విజయవాడ దుర్గగుడిలో అర్ధరాత్రి క్షుద్ర పూజలు.. ఎవరు? ఎందుకోసమో తెలిస్తే షాక్!

1109

అమ్మల గన్న అమ్మ దుర్గమ్మ .. ఎంతో చరిత్ర ఉన్న బెజవాడ కనక దుర్గ అమ్మ వారి గర్బ గుడి లో తాంత్రిక పూజలు చేసారు.. ఓ వైపు మూడనమ్మకాలు అంటూనే .. ఇలాంటి ఘోరమైన ఎలా చేసారు..

ఈ క్రింది వీడియో చూడండి.

ఎంతో పవిత్రమైన ఇంద్రకీలాద్రిపై వెలిసిన కనకదుర్గమ్మ ఆలయంలో రహస్యంగా తాంత్రికపూజలు నిర్వహించిన వ్యవహారం వెలుగుచూడటం ప్రకంపనలు సృష్టిస్తోంది. రాష్ట్రంలో అత్యంత కీలకమైన ఓ యువనేత పదవి కోసమే ఈ తాంత్రిక పూజలు నిర్వహించినట్టు ఆరోపణలు వస్తుండటం రాజకీయ దుమారం రేపుతోంది.

Image result for durgamma temple

దేవాలయం వారి టైమింగ్స్ కి వ్యతిరేకంగా వేళకాని, వేళలో జరిగిన ఆ పూజలు తీవ్ర కలకలం రేపుతున్నాయి. డిసెంబర్ 26న రాత్రి 10 గంటల నుంచి 11.30 మధ్యలో గర్భాలయం తలుపులు తెరిచి పూజలు నిర్వహించారని ఆరోపణలు వచ్చాయి.

అర్ధరాత్రి శాంతస్వరూపినిగా ఉన్న దుర్గమ్మవారిని మహిషాసుర మర్దినిగా అలంకరించి.. భైరవీ పూజలు నిర్వహించినట్టు తెలుస్తోంది. భైరవీ పూజలు నిర్వహిస్తే శక్తులు వస్తాయనే నమ్మకముంది. ఈ నేపథ్యంలో భైరవీ పూజలు నిర్వహించి.. అనంతరం మళ్లీ దుర్గామాతగా అలంకారాన్ని మార్చినట్టు సమాచారం..

Image result for durgamma temple

ఆలయంలోని సీసీటీవీ ఫుటేజీని తెప్పించి పరిశీలించగా, ఆ ఫుటేజీలో ఓ గుర్తు తెలియని ఆర్చకుడితో పాటు మరో ఇద్దరు అర్చకులు కనిపించడం.. ఆ సమయంలో దుర్గ గుడి తలుపులు తీసి ఉండటంతో ఇది ఎలా జరిగిందని పాలక మండలి సభ్యులు ఈవోని ప్రశ్నించారు.

ఇందుకు ఆలయం ఈవో అయిన సూర్యకుమారి వివరణ ఇలా ఇచ్చారు .. ప్రతి గురువారం మధ్యాహ్నం ఆలయాన్ని సంప్రోక్షణ చేస్తారు. కానీ ఈవో ఆలయ సంప్రోక్షణకు తానే అనుమతి ఇచ్చానని చెబుతూ…కాని పూజలు చేసింది ఎవరో తనకి తెలియదని బుకాయించారు. ఐతే ఆమెను ప్రభుత్వం బదిలీ చేసింది. ఆమె స్థానంలో ఇన్‌చార్జ్‌ ఈవోగా రామచంద్రమోహన్‌ను ప్రభుత్వం నియమించింది. ప్రస్తుతం సింహాచలం దేవాలయ ఈవోగా ఉన్న ఆయనను వెంటనే రిపోర్ట్‌ చేయాల్సిందిగా ప్రభుత్వం ఆదేశించింది.

సీసీటీవీ ఫుటేజీలో కనిపించిన ఆ అపరిచిత అర్చకుడు ఎవరో కనుక్కోవాలని ఈవో అధికారులను ఆదేశించారు. దీంతో విచారణ చేపట్టిన అధికారులు ఆలయంలో అమ్మవారికి అర్చన చేసే బదరీనాథ్ అనే వ్యక్తిని అపరిచిత అర్చకుడి గురించి ఆరా తీయగా.. అతనెవరో తనకు తెలియదని చెప్పారు.

Image result for durga temple eo

ఇటువంటి పూజలు ఆలయంలో జరగాలంటే, ఉన్నతాధికారి హస్తం లేకుండా జరగదని అంటున్నారు. తమిళనాడు నుంచి కూడా మరో ముగ్గురు అర్చకులు వచ్చి ఈ పూజలు నిర్వహించారని చెబుతున్నారు.

Image result for durga temple eo

దుర్గగుడిలో తాంత్రికపూజల పేరిట అర్ధరాత్రి జరిగిన అపచారంపై హిందువులు, భక్తులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఎంతో పవిత్రమైన, రాష్ట్రంలో అత్యంత ప్రధానమైన దుర్గమ్మ సన్నిధిలో ఇలాంటి అపచారం జరగడమేమిటని వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. హిందువులు, భక్తుల మనోభావాలు దెబ్బతీసేలా, ఆలయ పవిత్రతకు భంగం కలిగించేలా తాంత్రిక పూజలు నిర్వహించారని, ఈ వ్యవహారంలో ఎంతటి వారు ఉన్నా వదిలిపెట్టకూడదని భక్తులు డిమాండ్‌ చేస్తున్నారు.

ఈ విషయం పై పోలీస్ దర్యాప్తు చేస్తున్నారు ..ఎవ్వరు ఏంటి ? అనే విషయం తెలియాలి .