ప‌వ‌న్ పై జోస్యం చెప్పిన విజ‌య‌వాడ ఎంపీ

282

ప‌వ‌న్ క‌ల్యాణ్ కు రాజ‌కీయం ఎక్క‌డా కూడా ఎదుగుద‌ల ఉంటుంది అనేది క‌నిపించ‌డం లేదు అని, టీడీపీ నేత‌లు విమ‌ర్శిస్తున్నారు, ఆయ‌న ఎక్క‌డ పోటీ చేసినా ఓడిపోతాడ‌ని, ఏ జిల్లాలో కూడా ఆయ‌న పోటీ చేయ‌డానికి సాహ‌సం చేసినా అక్క‌డ ఓట‌మి త‌ప్ప‌దు అని అన్నారు.తాజాగా ప‌వ‌న్ పై విజయవాడ టీడీపీ ఎంపీ కేశినేని నాని జోస్యం చెప్పారు. విలేకరులతో నాని మాట్లాడుతూ..వాళ్ల అన్నయ్య చిరంజీవి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో 18 సీట్లు మాత్రమే గెలిచారనే విషయాన్ని గుర్తు చేశారు.

Image result for ఎంపీ కేశినేని

ఇక ఇప్పుడు పవన్‌ కల్యాణ్ ఒక యాక్టర్‌, అతన్ని చూడటానికి మాత్రమే ప్రజలు వస్తారు..అంతే కానీ వాపును చూసి బలుపు అనుకోకూడదని హితవు పలికారు. పవన్‌ కల్యాణ్‌ తన బలం, బలహీనత తెలుసుకుని మాట్లాడాలని హెచ్చరించారు. ఇష్టం వ‌చ్చిన రీతిలో అధికార పార్టీ నేత‌ల పై ఆరోప‌ణ‌లు చేస్తున్న ప‌వ‌న్ ముందు వాటిని నిరూపించాలి అని అన్నారు ఆయ‌న‌.మంత్రి జవహర్‌ మాట్లాడుతూ..పవన్‌ కల్యాణ్‌పై తీవ్రస్థాయిలో మండిపడ్డారు.

Image result for ఎంపీ కేశినేని

ఇక ఇలా ఒక్కొక్క‌రు ప‌వ‌న్ పై విమ‌ర్శ‌లు చేయ‌డం పెద్ద సంచ‌ల‌నంగా మారింది.. ప‌వ‌న్ పై ఇలా ఫోక‌స్ చేయ‌డం పై అంద‌రూ ఆలోచిస్తున్నారు .ముఖ్యంగా తెలుగుదేశం పార్టీపై ఇలా విమ‌ర్శ‌లు చేస్తున్న‌ప‌వ‌న్ స‌రైన సాక్ష్యాదారాలు చూపించి విమర్శ‌లు చేస్తే వాటికి న‌మ్మ‌శ‌క్యంగా ఉంటుంది అని అన్నారు నేత‌లు.. మ‌రి జ‌న‌సేనాని దీనిపై ఎటువంటి నిర్ణ‌యం తీసుకుంటారో చూడాలి.