అదే నోటీసులు వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు జగన్‌మోహన్‌ రెడ్డికి వస్తే మాత్రం కోర్టులపై గౌరవం ఉందని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు మాట్లాడేవారని ఎద్దేవా చేశారు… చంద్రబాబుకు కోర్టు నుంచి నోటీసులు వస్తే ప్రధాని నరేంద్ర మోదీ చేయించారనడం హాస్యాస్పదమన్నారు.

Image result for vishnukumar raju

ఇక కోర్టులు అంటే చంద్ర‌బాబుకు ఎంత గౌర‌వ‌మో అంద‌రికి తెలుసు అని ఆయ‌న అన్నారు.. హీరో శివాజీతో డ్రామాలు ఆడించేది తెలుగుదేశం పార్టీ అని అంద‌రికి తెలుసు అని అన్నారు ఆయ‌న‌. కోర్టుల నుంచి స్టేలు తెచ్చుకోవ‌డం చంద్ర‌బాబుకు కొత్త ఏమీ కాదు అని ఆయ‌న గుర్తుచేశారు… ఇక కోర్టు నుంచి నోటీసులు వ‌స్తే ప్ర‌ధాని ఇప్పించారు అని అన‌డం చాలా దారుణం అని ఇది కాంగ్రెస్ పార్టీ అక్క‌డ అధికారంలో ఉన్న స‌మ‌యంలో జ‌రిగిన కేసు అని ఆయ‌న తెలియ‌చేశారు..